బజాజ్ పల్సర్ 250సిసి బైక్‌లకు కొనసాగుతున్న డిమాండ్.. 6 నెలల వ్యవధిలో సరికొత్త రికార్డ్..

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజజ్ ఆటో, గతేడాది తమ పాపులర్ పల్సర్ (Pulsar) సిరీస్‌లో కొత్తగా విడుదల చేసిన రెండు 250సిసి బైక్స్ (Pulsar N250 మరియు Pulsar F250) ఇప్పటికీ బలమైన డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. పల్సర్ బ్రాండ్‌లో చాలా కాలంగా 250 సిసి వేరియంట్ కోసం ఎదురచూస్తున్న బైక్ ప్రియుల కల, ఈ 250 పల్సర్ ట్విన్స్ రాకతో నిజమైంది. గతంలో, పల్సర్ సిరీస్ లో 125 సిసి మొదలుకొని 220 సిసి వరకూ అనేక రకాల వేరియంట్లు అందుబాటులో ఉండేవి.

బజాజ్ పల్సర్ 250సిసి బైక్‌లకు కొనసాగుతున్న డిమాండ్.. 6 నెలల వ్యవధిలో సరికొత్త రికార్డ్..

కాగా, ఈ బ్రాండ్‌లో శక్తివంతమైన స్పోర్టీ వేరియంట్లను కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ పల్సర్ ఎన్250 (Pulsar N250) మరియు పల్సర్ ఎఫ్250 (Pulsar F250) మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. ఈ 6 నెలల వ్యవధిలో దాదాపు 10,000 యూనిట్లకు పైగా పల్సర్ ఎన్250 మరియు పల్సర్ ఎఫ్250 బైక్‌లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. బజాజ్ ఆటో ప్రకారం, ఈ పల్సర్ 250 ట్విన్స్ 10,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన 250cc మోటార్‌సైకిల్‌గా అని కంపెనీ తెలిపింది.

బజాజ్ పల్సర్ 250సిసి బైక్‌లకు కొనసాగుతున్న డిమాండ్.. 6 నెలల వ్యవధిలో సరికొత్త రికార్డ్..

బజాజ్ ఆటో ఇటీవలే తమ పల్సర్ 250 బైక్ ధరలను కూడా పెంచింది. విడుదల సమయంలో బజాజ్ పల్సర్ ఎన్250 ధర రూ. 1.38 లక్షలు కాగా, బజాజ్ పల్సర్ ఎఫ్250 ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉండేది. కాగా, కంపెనీ వీటి ధరలను వెయ్యి రుపాయల వరకూ పెంచింది. ధరల పెంపు తర్వాత వీటి ధరలు వరుసగా రూ. 1.39 లక్షలు మరియు రూ.1.41 లక్షలుగా ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

బజాజ్ పల్సర్ 250సిసి బైక్‌లకు కొనసాగుతున్న డిమాండ్.. 6 నెలల వ్యవధిలో సరికొత్త రికార్డ్..

నిజానికి, బజాజ్ బ్రాండ్ నుండి కొత్తగా వచ్చిన ఈ పల్సర్ 250 బైక్‌లు కంపెనీ చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయానికి పునాది వేశాయని చెప్పవచ్చు. కంపెనీ వీటిని కొత్త ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్‌పై ఆధారంగా తయారు చేసింది. ఇవి పూర్తిగా కొత్త డిజైన్ శైలిని కలిగి ఉంటాయి. ఈ కొత్త పల్సర్ శ్రేణి మోటార్‌సైకిళ్లను రీట్యూన్ చేయబడిన 250 సిసి ఇంజన్‌తో పరిచయం చేశారు. వాస్తవానికి, కంపెనీ ఇదే ఇంజన్ ను తమ డొమినార్ 250 (Bjaja Dominar 250) లో కూడా ఉపయోగిస్తోంది.

బజాజ్ పల్సర్ 250సిసి బైక్‌లకు కొనసాగుతున్న డిమాండ్.. 6 నెలల వ్యవధిలో సరికొత్త రికార్డ్..

