కొత్త Hero Xpulse 200T 4V బైకులో తెలుసుకోవలసిన 5 విషయాలు, ఇవే

దేశీయ మార్కెట్లో ఇటీవల హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన 'ఎక్స్‌‌పల్స్ 200టి 4వి' (Xpulse 200T 4V) బైక్ విడుదల చేసింది. భారతదేశంలో ఇప్పటికే ఎక్స్‌‌పల్స్ విభాగం మంచి ఆదరణ పొందుతున్న కారణంగా ఈ కొత్త వెర్షన్ కూడా గొప్ప అమ్మకాలు పొందే అవకాశం ఉంది.

ఈ లేటెస్ట్ హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి (Hero Xpulse 200T 4V) బైక్ కొనాలనుకే కస్టమర్లు తప్పకుండా ఈ బైక్ ధరలు మాత్రమే కాకుండా డిజైన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి, ఇంజిన్ పనితీరు ఎలా ఉంటుందనే విషయాలు కూడా తెలుసుకోవాలి. కావున మనం ఈ కథనంలో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి ప్రైస్, ఫీచర్స్ మరియు ఇంజిన్ పనితీరు వంటి విషయాలను పూర్తిగా తెలుసుకుందాం.

కొత్త Hero Xpulse 200T 4V బైకులో తెలుసుకోవలసిన 5 విషయాలు

ధర:

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి' బైక్ ధర రూ. 1,25,726 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త అప్డేటెడ్ బైక్ కొనాలనుకునే కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు. అయితే డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇప్పుడు బుక్ చేసుకుంటే బహుశా 2023 ప్రారంభంలో డెలివరీలు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. కంపెనీ డెలివరీలకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

డిజైన్:

కొత్త 'హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి' బైక్ డిజైన్ దాని హీరో ఎక్స్‌‌పల్స్ 200 4వి కంటే కూడా చాలా దూకుడుగా ఉంటుంది. ఇందులో తప్పకుండా కొన్ని అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్స్ గమనించవచ్చు. ఈ బైక్ లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, బెల్లీ పాన్, ఫోర్క్ గైటర్స్, కొత్త ఫ్లై స్క్రీన్, కొత్త డ్యూయల్ టోన్ సీటు వంటి వాటితో పాటు మరిన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను చూడవచ్చు. ఇవన్నీ కూడా చూడగానే ఆకర్శించే విధంగా ఉంటాయి.

ఫీచర్స్:

హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, సర్వీస్ రిమైండర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. ఈ కొత్త బైకులో USB ఛార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది. కావున దీని ద్వారా స్మార్ట్ ఫోన్ కి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇంజిన్ & పర్ఫామెన్స్:

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, Hero Xpulse 200T 4V బైక్ దాని Xpulse 200 4V మాదిరిగానే అదే 199.6సిసి ఎయిర్-అండ్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 19.1 హెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది దాని Xpulse 200T 2V ఎక్కువ పవర్ అవుట్‌పుట్ అందిస్తుంది.

కలర్ ఆప్సన్స్ & మెకానికల్స్:

హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి 'మాట్ ఫంక్ లైమ్ ఎల్లో, మాట్ షీల్డ్ గోల్డ్ మరియు స్పోర్ట్స్ రెడ్' అనే మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో 7 టైప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్‌ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క ముందు భాగంలో 276 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి సింగిల్ ఛానల్ ఏబీఎస్ తో జతచేయబడి ఉంటుంది.

హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి బైక్ యొక్క రెండు చివర్లలో 17-ఇంచెస్ రిమ్స్ ఉంటాయి. ఈ బైక్ ముందు భాగంలో 100/80-17 ట్యూబ్‌లెస్ టైర్స్ మరియు వెనుక వైపు 130/70-R17 ట్యూబ్‌లెస్ టైర్స్ అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద కొత్త హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమ పనితీరుని అందించే విధంగా రూపొందించబడింది. కావున ఇది బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 23, 2022, 6:30 [IST]
English summary
Hero xpulse 200t 4v top five highlights
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+