హోండా యాక్టివా ఇప్పుడు ప్రీమియం ఎడిషన్‌లో: ధర తక్కువ & కొత్త కలర్ ఆప్షన్స్‌లో

భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థలలో ఒకటైన 'హోండా మోటార్‌సైకిల్స్ మరియు స్కూటర్స్ ఇండియా' ఎట్టకేలకు తన యాక్టివా ప్రీమియం ఎడిషన్‌ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త ఎడిషన్ ధర రూ. 75,400 (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్ స్కూటర్ డిజైన్ ఏంటి, ఫీచర్స్ లో ఏమైనా కొత్తవి ఉన్నాయా అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

హోండా యాక్టివా ఇప్పుడు ప్రీమియం ఎడిషన్‌లో: ధర తక్కువ & కొత్త కలర్ ఆప్షన్స్‌లో

కంపెనీ విడుదల చేసిన కొత్త 'యాక్టివా ప్రీమియం ఎడిషన్' ఇప్పుడు మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇది టాప్-స్పెక్ హోండా యాక్టివా డిఎల్‌ఎక్స్ వేరియంట్ కంటే సరిగ్గా రూ. 1,000 ఖరీదైనది. బేస్-స్పెక్ హోండా యాక్టివా 6G స్టాండర్డ్ వేరియంట్ ధరలు రూ. 72,400 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.

హోండా యాక్టివా ఇప్పుడు ప్రీమియం ఎడిషన్‌లో: ధర తక్కువ & కొత్త కలర్ ఆప్షన్స్‌లో

హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్, ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా తయారుచేయబడింది. దీనికి ప్రధాన కారంగా కొనుగులుదారులను ఆకర్శించడమే. అయితే ఇందులో హార్డ్‌వేర్ స్పెక్స్ మరియు ఫీచర్లు హోండా యాక్టివా డిఎల్‌ఎక్స్ వేరియంట్ వలె ఉన్నాయి. ఇంజిన్ లో కూడా ఎటువంటి మార్పులు జరగలేదు .

హోండా యాక్టివా ఇప్పుడు ప్రీమియం ఎడిషన్‌లో: ధర తక్కువ & కొత్త కలర్ ఆప్షన్స్‌లో

హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్ ఇప్పుడు కొత్త కలర్ లో అందుబాటులో ఉంది. అదే సమయంలో మరింత ప్రీమియం టచ్ ఇవ్వడానికి ముందు భాగంలో గోల్డెన్ ఇన్‌సర్ట్‌లను అమర్చారు. ముందువైపు డ్యూయల్ వింగ్-టైప్ డిజైన్ ఇప్పుడు గోల్డెన్ షేడ్‌లో ఉంది. దీనితోపాటు ముందు మరియు వెనుక వీల్స్ గోల్డెన్ పెయింట్ షేడ్‌లో ఉన్నాయి. కాకపోతే ఇవి ఉక్కు వీల్స్.

హోండా యాక్టివా ఇప్పుడు ప్రీమియం ఎడిషన్‌లో: ధర తక్కువ & కొత్త కలర్ ఆప్షన్స్‌లో

ఇందులోని ప్లాస్టిక్ ప్యానెల్‌లకు కూడా డ్యూయల్ టోన్ ట్రీట్‌మెంట్‌ అందించడం జరిగింది. కావున ఫుట్‌బోర్డ్ ప్రాంతం మరియు దానికి జోడించిన ప్యానెల్‌లు ఇప్పుడు ముదురు గోధుమ రంగులో ఉన్నాయి. కాంట్రాస్ట్‌ని బ్యాలెన్స్‌గా ఉంచడం కోసం, స్కూటర్ సీటు కూడా అదే బ్రౌన్ షేడ్‌లో పూర్తి చేయడం జరిగింది. మెటాలిక్ బాడీ ప్యానెల్స్‌పై మ్యాట్ బ్లూ పెయింట్ షేడ్‌, ప్రీమియం నేమ్‌ప్లేట్‌తో పాటు సైడ్ ప్యానెల్ లో నేమ్ బ్యాడ్జ్ కూడా గోల్డెన్ కలర్ లో ఉంది. ఇవన్నీ ఈ స్కూటర్ యొక్క ప్రీమియం నెస్ పెంచడంలో సహాయపడతాయి.

హోండా యాక్టివా ఇప్పుడు ప్రీమియం ఎడిషన్‌లో: ధర తక్కువ & కొత్త కలర్ ఆప్షన్స్‌లో

హోండా ప్రీమియం ఎడిషన్‌ ఇప్పుడు 3 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి మాట్ మార్షల్, మాట్ సాంగ్రియా మరియు మాట్ పెర్ల్ కలర్స్. ఇందులో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ ఉంటుంది. ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌లైట్, వెనుక భాగంలో హ్యాలోజన్ టెయిల్‌లైట్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద కొత్త యాక్టివా ప్రీమియం ఎడిషన్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి.

హోండా యాక్టివా ఇప్పుడు ప్రీమియం ఎడిషన్‌లో: ధర తక్కువ & కొత్త కలర్ ఆప్షన్స్‌లో

ఇక ఇందులోని ఇంజిన్ విషయానికి వస్తే, ఈ ప్రీమియం ఎడిషన్‌లో కూడా కొత్త BS6 109.51సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ ఉంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.68 బిహెచ్‌పి పవర్‌ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.84 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

హోండా యాక్టివా ఇప్పుడు ప్రీమియం ఎడిషన్‌లో: ధర తక్కువ & కొత్త కలర్ ఆప్షన్స్‌లో

హోండా మోటార్‌సైకిల్స్ మరియు స్కూటర్స్ ఇండియా యొక్క యాక్టివా కంపెనీకి ఎక్కువ అమ్మకాలను తీసుకురావడంలో చాలా సహకరించింది. అయితే ఇప్పుడు ఈ స్కూటర్ మరిన్ని కొత్త హంగులతో, మరింత ఆకర్షణీయంగా మార్కెట్లో విడుదలైంది. కావున ఇది తప్పకుండా రానున్న పండుగ సీజన్ లో ఆశించిన అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

హోండా యాక్టివా ఇప్పుడు ప్రీమియం ఎడిషన్‌లో: ధర తక్కువ & కొత్త కలర్ ఆప్షన్స్‌లో

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను అప్డేట్ చేస్తూనే ఉన్నాయి. ఇది కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సిద్ధాంతాన్నే ఇప్పుడు హోండా మోటార్‌సైకిల్ కంపెనీ పాటించింది. ఇందులో భాగంగానే కొత్త అప్డేటెడ్ యాక్టివా ప్రీమియం ఎడిషన్ విడుదలైంది. ఇది దేశీయ మార్కెట్లో టీవీవీఎస్ జుపిటర్ మరియు హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 18, 2022, 12:06 [IST]
English summary
Honda activa premium edition launched in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+