'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు అతి పెద్ద బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) దేశీయ మార్కెట్లో తన కొత్త 'ప్యాషన్ ఎక్స్‌టెక్' (Passion XTEC) విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 74,590 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే

భారతీయ మార్కెట్లో విడుదల ఈ కొత్త 'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' (Hero Passion XTEC) బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఎక్స్‌టెక్ డ్రమ్ వేరియంట్ (రూ.74,590) మరియు ఎక్స్‌టెక్ డిస్క్ వేరియంట్ (రూ.78,990). ఈ లేటెస్ట్ బైక్ ఇప్పుడు చాలా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ మార్పులు 'బ్లూటూత్ కనెక్టివిటీ' మరియు 'డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్'. ఇప్పుడు ఈ కొత్త బైక్ ఈ రెండు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే

హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్ బైక్ లో ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉండటం వల్ల వాహన వినియోగదారుడు స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్‌కు కనెక్ట్ అయిన తర్వాత, బైక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కాల్ అలర్ట్‌, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో-ఫ్యూయెల్ వార్ణింగ్ లైట్ మరియు సర్వీస్ రిమైండర్‌ వంటి వాటిని ప్రదర్శిస్తుంది.

'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే

అంతే కాకుండా మీ మొబైల్ బ్యాటరీ లెవెల్ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ చార్ తక్కువగా ఉంటే అక్కడున్న యుఎస్బి ఫోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది రైడింగ్ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్ మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ అందుబాటులో ఉంది. ఇది హాలోజన్ ల్యాంప్‌ల కంటే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనితోపాటు ఈ బైక్ పైన మీరు బ్రాండ్ లోగో వంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇది చాలా ఏరోడైనమిక్ గా ఉంటుంది.

'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే

హీరో మోటోకార్ప్‌ ఈ కొత్త అప్డేటెడ్ బైక్ విడుదల సందర్భంగా, కంపెనీ యొక్క స్ట్రాటజీ అండ్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ హెడ్ 'మాలో లే మాసన్' మాట్లాడుతూ.. హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్ ఇప్పుడు కొత్త ఫీచర్స్ పొందటం వల్ల ఎక్కువమంది కస్టమర్లను తప్పకుండా ఆకర్షించడంలో విజయం పొందుతుంది. మార్కెట్లో విడుదలైన ఈ బైక్ కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడంలో కూడా తోడ్పడుతుంది అని ఆశిస్తున్నామన్నారు.

'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే

హీరో మోటోకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ 'రంజీవ్‌జిత్ సింగ్' మాట్లాడుతూ.. కంపెనీ ఇప్పటి వరకు కూడా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టడంలో విజయం సాధిస్తూనే వచ్చింది. అయితే ఇప్పుడు ఎక్స్‌టెక్ బైక్ కొత్త ఫీచర్స్ పొందటం వల్ల వినియోగదారులకు మరింత అనుకూలంగా ఉంటుంది, తద్వారా కంపెనీ అమ్మకాలు మెరుగుపడే అవకాశం ఉంటుందన్నారు.

'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే

హీరో మోటోకార్ప్ యొక్క ఈ కొత్త బైక్ 110 సిసి బిఎస్6 ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పి పవర్ మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 9.79 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు మరింత మెరుగైన మైలేజ్ అందించడానికి ఐ3ఎస్ టెక్నాలజీని కలిగి ఉంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే

ఇక ఇందులోని సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త ప్యాషన్ ఎక్స్‌టెక్ సైడ్-స్టాండ్ విజువల్ ఇండికేషన్ మరియు 'సైడ్-స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్' స్విచ్‌ వంటి వాటిని పొందుతుంది. ఇది రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ కూడా భద్రతను కల్పిస్తుంది. అంతే కాకూండా మెరుగైన నిర్వహణ కోసం డిస్క్ బ్రేక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే

సస్పెన్షన్ కూడా అద్భుతంగా ఉంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు డ్యూయల్ ఛానల్ వంటి ఉన్నాయి. కావున రైడింగ్ సమయంలో ఇవి రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ఈ విభాగంలో 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' (TVS Star City+), 'టీవీఎస్ రేడియన్ 110' (TVS Radeon 110) మరియు 'బజాజ్ సిటీ 110' (Bajaj CT 110) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో విడుదలైన అప్డేటెడ్ 'ప్యాషన్ ఎక్స్‌టెక్' బైక్ ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడం ఉపయోగపడుతుందా.. లేదా అనే మరిన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి. అయితే ఎప్పటిలాగే కంపెనీ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుంది అని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Hero passion xtec launched price rs 74590 features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X