భారతదేశంలో మొట్ట మొదటి 'హీరో విడా' ఎక్స్‌పీరియన్స్ సెంటర్: ఇప్పుడు మన బెంగళూరులో..
ప్రపంచంలో అతి పెద్ద బైక్ మరియు స్కూటర్ల తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' ఇటీవల 'విడా' (Vida) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది.
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ప్రారంభించిన ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ బెంగళూరులో ఉంది. ఇందులో కంపెనీ యొక్క కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'హీరో విడా' (Hero Vida) చూడవచ్చు మరియు దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

కంపెనీ ఇప్పుడు బెంగళూరులో ప్రారభించిన 'హీరో విడా' ఎక్స్‌పీరియన్స్ సెంటర్ భారతదేశంలో మొట్ట మొదటి విడా ఎక్స్‌పీరియన్స్ కావడం విశేషం. ఈ విడా ఎలక్ట్రిక్ యొక్క ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ బెంగళూరులో విట్టల్ మాల్యా రోడ్‌లో ఉంది. ఇప్పుడు హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే కస్టమర్లు స్వయంగా అక్కడికెళ్లి తెలుసుకోవచ్చు.
కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు, అంతే కాకుండా టెస్ట్ రైడ్ వంటి సదుపాయాలను కూడా పొందవచ్చు. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ 8,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో Vida V1 స్కూటర్‌లు, ఛార్జింగ్ స్టేషన్స్ మరియు కస్టమర్లను ఆకర్శించే ఇంటరాక్టివ్ వాల్ మొదలైనవి ఉన్నాయి.

బెంగళూరు హీరో విడా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన తరువాత కంపెనీ 2022 డిసెంబర్ రెండవ వారంలో జైపూర్ మరియు ఢిల్లీలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను ప్రారంభించనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ (హీరో విడా) డెలివరీలు కూడా డిసెంబర్ రెండవ వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
హీరో విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది 'వి1 ప్రో' (V1 Pro) మరియు 'వి1 ప్లస్' (V1 Plus) అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.45 లక్షలు మరియు రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతాయి.

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉంటాయి. హీరో Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ 3.44kWh బ్యాటరీ కలిగి ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 143 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. అదే సమయంలో ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
అదే సమయంలో హీరో Vida V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ 3.94kWh బ్యాటరీ కలిగి ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ వరకు ఉంటుంది. కాగా ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండూ కూడా మంచి రేంజ్ అందిస్తాయి. కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం రూ. 2,499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








