హీరో స్ప్లెండర్ (Hero Splendor) అభిమానులకు షాక్.. కొన్ని వేరింయట్లు డిస్‌కంటిన్యూ.. పెరిగిన ధరలు

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ హీరో స్ప్లెండర్ (Hero Splendor) సిరీస్‌లో కొన్ని వేరియంట్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, ఈ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న స్ప్లెండర్ బైక్ ధరలను కూడా పెంచుతున్నట్లు తెలిపింది.

హీరో స్ప్లెండర్ (Hero Splendor) అభిమానులకు షాక్.. కొన్ని వేరింయట్లు డిస్‌కంటిన్యూ.. పెరిగిన ధరలు

హీరో స్ప్లెండర్ సిరీస్‌లో వివిధ రకాల వేరియంట్ల ధరలను రూ.500 నుండి రూ.1,000 వరకూ పెంచింది. ధర పెరుగుదల మినహా కంపెనీ ఈ బైక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. హీరో స్ప్లెండర్‌తో పాటు కంపెనీ విక్రయిస్తున్న ఇతర మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. అలాగే, కంపెనీ ఇప్పుడు ఈ సిరీస్ లో హీరో సూపర్ స్ప్లెండర్ 125 (Hero Super Splendor) యొక్క కొన్ని మోడళ్లను నిలిపివేసింది.

హీరో స్ప్లెండర్ (Hero Splendor) అభిమానులకు షాక్.. కొన్ని వేరింయట్లు డిస్‌కంటిన్యూ.. పెరిగిన ధరలు

హీరో స్ప్లెండర్ సిరీస్ బైక్‌ల కొత్త ధరల వివరాలు మరియు డిస్‌కంటిన్యూ చేయబడిన మోడళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:

స్ప్లెండర్ ప్లస్: రూ. 69,380

స్ప్లెండర్ ప్లస్ ఐ3ఎస్: రూ. 70,700

స్ప్లెండర్ ప్లస్ ఐ3ఎస్ గోల్డ్ ఎడిషన్: రూ. 71,700

2022 సూపర్ స్ప్లెండర్ డ్రమ్: రూ. 75,700

2022 సూపర్ స్ప్లెండర్ డిస్క్: రూ. 79,600

స్ప్లెండర్ ప్లస్ 100 మిలియన్: డిస్‌కంటిన్యూ చేయబడింది

సూపర్ స్ప్లెండర్ డ్రమ్స్: డిస్‌కంటిన్యూ చేయబడింది

సూపర్ స్ప్లెండర్ డిస్క్: డిస్‌కంటిన్యూ చేయబడింది

హీరో స్ప్లెండర్ (Hero Splendor) అభిమానులకు షాక్.. కొన్ని వేరింయట్లు డిస్‌కంటిన్యూ.. పెరిగిన ధరలు

దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కమ్యూటర్ మోటార్‌సైకిళ్లలో హీరో స్ప్లెండర్ (Hero Splendor)ఒకటి. కంపెనీ ఈ బైక్ ను 100 సీసీ ఇంజన్‌ తో అందిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7.91 బిహెచ్‌పి పవర్ ను మరియు 8.05 న్యూటన్ మీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, ఇందులో 125 సిసి ఇంజన్ తో కూడినన సూపర్ స్ప్లెండర్ మోడల్ ను కూడా కంపెనీ విక్రయిస్తోంది. ఇందులోని 124.7 సిసి సింగిల్ సిలిండర్ ఫ్యూయెల్ ఇంజెక్టర్ ఇంజన్‌ గరిష్టంగా 10.2 బిహెచ్‌పి పవర్ ను మరియు 10.6 న్యూటన్ మీటర్ టార క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హీరో స్ప్లెండర్ (Hero Splendor) అభిమానులకు షాక్.. కొన్ని వేరింయట్లు డిస్‌కంటిన్యూ.. పెరిగిన ధరలు

మార్చి నెలలో 4,50,154 యూనిట్ల హీరో టూవీలర్ల విక్రయం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, హీరో మోటోకార్ప్ మాత్రం గడచిన మార్చి 2022 నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసింది. గడచిన నెలలో కంపెనీ మొత్తం 4,50,154 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. మార్చి 2022 కంపెనీ దేశీయ మార్కెట్‌లో 4,15,764 యూనిట్లను విక్రయించగా, అంతర్జాతీయ మార్కెట్‌ లకు 34,390 యూనిట్లను ఎగుమతి చేసింది. కాగా, ఫిబ్రవరి 2022లో కంపెనీ మొత్తం 3,58,254 యూనిట్లను మాత్రమే విక్రయించింది.

