హోండా యాక్టివా 6జి 'ప్రీమియం ఎడిషన్ vs స్టాండర్డ్ ఎడిషన్'.. ఇందులో ఏది బెస్ట్?

'హోండా మోటార్‌సైకిల్స్ మరియు స్కూటర్స్ ఇండియా' యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన 'యాక్టివా' (Activa) స్కూటర్ ఇటీవల కొత్త అవతార్ లో విడుదలైంది. అదే 'యాక్టివా 6జి ప్రీమియం ఎడిషన్' (Activa Premium Edition). ఈ కొత్త ఎడిషన్ ఆధునిక డిజైన్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంది.

Recommended Video

Mahindra Scorpio Classic Launched In TELUGU | Price At Rs 11.99 Lakh | Variants & Features Explained

అయితే ఇప్పటికే ఉన్న యాక్టివా 6జి మరియు కొత్తగా విడుదలైన యాక్టివా 6జి ప్రీమియం ఎడిషన్ మధ్య ఉన్న తేడాలేంటి, డిజైన్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా.. ఇంజిన్ లో అప్డేట్ ఉందా అనే మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

హోండా యాక్టివా 6జి 'ప్రీమియం ఎడిషన్ vs స్టాండర్డ్ ఎడిషన్'.. ఇందులో ఏది బెస్ట్?

మొదట ధరల విషయానికి వస్తే, ఇటీవల విడుదలైన కొత్త యాక్టివా 6జి ప్రీమియం ఎడిషన్ ధర రూ. 75,400 (ఎక్స్-షోరూమ్). అయితే దీని స్టాండర్డ్ మోడల్ ధర రూ. 72,400 (ఎక్స్-షోరూమ్). అంటే కొత్త ప్రీమియం మోడల్ స్టాండ్ర్డ్ మోడల్ కంటే కూడా రూ. 3,000 ఎక్కువ ఖరీదైనది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ స్టాండర్డ్ ఎడిషన్‌తో పోలిస్తే ఎలాంటి మెకానికల్ అప్‌డేట్‌లను పొందలేదు. కానీ ఆధునిక డిజైన్ కలిగి ఉంది.

హోండా యాక్టివా 6జి 'ప్రీమియం ఎడిషన్ vs స్టాండర్డ్ ఎడిషన్'.. ఇందులో ఏది బెస్ట్?

డిజైన్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ యొక్క ముందు భాగంలో గోల్డ్ ఫినిషింగ్ యాక్సెంట్‌లను పొందుతుంది. ఇవి దాని డిజైన్ ని మరింత పెంచడంలో చాలా సహాయపడతాయి. అదే సమయంలో ఇక్కడ గోల్డెన్ కలర్ అల్లాయ్ వీల్స్ కూడా చూడవచ్చు. ముందువైపు డ్యూయల్ వింగ్-టైప్ డిజైన్ ఇప్పుడు గోల్డెన్ షేడ్‌లో ఉంది. దీనితోపాటు ముందు మరియు వెనుక వీల్స్ గోల్డెన్ పెయింట్ షేడ్‌లో ఉన్నాయి. కాకపోతే ఇవి ఉక్కు వీల్స్.

హోండా యాక్టివా 6జి 'ప్రీమియం ఎడిషన్ vs స్టాండర్డ్ ఎడిషన్'.. ఇందులో ఏది బెస్ట్?

ఇందులోని ప్లాస్టిక్ ప్యానెల్‌లకు కూడా డ్యూయల్ టోన్ ట్రీట్‌మెంట్‌ అందించడం జరిగింది. కావున ఫుట్‌బోర్డ్ ప్రాంతం మరియు దానికి జోడించిన ప్యానెల్‌లు ఇప్పుడు ముదురు గోధుమ రంగులో ఉన్నాయి. కాంట్రాస్ట్‌ని బ్యాలెన్స్‌గా ఉంచడం కోసం, స్కూటర్ సీటు కూడా అదే బ్రౌన్ షేడ్‌లో పూర్తి చేయడం జరిగింది. మెటాలిక్ బాడీ ప్యానెల్స్‌పై మ్యాట్ బ్లూ పెయింట్ షేడ్‌, ప్రీమియం నేమ్‌ప్లేట్‌తో పాటు సైడ్ ప్యానెల్ లో నేమ్ బ్యాడ్జ్ కూడా గోల్డెన్ కలర్ లో ఉంది. ఇవన్నీ ఈ స్కూటర్ యొక్క ప్రీమియం నెస్ పెంచడంలో సహాయపడతాయి.

