ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్ కావాలా.. అయితే ఇవిగో టాప్ 10 టూ వీలర్స్

ఆధునిక కాలంలో అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వినియోగం కంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువవుతోంది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ఇంధన ధరలు మరియు ఇతరత్రా కారణాలు కావచ్చు. అయితే తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ పరిధిని అందించే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతారు.

Recommended Video

Royal Enfield నుంచి కొత్త Hunter 350 వచ్చేసింది | ధర & వివరాలు

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఎలక్ట్రిక్ బైకులు మరియు స్కూటర్లు దాదాపు 150 కిలోమీటర్ల కంటే కూడా ఎక్కువ పరిధిని అందిస్తున్నాయి. కాగా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎక్కువ పరిధిని అందించే టాప్ 10 ఎలక్ట్రిక్ బైకులు మరియు స్కూటర్లను గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

కోమాకి రేంజర్ (Komaki Ranger):

భారతీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే బైక్ ఏది అనగానే గుర్తొన్చేది కోమాకి కంపెనీ యొక్క రేంజర్ ఎలక్ట్రిక్ బైక్. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 1.85 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

కోమాకి రేంజర్ ఎలక్ట్రిక్ బైక్ 3.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. కావున ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 220 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అదే సమయంలో ఇందులో 4 కిలోవాట్ BLDC మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకెళ్తుంది. కావున ఈ ఎలక్ట్రిక్ బైక్ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ (Oben Rorr Electric Bike):

ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ బైకుల్లో 'ఓబెన్ రోర్' ఎలక్ట్రిక్ బైక్ కూడా ఒకటి. దీని ధర రూ. 1.02 లక్షలు. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అతి తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ బైకుల్లో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఈ బైక్‌లో 4.4 కిలోవాట్ పెద్ద బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. కావున ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 200 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో తప్పకుండా 150 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో (Ola Electric S1 Pro):

అతి తక్కువ కాలంలోనే భారతీయ మార్కెట్లో అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ యొక్క S1 ప్రో కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో ఒకటి. ఇది 8.5 కిలోవాట్ మోటార్‌తో అందుబాటులో ఉంటుంది. కావున దీని గరిష్ట వేగం గంటకు 115 కిమీ వరకు ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

'ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో'లో అమర్చబడిన 4 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 181 కిమీ రేంజ్ అందిస్తుండని ARAI చేత ధ్రువీకరించింది. అయితే వాస్తవ ప్రపంచంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్ట్స్ మోడ్ లో 102 కిమీ మరియు నార్మల్ మోడ్‌లో 127 కిమీ రేంజ్ అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో ధర దేశీయ మార్కెట్లో రూ. 1.39 లక్షలు.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

టోర్క్ మోటార్స్ క్రటోస్/క్రటోస్ ఆర్ (Tork Motors Kratos/Kratos R):

టోర్క్ మోటార్స్ యొక్క క్రటోస్ మరియు క్రటోస్ ఆర్ కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూవీలర్స్ జాబితాలో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 1.22 లక్షలు (క్రటోస్) మరియు రూ. 1.37 లక్షలు (క్రటోస్ ఆర్). కంపెనీ ఇటీవల కాలంలోనే వీటి డెలివరీలను ప్రారంభించింది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

కంపెనీ యొక్క రెండు బైకులు గరిష్టంగా ఒక ఫుల్ ఛార్జ్ తో 180 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తాయి. వీటిలో 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. కావున మంచి పరిధిని అందిస్తుంది. ప్రస్తుతం ఈ బైకులు పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై మరియు ఢిల్లీ వంటి కూని ప్రధాన నగరాల్లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో కంపెనీ దేశ వ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

ఒడిస్సే హాక్ ప్లస్ (Odysse Hawk Plus):

కొంత తక్కువ ధర వద్ద ఎక్కువ పరిధిని అందించే ఎలక్ట్రిక్ బైకులు జాబితాలో ఒడిస్సే హాక్ ప్లస్ కూడా ఒకటి. దీని ధర రూ. 1.17 లక్షలు. అయితే ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 170 కిమీ పరిధిని అందిస్తుంది. దీనికోసం ఇందులో 2.88 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. అంతే కాకుండా ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున ఇది వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

రివోల్ట్ ఆర్‌వి 400 (Revolt RV 400):

