త్వరలో విడుదలకానున్న 'హోండా యాక్టివా 6జి ప్రీమియం ఎడిషన్': ఫోటోలు
టూ వీలర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' దేశీయ మార్కెట్లో మరో కొత్త స్కూటర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త స్కూటర్ 'హోండా యాక్టివా 6జి ప్రీమియం ఎడిషన్'. దీనికి సంబంధించిన అధికారికి ఫోటోలను కంపెనీ ఇప్పుడు విడుదల చెసింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కంపెనీ విడుదల చేసిన ఈ ఫోటోలలో రాబోయే '6జి ప్రీమియం ఎడిషన్ స్కూటర్' ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుస్తోంది. ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. కావున ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ఇప్పటికే కంపెనీకి మంచి అమ్మకాలు తీసుకురావడంలో 'హోండా యాక్టివా' ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ఈ తరుణంలో హోండా యాక్టివా 6జి అనేది ప్రీమియం ఎడిషన్ లో విడుదలైతే తప్పకుండా మరిన్ని ఎక్కువ అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. దీనికి తోడు రానున్న పండుగ సీజన్ కూడా అమ్మకాలు పెంచడానికి ఎంతగానో సహకరిస్తుందని ఆశించవచ్చు.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా భారతదేశంలో ప్రారంభం కానున్న పండుగ సీజన్‌ను మరింత అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. రానున్న ఆ పండుగ సీజన్ ఉపయోగించుకోవడానికి ఇతర కంపెనీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. కావున ఈ సమయంలో కొత్త ఉత్పత్తులు విడుదలచేయాల్సిన అవసరం ఎతైన ఉంది.

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త హోండా యాక్టివా 6G ప్రీమియం ఎడిషన్ స్కూటర్ ఫోటోలను గమనిస్తే, ఇది చూడగానే చాలా ఆకర్షించే విధంగా ఉంటుంది. దానికి తోడు ఇందులో గోల్డ్ కలర్ బ్యాడ్జెస్ కూడా మరింత ఆకర్షణను పెంచడంలో తోడ్పడతాయి. అంతే కాకూండా ఇందులోని వీల్స్ గోల్డ్ కలర్ లోనే ఉంటాయి, కానీ ఇవి ఉక్కుతో నిర్మితమై ఉంటాయి.

త్వరలో రానున్న కొత్త హోండా యాక్టివా 6G ప్రీమియం ఎడిషన్ స్కూటర్ యొక్క సీట్లు బ్రౌన్ కలర్ లో ఉండటం గమనించవచ్చు. అదే సమయంలో ఇందులో సాధారణంగా ఉపయోగించే బ్లాక్ ప్లాస్టిక్ స్థానంలో బ్రౌన్ కలర్ ప్లాస్టిక్ ఉపయోగించబడింది. ఇది ఈ స్కూటర్ కి మరింత ప్రీమియం లుక్ ఇస్తుంది.

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ ప్రస్తుతానికి తన కొత్త యాక్టివా 6G ప్రీమియం ఎడిషన్ స్కూటర్ యొక్క మూడు కలర్స్ వెల్లడించింది. అవి రెడ్, బ్లూ మరియు గ్రీన్ కలర్స్. ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో ఉపయోగించడానికి మరియు వాహన వినియోగదారులను ఆకర్షించడానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉన్నాయి.

హోండా యాక్టివా 6జి ప్రీమియం స్కూటర్ లో బిఎస్ 6, 109.57 సిసి సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.68 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.84 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. మొత్తం మీద కంపెనీ తన కొత్త 6జి ప్రీమియం స్కూటర్ లో పెద్దగా మార్పులు చేయలేదు.

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం, హోండా యాక్టివా 6జి మొత్తం ఆరు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అదే సమయంలో ఇది రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి హోండా యాక్టివా 6జి స్టాండర్డ్ వేరియంట్ మరియు హోండా యాక్టివా 6జి డీలక్స్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 72,400 మరియు రూ. 74,400 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

హోండా 6జి యొక్క స్టాండర్డ్ వేరియంట్ ధరకంటే కూడా రానున్న కొత్త ప్రీమియం ఎడిషన్ స్కూటర్ ధర రూ. 2000 నుంచి రూ. 2,500 వరకు ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. అయితే ధరకు తగ్గట్టుగానే USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అదనపు ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ ప్రస్తుతం మార్కెట్లో విడుదలవుతున్న ద్విచక్ర వాహనాల్లో స్టాండర్డ్ గా అందుబాటులో ఉన్నాయి. కావున కంపెనీ కూడా తన కొత్త వెర్షన్ లో ఈ అప్డేటెడ్ ఫీచర్స్ తీసుకురానుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతదేశంలో వినాయక చవితి మరియు విజయదశమి వంటి పండుగలో వస్తున్నాయి. ఈ సమయంలో కంపెనీ విడుదల చేసే ఈ కొత్త స్కూటర్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంది. ఇది కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచడంలో సహాయపడుతుంది.


Click it and Unblock the Notifications