వాస్తవానికి బజాజ్ ఆటోకి 250 సిసి టూవీలర్ విభాగం కొత్తదేమీ కాదు. కంపెనీ ఇప్పటికే ఈ విభాగంలో Dominar, KTM మరియు Husqvarna బ్రాండ్‌ల క్రింద 250cc బైక్‌లను విక్రయిస్తుంది. అయితే, పల్సర్ బ్రాండ్‌కి ఉన్న పాపులారిటీ ఈ ఇతర బ్రాండ్లకు లేదనే చెప్పాలి. దశాబ్ధాలుగా దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పల్సర్ బ్రాండ్ ద్వారా కంపెనీ 250సిసి బైక్‌లను పరిచయం చేయడంతో ఇవి మార్కెట్లో మంచి ఆదరణను పొందాయి. ఇండియన్ మార్కెట్లో పల్సర్ అనే పేరు అంత బాగా పాపులర్ అయింది.

బజాజ్ పల్సర్ 250సిసి బైక్‌లకు కొనసాగుతున్న డిమాండ్.. 6 నెలల వ్యవధిలో సరికొత్త రికార్డ్..

అయితే, బజాజ్ విక్రయిస్తున్న డొమినార్ 400 విక్రయాలు మాత్రం ఆశించిన రీతిలో జరగడం లేదు. బహుశా, కంపెనీ ఇదే మోడల్ ను పల్సర్ పేరుతో విడుదల చేసి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదేమో. సరే ఆ విషయం అటుంచి, పల్సర్ 250 బైక్స్ విషయానికి వస్తే, ఇవి ట్యూబ్‌లెస్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడ్డాయి మరియు మంచి ఏరోడైనమిక్‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండింటిలో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్ మరియు ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో ముందు వైపు నుండి అగ్రెసివ్ లుక్‌ని కలిగి ఉంటాయి.

బజాజ్ పల్సర్ 250సిసి బైక్‌లకు కొనసాగుతున్న డిమాండ్.. 6 నెలల వ్యవధిలో సరికొత్త రికార్డ్..

బజాజ్ పల్సర్ 250 సిరీస్‌లో F250 మోడల్ సెమీ-ఫైర్డ్ వెర్షన్ కాగా, N250 మోడల్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ స్టైల్ బైక్. ఈ రెండు బైక్ కూడా ఇతర పల్సర్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే చాలా సాంప్రదాయిక డిజైన్‌ను కలిగి ఉంటాయి. వీటిపై షార్ప్ లైన్‌లు మరియు మరింత ట్రెడిషనల్‌గా కనిపించే వైఖరి ఉంటుంది. అయితే, సెమీ-ఫెయిరింగ్‌తో కూడిన కొత్త బజాజ్ ఎఫ్250 దాని నేక్డ్ కౌంటర్ బజాజ్ ఎన్250 కంటే కొంచెం పెద్దదిగా మరియు టూరింగ్-ఫ్రెండ్లీగా ఉన్నట్లు కనిపిస్తుంది. వీటిలో N250 బరువు 162 కిలోలుగా ఉంటే, మరియు F250 164 కిలోలుగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ 250సిసి బైక్‌లకు కొనసాగుతున్న డిమాండ్.. 6 నెలల వ్యవధిలో సరికొత్త రికార్డ్..

ఇక ఇంజన్ విషయానికి వస్తే, బజాజ్ పల్సర్ ఎఫ్250 మరియు ఎస్250 రెండూ కూడా ఒకేరకమైన 250 సిసి ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 24.5 బిహెచ్‌పి పవర్‌ను మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇక మెకానికల్స్ విషయానికి వస్తే, ఈ రెండు మోడళ్లలో ముందు వైపు 37 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు నైట్రోక్స్ మోనో షాక్‌ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటాయి.

బజాజ్ పల్సర్ 250సిసి బైక్‌లకు కొనసాగుతున్న డిమాండ్.. 6 నెలల వ్యవధిలో సరికొత్త రికార్డ్..

అలాగే, బ్రేకింగ్ ఫీచర్లను గమనిస్తే, ఈ రెండు మోడళ్లలో ముందు వైపు 300 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి రెండూ సింగిల్ ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా సపోర్ట్ చేస్తాయి. బజాజ్ పల్సర్ 250 ట్విన్స్‌లో, టాకోమీటర్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, గేర్-పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్-టు-ఎంప్టీ ఫ్యూయల్ గేజ్, క్లాక్ మొదలైన వివరాలను తెలియజేసే సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఈ లేటెస్ట్ మోడళ్లలో అధునాతన కనెక్టివిటీ ఫీచర్ లేకపోవడం గమనార్హం.

Most Read Articles

English summary
High demand continues to bajaj pulsar 250 twins company sold over 10000 units in 6 months
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X