మళ్ళీ ప్రారంభమైన 2022 Hero Xpulse 200 4V Rally Edition బుకింగ్స్.. ఇప్పుడు బుకింగ్ ధర ఎంతంటే?
ప్రముఖ డిచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) దేశీయ మార్కెట్లో ఇప్పటికే తన 'ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' (Xpulse 200 4V Rally Edition) విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త ఎడిషన్ లాంచ్ చేసిన కేవలం నాలుగు రోజుల్లోనే మొత్తమ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే ఇప్పుడు మళ్ళీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.
Recommended Video
'2022 హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' (Xpulse 200 4V Rally Edition) ఎలా బుక్ చేసుకోవాలి, బుకింగ్ ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఇప్పటికే భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త '2022 హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' ధర మునుపటి మాదిరిగానే రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇప్పుడు ఈ బైక్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ (eShop ప్లాట్‌ఫారమ్) లో రూ. 10,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలను పొందుతుంది. ఈ కోట్ బైక్ మునుపటి మోడల్ కంటే కూడా చాలా అప్డేట్ డిజైన్ పొందుతుంది. ఇందులో ప్రత్యేకమైన ర్యాలీ కోడ్ గ్రాఫిక్స్, ఫ్రంట్ ఫెండర్‌పై ర్యాలీ ఎడిషన్ డెకాల్ మరియు ఫ్యూయెల్ ట్యాంక్ పైన 'సిఎస్ సంతోష్' ఆటోగ్రాఫ్ వంటివి ఉన్నాయి.

ఈ బైక్ దాని స్టాండర్డ్ బైక్ లోని కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ కూడా తీసుకుంటుంది. అవి ముందుభాగంలో ఉన్న రౌండ్ హెడ్‌లైట్, పొడవైన-సెట్ ఫ్రంట్ ఫెండర్, సింగిల్-పీస్ సీటు, ఎగ్జాస్ట్ కోసం హై పొజిషన్ మరియు వెనుక భాగంలో ఒక కాంపాక్ట్ లగేజ్ రాక్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కొత్త 'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' ముందు వైపున ఒక పొడవాటి మరియు పెద్ద 37 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ ఫోకస్ సస్పెన్షన్ అందుబాటులో ఉంటుంది, వెనుక వైపున మోనో-షాక్ యూనిట్ ఉంది. ఈ కొత్త బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇప్పుడు దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువగా ఉంది. అంటే ఇప్పడు ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 270 మిమీ వరకు ఉంది.

ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ యొక్క సీటు ఎత్తు 885 మిమీ కాగా, హ్యాండిల్‌బార్ రైజర్‌లు 40 మిమీ కంటే ఎక్కువ పొడవు పొందాయి. ఇవి మరింత ఉత్తమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. అంతే కాకుండా ర్యాలీ ఎడిషన్ లో పొడిగించబడిన గేర్ లివర్, పొడవాటి సైడ్ స్టాండ్ మరియు డ్యూయల్ పర్పస్ టైర్స్ కూడా ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్ యొక్క బరువు (కర్బ్) 160 కేజీలు. కావున ఇది రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ యొక్క ఇంజిన్ లో ఎటువంటి మార్పులు లేదు, కావున ఇది అదే 199.6 సిసి, సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, 4-స్ట్రోక్, 4-స్ట్రోక్, 4-వాల్వ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.9 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.35 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' యొక్క కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, ఇది బ్లాక్ మరియు రెడ్ కలర్ గ్రాఫిక్స్‌తో పాటు వైట్ కలర్ బేస్ పెయింట్ పొందుతుంది, కావున ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే దీని స్టాండర్డ్ మోడల్ మాత్రం మూడు పెయింట్ తీమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మాట్ నెక్సస్ బ్లూ, పోలెస్టార్ బ్లూ మరియు స్పోర్ట్స్ రెడ్ కలర్స్. మొత్తం మీద ఈ బైక్ మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
హీరో మోటోకార్ప్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఈ కొత్త ఎడిషన్ విడుదల చేసి బుకింగ్స్ ప్రారంభించిన మొదటి నాలుగు రోజుల్లోనే అన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఈ బైక్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అని స్పష్టంగా అర్థమౌతోంది. అయితే ఇప్పుడు మళ్ళీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, అయితే ఇప్పుడు ఎలాంటి బుకింగ్స్ పొందుతుందో తెలియాలి. దీని గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