హోండా యాక్టివా 6జి 'ప్రీమియం ఎడిషన్ vs స్టాండర్డ్ ఎడిషన్'.. ఇందులో ఏది బెస్ట్?

స్టాండర్డ్ వేరియంట్ కూడా మంచి డిజైన్ పొందుతుంది, కానీ ఇందులో గోల్డ్ కలర్ బ్యాడ్జ్ మరియు గోల్డ్ యాక్సెంట్స్ లేవు. అయితే హ్యాలోజన్ హెడ్ లాంప్, ఎల్ఈడీ టెయిల్ లైట్ మొదలైనవి ఉన్నాయి. ఇవి ప్రీమియం ఎడిషన్ లో కూడా ఉన్నాయి.

హోండా యాక్టివా 6జి 'ప్రీమియం ఎడిషన్ vs స్టాండర్డ్ ఎడిషన్'.. ఇందులో ఏది బెస్ట్?

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, స్టాండర్డ్ స్కూటర్ లోని ఫీచర్స్ ప్రీమియం ఎడిషన్ లో కూడా ఉన్నాయి. కావున ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. కావున అనలాగ్ ఓడోమీటర్, అనలాగ్ స్పీడోమీటర్ మరియు అనలాగ్ టాకొమీటర్ వంటివి ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఫ్యూయెల్ క్యాప్ రెంటిందింటిలోనూ అందుబాటులో ఉంటుంది.

హోండా యాక్టివా 6జి 'ప్రీమియం ఎడిషన్ vs స్టాండర్డ్ ఎడిషన్'.. ఇందులో ఏది బెస్ట్?

కొత్త హోండా యాక్టివా 6జి ప్రీమియం ఎడిషన్‌ మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్, మ్యాట్ మార్సల్ గ్రీన్ మెటాలిక్ మరియు పెర్ల్ సైరన్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే స్టాండర్డ్ వెర్షన్ బ్లాక్, పెర్ల్ ప్రెషియస్ వైట్, డీసెంట్ బ్లూ, మాట్ మాగ్నిఫిసెంట్ కాపర్ మెటాలిక్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ మరియు రెబెల్ రెడ్ మెటాలిక్ వంటి మొత్తం 6 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

హోండా యాక్టివా 6జి 'ప్రీమియం ఎడిషన్ vs స్టాండర్డ్ ఎడిషన్'.. ఇందులో ఏది బెస్ట్?

ఇంజిన్ కూడా స్టాండర్డ్ వేరియంట్ లో మాదిరిగానే.. ప్రీమియం ఎడిషన్‌లో కూడా కొత్త BS6 109.51 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ ఉంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.68 బిహెచ్‌పి పవర్‌ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.84 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

హోండా యాక్టివా 6జి 'ప్రీమియం ఎడిషన్ vs స్టాండర్డ్ ఎడిషన్'.. ఇందులో ఏది బెస్ట్?

బ్రేకింగ్ సిస్టం మరియు సస్పెన్షన్ కూడా రెండు స్కూటర్లలో ఒకే మాదిరిగా ఉంటాయి. కావున 130 మిమీ డ్రమ్ బ్రేకులు ముందు మరియు వెనుకవైపు ఉంటాయి.

అదే సమయంలో సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందువైపు టెలిస్కోపిక్ పోర్క్ మరియు వెనుకవైపు అడ్జస్టబుల్ హైడ్రాలిక్ అందుబాటులో ఉంటుంది. కావున రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

హోండా యాక్టివా 6జి 'ప్రీమియం ఎడిషన్ vs స్టాండర్డ్ ఎడిషన్'.. ఇందులో ఏది బెస్ట్?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

నిజానికి చూడగానే స్టాండర్డ్ యాక్టివా మరియు ప్రీమియం యాక్టివా ఒకేలా అనిపిస్తాయి, కానీ ప్రీమియం ఎడిషన్ మరిన్ని హంగులతో చాలా కొత్తగా ఉంటుంది. కావున ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం కూడా ఉంది. ధర కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కేవలం రూ. 3000 మాత్రమే ఎక్కువ కాబట్టి ఇది తప్పకుండా మంచి విక్రయాలు పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Honda activa premium vs standard edition comparison details
Story first published: Tuesday, August 23, 2022, 17:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X