Hero Xpulse 200 4V సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ ప్రారంభం.. మరి మీరు బుక్ చేసుకున్నారా..?

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భారత మార్కెట్లో విక్రయిస్తున్న సరికొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హీరో ఎక్స్‌పల్స్200 4వి (Hero Xpulse 200 4V) మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. గతంలో ఈ బైక్ కోసం మొదటి బ్యాచ్ బుకింగ్స్ పూర్తవడంతో కంపెనీ తాత్కాలికంగా బుకింగ్ లను నిలిపివేసింది. కాగా, ఇప్పుడు రెండవ బ్యాచ్ కోసం బుకింగ్ లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Hero Xpulse 200 4V సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ ప్రారంభం.. మరి మీరు బుక్ చేసుకున్నారా..?

హీరో మోటోకార్ప్ తమ సరికొత్త 2022 మోడల్ ఎక్స్‌పల్స్ 200 4వి బైక్ ను గతేడాది అక్టోబర్ నెలలో మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Hero Xpulse 200 4V బైక్ రూ. 1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ దాని మునుపటి తరం మోడళ్ల కంటే కూడా చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు ఇప్పుడు ఈ మోటార్‌సైకిల్ ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

Hero Xpulse 200 4V సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ ప్రారంభం.. మరి మీరు బుక్ చేసుకున్నారా..?

కొత్త హీరో ఎక్స్‌పల్స్200 4వి అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం కంపెనీ రూ.10,000 బుకింగ్స్ అడ్వాన్స్ ను వసూలు చేస్తోంది. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే కస్టమర్లకు హై హీరో మోటోకార్ప్ తమ ఆన్‌లైన్ వెబ్ పేజీని మంచి యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసింది. ఈ బైక్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను పునఃప్రారంభించిన సందర్భంగా, హీరో మోటోకార్ప్ యొక్క సేల్స్ మరియు రీసెల్లర్‌ల సీఈఓ నవీన్ చౌహాన్ మాట్లాడుతూ, హీరో ఎక్స్‌పల్స్ 200 ఎల్లప్పుడూ అసమానమైన అనుభవానికి ప్రసిద్ధి చెందన మోడల్ అని చెప్పారు.

Hero Xpulse 200 4V సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ ప్రారంభం.. మరి మీరు బుక్ చేసుకున్నారా..?

ఈ కొత్త మోటార్‌సైకిల్ ఆధునిక సాంకేతికత, మోడ్రన్ డిజైన్ మరియు ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటుందని, ఎక్స్‌పల్స్ 200 4వి కోసం తమ వినియోగదారుల నుండి లభిస్తున్న ఆదరణ పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈ మోటార్‌సైకిల్ కోసం మొదటి బ్యాచ్ అమ్మకాలు అతి త్వరలోనే పూర్తిగా అమ్ముడవటాన్ని చూస్తుంటే, ఇది దేశంలో ప్రీమియం మోటార్‌సైకిళ్ల డిమాండ్‌ను మరియు హీరో బ్రాండ్‌పై కస్టమర్‌లకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు.

Hero Xpulse 200 4V సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ ప్రారంభం.. మరి మీరు బుక్ చేసుకున్నారా..?

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి బైక్‌ని కంపెనీ 2019 సంవత్సరంలో మొదటిసారిగా భారత మార్కెట్లో విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఈ కొత్త తరం మోడల్ మూడవ అప్‌డెటెడ్ వెర్షన్. ఈ కొత్త బైక్ ఇప్పుడు 199.6 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో లభిస్తుంది. గతంలో ఇందులో ఉపయోగించిన 2-వాల్వ్ ఓహెచ్‌సి కి బదులుగా కొత్త 4-వాల్వ్ కాన్ఫిగరేషన్‌ ఉపయోగించారు. ఫలితంగా, ఇంజన్ పనితీరు మునుపటి కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది.

Hero Xpulse 200 4V సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ ప్రారంభం.. మరి మీరు బుక్ చేసుకున్నారా..?

ఈ ఇంజన్ ఇప్పుడు 19.1 బిహెచ్‌పి పవర్ మరియు 17.35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. గతంలోని 2-వాల్వ్ మోడల్ ఆయిల్-కూల్డ్ ఇంజన్ కంటే ఇది 6 శాతం ఎక్కువ శక్తిని మరియు 5 సాతం ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రధానంగా యవతను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టిన ఈ మోటార్‌సైకిల్, భారతీయ మోటార్‌సైకిల్ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన అవార్డులలో ఒకటైన బెస్ట్ ఇండియన్ మోటార్‌సైకిల్ అవార్డును 2020 సంవత్సరానికి గాను గెలుచుకుంది.

Hero Xpulse 200 4V సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ ప్రారంభం.. మరి మీరు బుక్ చేసుకున్నారా..?

కొత్త హీరో ఎక్స్‌పల్స్ 200 4వి డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. స్టైలిష్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎకో మోడ్, రెండు ట్రిప్ మీటర్లు మరియు ఒక సింగిల్ ఛానల్ ABS మరియు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ఫ్యూయెల్ ట్యాంక్‌ పై '4V' స్టిక్కర్ ఉంటుంది. అంతే కాకుండా ఇది మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఎంపికలతో వస్తుంది. ఇందులో ట్రైల్ బ్లూ, బ్లిట్జ్ బ్లూ మరియు రెడ్ రైడ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

Hero Xpulse 200 4V సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ ప్రారంభం.. మరి మీరు బుక్ చేసుకున్నారా..?

మెకానికల్స్ ను గమనిస్తే, ఈ బైక్ ముందు భాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ఉంటాయి. అలాగే, ఇందులో ముందు వైపు 21 ఇంచెస్ మరియు 18 ఇంచెస్ వీల్ కాంబోను పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 90/90-21 టైరు మరియు వెనుక భాగంలో 120/80-18 టైరు ఉంటాయి. ఈ ఎక్స్‌పల్స్ 200 4వి అడ్వెంచర్ బైక్‌లో అదనపు ఇంజన్ పవర్‌తో పాటు, లాంగ్ ఫ్రంట్ సస్పెన్షన్ మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు.

Hero Xpulse 200 4V సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ ప్రారంభం.. మరి మీరు బుక్ చేసుకున్నారా..?

హీరో మోటోకార్ప్ ఇప్పుడు ఎక్స్‌పల్స్ 200 4వి అడ్వెంచర్ బైక్‌ కోసం 'ర్యాలీ కిట్' కస్టమైజేషన్ కిట్ ను కూడా అందిస్తోంది. ఇందులో మాక్స్సిస్ ఆఫ్-రోడ్ టైర్లు, ముందు మరియు వెనుకవైపు ర్యాలీ-ట్యూన్డ్ సస్పెన్షన్, ఒక ఫ్లాట్ మరియు పొడవైన ర్యాలీ-స్టైల్ బెంచ్ సీటు, హ్యాండిల్‌బార్ రైసర్స్, లాంగ్ సైడ్ స్టాండ్ మరియు ఎక్స్‌టెండెడ్ గేర్ పెడల్ వంటివి ఉన్నాయి. దీని ధర రూ. 46,000 గా ఉంది. ఇందులో ర్యాలీ-ట్యూన్ సస్పెన్షన్‌ను ఉపయోగించిన కారణంగా గ్రౌండ్ క్లియరెన్స్ 275 మిమీ ఉంటుంది.

Most Read Articles

English summary
Hero xpulse 200 4v adventure motorcycle next batch bookings open details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X