హీరో మోటోకార్ప్ యొక్క మొట్టమొదటి విడా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ వెల్లడి.. అక్టోబర్ 7న విడుదల!

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తమ సబ్-బ్రాండ్ విడా (Vida) క్రింద మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. హీరో మోటోకార్ప్ విడా యొక్క మొదటి ఇ-స్కూటర్ అక్టోబర్ 7, 2022వ తేదీన మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన మొదటి అఫీషియల్ టీజర్‌ను కూడా వెల్లడి చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

హీరో మోటోకార్ప్ యొక్క మొట్టమొదటి విడా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ వెల్లడి.. అక్టోబర్ 7న విడుదల!

పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం దేశీయ టూవీలర్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కేవలం ఈవీ తయారీదారులే కాకుండా, ప్రధాన సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు కూడా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి. ఇప్పటికే బజాజ్ మరియు టీవీఎస్ కంపెనీలు తమ లైనప్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుండగా, ఈ జాబితాలోకి కొత్తగా హీరో మోటోకార్ప్ కూడా వచ్చి చేరింది.

హీరో మోటోకార్ప్ యొక్క మొట్టమొదటి విడా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ వెల్లడి.. అక్టోబర్ 7న విడుదల!

హీరో మోటోకార్ప్ యొక్క సబ్ బ్రాండ్ అయిన విడా తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం విడుదల చేసిన అఫీషియల్ టీజర్‌లో కంపెనీ తమ ఇ-స్కూటర్ యొక్క డిజైన్ సిల్హౌట్‌ను మాత్రమే వెల్లడి చేసింది. ఈ డిజైన్‌ను మరియు ఇందులో అందించబోయే ఫీచర్లను బట్టి చూస్తుంటే, హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ మరియు బజాజ్ చేతక్ వంటి ప్రీమియం ఇ-స్కూటర్‌లతో పోటీ పడవచ్చని భావిస్తున్నారు.

హీరో మోటోకార్ప్ యొక్క మొట్టమొదటి విడా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ వెల్లడి.. అక్టోబర్ 7న విడుదల!

పైన పేర్కొన్న అన్ని ఇ-స్కూటర్ల ధరలు కూడా సుమారు లక్ష రూపాయలకు ఎగువన ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రాబోయే హీరో విడా ఇ-స్కూటర్ కూడా ధర కూడా సుమారు రూ. 1 లక్ష రేంజ్‌లో ఉంటుందని అంచనా. కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో, హీరో విడా ఇ-స్కూటర్ సిల్హౌట్‌ను చూస్తుంటే, ఇది చాలా సరళమైన డిజైన్‌ను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది చూడటానికి గోగోరో బ్రాండ్ ఇ-స్కూటర్‌లను గుర్తుకుతెచ్చేలా ఉంది. కొన్ని వారాల క్రితమే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పై చిత్రాలు కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

హీరో మోటోకార్ప్ యొక్క మొట్టమొదటి విడా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ వెల్లడి.. అక్టోబర్ 7న విడుదల!

ప్రస్తుతానికి, కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన అన్ని వివరాలను చాలా గోప్యంగా ఉంచింది. జైపూర్‌లో ఉన్న హీరో మోటోకార్ప్ యొక్క హీరో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (సిఐటి)లో అక్టోబర్ 7వ తేదీన ఈ స్కూటర్‌ను ఆవిష్కరించనున్నారు. అదే రోజున దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు హీరో మోటోకార్ప్ తమ స్వతంత్ర సబ్-బ్రాండ్ విడాను జులై 1, 2021వ తేదీన పరిచయం చేసింది.

హీరో మోటోకార్ప్ యొక్క మొట్టమొదటి విడా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ వెల్లడి.. అక్టోబర్ 7న విడుదల!

గతంలో లీకైన స్పై చిత్రాల ప్రకారం, హీరో మోటోకార్ప్‌కు చెందిన విడా యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ వెనుక వైపున మిడ్-షిప్ మౌంటెడ్ మోటారును కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది మరియు ఇది బెల్ట్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా వెనుక చక్రాన్ని తిప్పుతుంది. అలాగే, ముందు వైపు 12 ఇంచ్ అల్లాయ్ వీల్, వెనుక వైపు 10 ఇంచ్ అల్లాయ్ వీల్, ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు 10 స్వింగ్‌ఆర్మ్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. ఇక ఇందులోని బ్యాటరీ విషయానికి వస్తే, ఇది గోగోరో సహకారంతో తయారు చేసినది కావచ్చని తెలుస్తోంది.

హీరో మోటోకార్ప్ యొక్క మొట్టమొదటి విడా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ వెల్లడి.. అక్టోబర్ 7న విడుదల!

భారతదేశంలో ఈవీ మరియు బ్యాటరీ మార్పిడి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి తైవాన్‌కు చెందిన సంస్థ గోగోరో (Gogoro) తో హీరో మోటోకార్ప్ తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుగానే ప్రకటించింది. గోగోరో ప్రస్తుతం తన 2,000 బ్యాటరీ మార్పిడి పాయింట్ల ద్వారా సుమారు 3,75,000 మంది రైడర్‌లకు సేవలను అందిస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే, రాబోయే విడా స్కూటర్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంటే, దీనర్థం హీరో విడా స్కూటర్‌లో సులువుగా విడదీయగల రిమూవబల్ బ్యాటరీ సదుపాయం ఉండే అవకాశం ఉంది.

హీరో మోటోకార్ప్ యొక్క మొట్టమొదటి విడా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ వెల్లడి.. అక్టోబర్ 7న విడుదల!

స్వాప్ చేయగల బ్యాటరీల వలన కస్టమర్లకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ వలన యాజమాన్య ఖర్చు తగ్గడం మరియు బ్యాటరీ ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన సమయం ఉండదు. తైవాన్‌లో, స్వాప్ చేయగల బ్యాటరీ సాంకేతికత బాగా ప్రాచుర్యం పొందింది. మనదేశంలో కూడా ఈ సదుపాయం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది. బౌన్స్ ఇన్ఫినిటీ ఎల్కక్ట్రిక్ స్కూటర్ కూడా ఇదే కాన్సెప్ట్ పై ఆధారపడి డిజైన్ చేయబడింది.

హీరో మోటోకార్ప్ యొక్క మొట్టమొదటి విడా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ వెల్లడి.. అక్టోబర్ 7న విడుదల!

హీరో మోటోకార్ప్ సబ్-బ్రాండ్ విడా నుండి రాబోయే మొట్టమొదటి ఇ-స్కూటర్‌ను జైపూర్‌లోని కంపెనీ యొక్క ఆర్ & డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) హబ్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (CIT)లో అభివృద్ధి చేశారు. కాగా, దీనిని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. చిత్తూరు జిల్లాలోని హీరో మోటోకార్ప్ యొక్క కర్మాగారం పర్యావరణ అనుకూలమైనది మరియు స్థిరమైన తయారీ పద్ధతులను ఉపయోగిస్తుందని, ఇక్కడి ప్లాంట్ లో కంపెనీ బ్యాటరీ ప్యాక్ తయారీ మరియు టెస్టింగ్, వెహికల్ అసెంబ్లీ మరియు వెహికల్ ఎండ్ ఆఫ్ లైన్ టెస్టింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్‌ ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. మరిన్ని వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hero motocorps sub ev brand vida releases first official teaser for its upcoming electric scooter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X