అత్యంత ప్రజాదరణ పొందిన రివోల్ట్ కంపెనీ యొక్క ఆర్‌వి 400 బైక్ ధర రూ. 1.19 లక్షలు. ఇది 3.25 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. కావున ఇది ఒక ఫుల్ ఛార్జ్ మీద గరిష్టంగా 150 కిమీ రేంజ్ అందిస్తుందని ద్రువీకరించబడింది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 85 కిమీ వరకు ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

ఏథర్ 450ఎక్స్ జనరేషన్ 3 (Ather 450X Gen 3):

భారతీయ మార్కెట్లో గతః కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోనే తిరుగులేని అమ్మకాలు పొందుతున్న ఏథర్ ఎనర్జీ యొక్క ఏథర్ 450ఎక్స్ ఇటీవల 'ఏథర్ 450ఎక్స్ జనరేషన్ 3' అనే కొత్త వెర్షన్ లో విడుదలైంది. దీని ధర రూ. 1.39 లక్షలు, కాగా ఇది ఒక ఫుల్ ఛార్జ్ పైన గరిష్టంగా 146 కిమీ రేంజ్ అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

కొత్త ఏథర్ 450ఎక్స్ జనరేషన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మునుపటికంటే కూడా పెద్ద బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. కావున ఇది మునుపటికంటే కూడా ఎక్కువ పరిధిని అందిస్తుంది. అదే సమయంలో ఇందులో మొత్తం వార్ప్, స్పోర్ట్, రైడ్, ఎకో మరియు స్మార్ట్ ఎకో అనే 5 రైడింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ (Ola S1):

ఓలా ఎస్1 అనేది ఓలా ఎస్1 ప్రో యొక్క తోబుట్టువు. అయితే ఇది రూ. 99,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. కావున ఇది దాని ఎస్1 ప్రో కంటే సరసమైన ధర వద్ద లభిస్తుంది. అయితే రేంజ్ విషయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఓలా ఎస్1 స్కూటర్ లో 3kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 141 కిమీ పరిధిని అందిస్తుందని ధృవీకరించబడింది. అయితే వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో 128 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX - డ్యూయల్ బ్యాటరీ (Hero Electric Optima CX - Dual Battery):

హీరో ఎలక్ట్రిక్ యొక్క హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX అనేది దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ షూటర్. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 77,490 మాత్రమే. అయితే ఇది ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. కావున ఎక్కువ సంఖ్యకు అమ్మకాలు పొందుతుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CXలో 1.53 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 140 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 45 కిమీ వరకు ఉంటుంది. ఇందుల్ప్ 1.2 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ కూడా ఉంటుంది. కావున వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

ఒకినావా ఐప్రైస్+ (Okinawa iPrase Plus):

ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆధారం పొందుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల జాబితాలో ఒకినావా కంపెనీ యొక్క ఐప్రైస్ ప్లస్ కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.13 లక్షలు. అయితే దీని రేంజ్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో 139 కిమీ పరిధిని అందిస్తుంది.

Okinawa iPraise+ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.3 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. అదే సమయంలో ఇది 2.5 kW మోటార్‌ను ఉపయోగిస్తుంది. కావున దీని గరిష్ట వేగం గంటకు 58 కిమీ వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సైడ్-స్టాండ్ కట్-ఆఫ్, USB ఛార్జర్ మరియు అడ్జస్టబుల్ బ్రేక్ లివర్ వంటి ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ఇవే: ఓ లుక్కేసుకోండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో ఎక్కువమంది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోలు చేసేవారు ముందుగా ఎక్కువ రేంజ్ (పరిధి) అందించే వాటిని సెలక్ట్ చేసుకుంటారు. అలాంటి వారు పైన చెప్పిన టాప్ 10 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో నచ్చినది ఎంచుకోవచ్చు. అంతే రానున్న రోజుల్లో కూడా మరింత ఎక్కువ పరిధిని అందించే ఎలక్ట్రిక్ బైకులు మరియు స్కూటర్లు దేశీయ మార్కెట్లో తప్పకుండా విడుదలవుతాయి. కావున ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు స్కూటర్ల గురించి మాత్రమే కాకుండా కొత్త కార్లకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, September 10, 2022, 10:53 [IST]
English summary
Highest claimed range electric bikes and scooters upto 220km details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+