ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన హీరో మోటోకార్ప్.. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు 'హీరో' పేరును వాడుకోవచ్చు!

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భవిష్యత్తులో తాము తయారు చేయబోయే ఎలక్ట్రిక్ వాహనాలకు 'హీరో' (Hero) బ్రాండ్‌ పేరును ఉపయోగించుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హీరో ఎలక్ట్రిక్‌కి చెందిన నవీన్ ముంజాల్ తన మామ మరియు హీరో మోటోకార్ప్ ఛైర్మన్ అయిన పవన్ ముంజాల్‌తో 'హీరో' బ్రాండ్ వినియోగంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ కోసం తన కుటుంబానికి 'హీరో' బ్రాండ్‌పై ప్రత్యేక యాజమాన్య హక్కులు ఉన్నాయని నవీన్ ముంజాల్ తన వాదనలో పేర్కొన్నారు.

ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన హీరో మోటోకార్ప్.. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు 'హీరో' పేరును వాడుకోవచ్చు!

అయితే, ఈ విషయంపై మధ్యవర్తిత్వం వహిస్తున్న ఢిల్లీ హైకోర్టు బెంచ్, హీరో మోటోకార్ప్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ, కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాలకు 'హీరో' పేరును ఉపయోగించడానికి అనుమతించింది. ఈ నిర్ణయాన్ని అనుసరించి, హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఇప్పుడు భవిష్యత్తులో తాము తీసుకురాబోయే ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి 'హీరో' ట్రేడ్‌మార్క్‌ని ఉపయోగించడానికి మార్గం సుగమం అయింది.

ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన హీరో మోటోకార్ప్.. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు 'హీరో' పేరును వాడుకోవచ్చు!

ఓ నివేదిక ప్రకారం, హీరో మోటోకార్ప్ 2012 నుండి తన ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం 'హీరో' పేరును ఉపయోగించాలనే ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసిందని కోర్టు కనుగొంది. ఈ బ్రాండ్ నేమ్ వివాదం కారణంగా, హీరో మోటోకార్ప్ తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను 'విదా' బ్రాండ్‌ పేరుతో విడుదల చేయాలని భావించింది. అయితే, ఏం జరిగిందో ఏమో కానీ హీరో మోటోకార్ప్ జులై 2022 నెలలో 'విదా' బ్రాండ్‌తో విడుదల చేయాలనుకున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ ఈ ఏడాది పండుగ సీజన్‌కు వాయిదా వేసింది.

ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన హీరో మోటోకార్ప్.. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు 'హీరో' పేరును వాడుకోవచ్చు!

గడచిన 2010లో, హీరో గ్రూప్ యొక్క పితామహుడు బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ కుటుంబం, కుటుంబ-భాగస్వామ్య వ్యాపార ఒప్పందంలో హీరో మోటోకార్ప్ మరియు హీరో కార్పొరేట్ సర్వీసెస్‌పై నియంత్రణను పొందింది. ఈ ఒప్పందం ప్రకారం, హీరో ఎలక్ట్రిక్ యొక్క ప్రపంచ హక్కులు పవన్ ముంజాల్ కజిన్ వినయ్ ముంజాల్ మరియు అతని కుమారుడు నవీన్ ముంజాల్ వద్ద ఉన్నాయి. ఓం ప్రకాష్ ముంజాల్ హీరో సైకిల్స్, హీరో మోటార్స్ మరియు ముంజాల్ సేల్స్ కార్పొరేషన్ యాజమాన్యాన్ని పొందారు, అతని కుమారుడు పంకజ్ ముంజాల్ ప్రస్తుతం హీరో సైకిల్స్ ఛైర్మన్‌గా ఉన్నారు.

ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన హీరో మోటోకార్ప్.. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు 'హీరో' పేరును వాడుకోవచ్చు!

హీరో గ్రూప్‌కి చెందిన హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) సంస్థ ఇప్పటికే దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. అయితే ఈ కంపెనీకి మరియు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కంపెనీకి మధ్య నేరుగా ఎలాంటి సంబంధం లేదు. ఇవి రెండూ కూడా ఒకే కుటుంబ సభ్యులు కలిగి ఉన్న వేర్వేరు వ్యాపారాలు. ఈ నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలకు అదే పేరును (హీరో) ఉపయోగించినట్లయితే, ఒకేరకమైన ఈ రెండు బ్రాండ్ల పేర్లతో కస్టమర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది.

ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన హీరో మోటోకార్ప్.. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు 'హీరో' పేరును వాడుకోవచ్చు!

ప్రస్తుతం, మార్కెట్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ వంటి కంపెనీలు తమ పెట్రోల్ టూవీలర్లతో పాటుగా ఎలక్ట్రిక్ టూవీలర్లను కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ కూడా తమ స్వంత బ్రాండింగ్ తోనే ఈ విభాగంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించాలని భావిస్తోంది. అయితే, ఈ బ్రాండ్ పేరుతో జరుగుతున్న వివాదం కారణంగా కంపెనీ తన ప్లాన్స్ మార్చుకుంది. ఈ ఏడాది మార్చి 3న, హీరో మోటోకార్ప్ తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ 'విడా' (Vida) లోగోను వెల్లడించింది. ఈ విడా పేరును కంపెనీ తన రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలలో పరిచయం చేయనుంది.

ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన హీరో మోటోకార్ప్.. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు 'హీరో' పేరును వాడుకోవచ్చు!

హీరో మోటోకార్ప్ తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ విడుదలను వచ్చే పండుగ నెల వరకు వాయిదా వేసింది. హీరో యొక్క ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చిత్తూరు (ఆంధ్రప్రదేశ్) జిల్లా లోని 'గ్రీన్' ఫ్యాక్టరీలో తయారు చేయబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన కొద్ది రోజుల తర్వాత దాని డెలివరీ కూడా ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఆగస్టులో, హీరో మోటోకార్ప్ ఛైర్మన్, డాక్టర్ పవన్ ముంజాల్ కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కాన్సెప్ట్ మోడల్‌ను ఆవిష్కరించారు.

ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన హీరో మోటోకార్ప్.. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు 'హీరో' పేరును వాడుకోవచ్చు!

కంపెనీ ప్రదర్శించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా స్లిమ్ డిజైన్‌తో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో పరిచయం చేయబడింది. ఈ స్కూటర్‌ లో 12 ఇంచ్ ఫ్రంట్ వీల్ మరియు 10 ఇంచ్ రియర్ వీల్, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ ఓవరాల్ డిజైన్ సాధారణ పెట్రోల్ ఇంజన్ స్కూటర్ మాదిరిగానే ఉంటుంది.

ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన హీరో మోటోకార్ప్.. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు 'హీరో' పేరును వాడుకోవచ్చు!

స్కూటర్ వెనుకవైపు ఒకే-వైపు స్వింగ్‌ఆర్మ్ మరియు మోటారును వెనుక చక్రానికి కనెక్ట్ చేయడానికి బెల్ట్ డ్రైవ్‌ను ఉపయోగిస్తుంది. కంపెనీ ఈ స్కూటర్‌ లో స్ప్లిట్ సీట్ మరియు వెనుక పిలియన్ రైడర్ కోసం గ్రాబ్ రైల్‌ ను కలిగి ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్, బ్యాటరీ మరియు ఛార్జింగ్‌కు సంబంధించిన ఇతర సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Hero motocorp won legal battle in delhi high court to use hero brand name for evs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X