బెంగళూరులో ప్రారంభమైన 'హీరో విడా' ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ - వివరాలు

భారతీయ మార్కెట్లో ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదలైన 'హీరో విడా' (Hero Vida) ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. హీరో మోటోకార్ప్ ఛైర్మన్ మరియు CEO అయిన డాక్టర్ పవన్ ముంజాల్ బెంగుళూరులోని కస్టమర్‌కు మొట్టమొదటి 'హీరో విడా వి1' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను డెలివరీ చేశారు.

హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'హీరో విడా' రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి 'విడా వి1 ప్రో' మరియు 'విడా వి1 ప్లస్'. వీటి ధరలు వరుసగా రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 2,499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

బెంగళూరులో ప్రారంభమైన హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ

హీరో విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్, ఫాలో-మీ హోమ్ హెడ్లాంప్, కీలెస్ ఎంట్రీ, ఎస్ఓఎస్ అలర్ట్ వంటివి వాటితో పాటు 7-ఇంచెస్ టచ్ స్క్రీన్ కూడా పొందుతుంది. ఇందులో పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. దీని కెపాసిటీ 26-లీటర్ల వరకు ఉంటుంది. ఇది స్ప్లిట్ సీటుని పొందుతుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి రేంజ్ అందించేలా రూపొందించబడ్డాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలో కంపెనీ రిమూవబుల్ బ్యాటరీ ఉపయోగించింది. ఇది పూర్తిగా కంపెనీ తయారు చేసినట్లు తెలుస్తోంది, అయితే రెండు వేరియంట్స్ అందించే పరిధి ఒకేలా ఉండదు. కావున Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 143 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ.

ఇక Vida V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ వరకు ఉంటుంది. కాగా ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0-40 కిమీ వరకు వేగవతం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి రేంజ్ అందిస్తాయని స్పష్టమవుతోంది.

కంపెనీ గతంలో చెప్పినట్లు ఈ సంవత్సరం చివరిలో డెలివరీలను ప్రారంభిస్తామని వెల్లడించింది. చెప్పినట్లుగానే ఇప్పుడు డెలివరీలు ప్రారంభమయ్యాయి. అయితే రానున్న రోజుల్లో ఈ డెలివరీలు మరిన్ని నగరాల్లో ప్రారంభమవుతాయి. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు బ్యాటరీ మీద వరుసగా 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీ మరియు 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీ వారంటీని అందిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇదిలా ఉండగా ఇటీవల కంపెనీ బెంగుళూరులో విడా యొక్క మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించారు. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ 8,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో Vida V1 స్కూటర్‌లు, ఛార్జింగ్ స్టేషన్స్ మరియు కస్టమర్లను ఆకర్శించే ఇంటరాక్టివ్ వాల్ మొదలైనవి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఢిల్లీ మరియు జైపూర్ వంటి నగరాల్లో కూడా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించే అవకాశం ఉంటుంది.

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇది ఆధునిక కాలంలో వినియోగించడానికి అనుకూలంగా కంపెనీ దీనిని రూపొందించింది. రానున్న రోజుల్లో సంక్రాంతి వంటి పండుగల సమయంలో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు మరియు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, December 31, 2022, 9:28 [IST]
English summary
Hero vida electric scooter delivery in bengaluru details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+