హీరో స్ప్లెండర్ (Hero Splendor) అభిమానులకు షాక్.. కొన్ని వేరింయట్లు డిస్‌కంటిన్యూ.. పెరిగిన ధరలు

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో కొత్త డెస్టినీ (2022 Hero Destini 125 Xtec) స్కూటర్ విడుదల

ఇదిలా ఉంటే, భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ (Hero Motocorp), దేశీయ విపణిలో విక్రయిస్తున్న డెస్టినీ 125 (Destini 125) స్కూటర్‌లో తాజాగా మరో కొత్త వేరియంట్ ను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో, మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టూవీలర్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, కంపెనీ ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఓ కొత్త 2022 మోడల్ "హీరో డెస్టినీ 125 ఎక్స్‌టెక్" (Hero Destini 125 Xtec) ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

హీరో స్ప్లెండర్ (Hero Splendor) అభిమానులకు షాక్.. కొన్ని వేరింయట్లు డిస్‌కంటిన్యూ.. పెరిగిన ధరలు

మార్కెట్లో హీరో డెస్టినీ 125 ధర రూ. 69,900 నుండి ప్రారంభమవుతుంది. కాగా, ఇందులో కొత్తగా వచ్చిన ఎక్స్‌టెక్ వేరియంట్ ధర రూ. 79,990, ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. కొత్త 2022 Hero Destini 125 Xtec అనేక కొత్త ఫీచర్లతో పాటుగా కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లను కూడా పొందుతుంది. ఈ గేర్‌లెస్ స్కూటర్ ఇప్పుడు కొత్త నెక్సస్ బ్లూ షేడ్‌లో పరిచయం చేయబడింది. డెస్టినీ 125 ఇప్పటికే మ్యాట్ బ్లాక్, పెరల్ సిల్వర్ వైట్, నోబెల్ రెడ్, పాంథర్ బ్లాక్, చెస్ట్‌నట్ బ్రౌన్ మరియు మ్యాట్ రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

హీరో స్ప్లెండర్ (Hero Splendor) అభిమానులకు షాక్.. కొన్ని వేరింయట్లు డిస్‌కంటిన్యూ.. పెరిగిన ధరలు

కొత్త హీరో డెస్టినీ 125 ఎక్స్‌టెక్ కొత్త లుక్ మరియు స్టైల్‌లో పరిచయం చేయబడింది. ఇందులో ఫ్రంట్ ఆప్రాన్‌కు క్రోమ్ యాక్సెంట్‌లు, క్రోమ్ రియర్ వ్యూ మిర్రర్స్, సైలెన్సర్‌పై క్రోమ్ మఫ్లర్, స్క్వేర్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, హెడ్‌ల్యాంప్ చుట్టూ క్రోమ్ యాక్సెంట్‌లు మరియు కొత్త హ్యాండిల్ బార్ వంటి మార్పులు ఉన్నాయి. స్కూటర్ ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బి ఛార్జింగ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ మరియు బ్యాక్ రెస్ట్‌ వంటి అదనపు ఫీచర్లతో అందించబడుతుంది.

హీరో స్ప్లెండర్ (Hero Splendor) అభిమానులకు షాక్.. కొన్ని వేరింయట్లు డిస్‌కంటిన్యూ.. పెరిగిన ధరలు

మొట్టమొదటి హీరో ఎలక్ట్రిక్ టూవీలర్ వస్తోంది..

ఇదిలా ఉంటే, హీరో మోటోకార్ప్ రానున్న నెలల్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ దీనిని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న తమ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేయనుంది. హీరో ఎలక్ట్రిక్ బ్రాండ్ పేరుతో ఈ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ ఇప్పటికే ఎలక్ట్రిక్ టూవీలర్లను విక్రయిస్తున్నప్పటికీ, ఇది హీరో మోటోకార్ప్ బ్రాండ్ నుండి రానున్న మొదటి ఎలక్ట్రిక్ టూవీలర్ అవుతుంది. హీరో మోటోకార్ప్ ఈవీ అభివృద్ధి కోసం కంపెనీ ఇప్పటికే ఏథర్ ఎనర్జీ మరియు గోగోరో వంటి సంస్థలతో సహకారాన్ని కూడా కలిగి ఉంది.

Most Read Articles

English summary
Hero splendor plus price hikes some variants discontinued details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X