Hero Xpulse 200 4V: ఇప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో వచ్చేసింది..
ప్రముఖ ద్విచక్ర వాన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) తన విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అడ్వెంచర్ బైక్ 'ఎక్స్‌ప్లస్ 200 4వి' (Xpulse 200 4V) కిఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్‌లను అందించింది. ప్రస్తుతం ఈ అప్డేట్ అనేది కేవలం టర్కిష్ మార్కెట్లో విక్రయించబడుతున్న 'హీరో ఎక్స్‌ప్లస్ 200 4వి' కి మాత్రమే అందించబడింది. కావున టర్కిష్ మార్కెట్లో విక్రయించబడుతున్న 'ఎక్స్‌ప్లస్ 200 4వి' బైక్ లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ అందుబాటులో ఉంటుంది.

అయితే ఇప్పుడు భారతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న ఈ బైక్ లో స్టాండర్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మాత్రమే ఉపయోగించబడింది. రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న 'హీరో ఎక్స్‌ప్లస్ 200 4వి' కూడా ఈ అప్డేట్ పొందే అవకాశం ఉంది. హీరో మోటోకార్ప్ ప్రస్తుతం హెడ్‌లైట్‌ను మాత్రమే అప్‌డేట్ చేసింది. బైక్ లోని ఇతర ఫీచర్స్ అన్నీ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.

ఇప్పుడు కొత్త Hero Xpulse 200 4V యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఈ కొత్త మోడల్ దాని మునుపటి మోడల్ కి సమానంగా ఉంటుంది. కానీ దాని ట్యాంక్‌లో '4V' స్టిక్కర్ వంటికి గమనించవచ్చు. అంతే కాకుండా ఇది మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఎంపికలతో వస్తుంది. ఇందులో ట్రైల్ బ్లూ, బ్లిట్జ్ బ్లూ మరియు రెడ్ రైడ్ ఉన్నాయి.

కొత్త Hero Xpulse 200 4V బైక్ లో ఎల్ఈడీ హెడ్‌లైట్లు మరింత ప్రకాశవంతంగా ఉన్నాయి. దీనితో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎకో మోడ్, రెండు ట్రిప్ మీటర్లు మరియు ఒక సింగిల్ ఛానల్ ABS తో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది.

ఈ బైక్ లోని సస్పెన్షన్ సెటప్, వీల్స్ మరియు టైర్లు వంటి భాగాలలో ఎలాంటి మార్పులు చేయబడలేదు. అయితే ఇందులోని సస్పెన్షన్ కోసం, ముందుభాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ అమర్చబడి ఉంటుంది. వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ఇవ్వబడింది. Xpulse 200 4V అదే 21 ఇంచెస్ మరియు 18 ఇంచెస్ వీల్ కాంబోను పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 90/90-21 టైర్లు మరియు వెనుక భాగంలో 120/80-18 టైర్లు ఉన్నాయి.

ఇక దీని కొలతల విషయానికి వస్తే, పొడవు 2,222 మిమీ, వెడల్పు 850 మిమీ మరియు ఎత్తు 1,258 మిమీ వరకు ఉంటుంది. ఈ బైక్ యొక్క వీల్‌బేస్ 1,410 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 220 మిమీ కాగా సీటు ఎత్తు 825 మిమీ వరకు ఉంది. అంటే కాకుండా ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు.

Hero Xpulse 200 4V బైక్ 199.6 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఇప్పుడు 2-వాల్వ్ OHC కి బదులుగా 4-వాల్వ్ కాన్ఫిగరేషన్ అందుబాటులో ఉంటుంది.ఈ ఇంజిన్ ఇప్పుడు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 19.1 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

కంపెనీ Hero Xpulse 200 4V బైక్ మార్కెట్లో విడుదలచేసినప్పుడు దీని ధర రూ. 1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇప్పుడు దీని ధర రూ.1.32 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. హీరో మోటోకార్ప్ ఇప్పుడు ఈ కొత్త బైక్ కోసం స్పెషల్ ‘ర్యాలీ కిట్' అందిస్తోంది. ఇందులో మాక్స్సిస్ ఆఫ్-రోడ్ టైర్లు, ముందు మరియు వెనుకవైపు ర్యాలీ-ట్యూన్డ్ సస్పెన్షన్, ఒక ఫ్లాట్ మరియు పొడవైన ర్యాలీ-స్టైల్ బెంచ్ సీటు, హ్యాండిల్‌బార్ రైసర్స్, లాంగ్ సైడ్ స్టాండ్ మరియు ఎక్స్‌టెండెడ్ గేర్ పెడల్ వంటివి ఉన్నాయి.

మొత్తం మీద ఈ కొత్త Hero Xpulse 200 4V బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ సరసమైన ధర వద్ద కూడా లభిస్తుంది, కావున మార్కెట్లో ఈ బైక్ మరింత ఎక్కువమంది వినియోగాదారులను తప్పకుండా ఆకర్షించే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








