హోండా CB300F కొనుగోలుపై రూ. 50,000 ఆదా చేయండి: ఇక త్వరపడండి
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయిస్తున్న తన 'సిబి300ఎఫ్' (CB300F) బైక్ కొనులుపై ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్ తీసుకువచ్చింది. కంపెనీ అందించే ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
కంపెనీ ఈ 2022 చివరి నెలలో కూడా ఉత్తమ అమ్మకాలను పొందటానికి ఇప్పుడు CB300F పై రూ. 50,000 తగ్గింపును ప్రకటించింది. కావున CB300F కొనాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 50,000 తగ్గింపుతో ఈ బైక్ సొంతం చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ యొక్క ప్రీమియం బిగ్‌వింగ్ డీలర్‌షిప్ ద్వారా ఈ బైక్ కొనుగోలు చేయవచ్చు.

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ గత ఆగష్టు నెలలో హోండా CB300F బైకుని రెండు వేరియంట్స్ లో విడుదల చేసింది. అవి డీలక్స్ మరియు డీలక్స్ ప్రో వేరియంట్లు. విడుదల సమయంలో ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 2,25,900 మరియు రూ. 2,28,900 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉండేవి. అయితే కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్ వాళ్ళ ఈ రెండు వేరియంట్లు రూ. 1,75,900 మరియు రూ. 1,78,000 కి చేరాయి.
కంపెనీ అందించిన ఈ అద్బుతమైన ఆఫర్ కారణంగా 'హోండా CB300F' KTM డ్యూక్ 125 బైక్ కంటే కూడా సరసమైనదిగా మారిపోయింది. దేశీయ మార్కెట్లో KTM డ్యూక్ 125 ధర రూ. 1.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). కాగా CB300F ఇప్పుడు ధర వద్ద బజాజ్ డామినార్ (రూ. 1.75 లక్షలు) బైక్ కి సమానంగా ఉంది. ప్రస్తుతం CB300F స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
హోండా సిబి300ఎఫ్ మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ మరియు మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ బైక్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అగ్రెసివ్ లుక్ పొందుతుంది. ఈ కొత్త బైక్ పొడవు 2,084 మిమీ, వెడల్పు 765 మిమీ, ఎత్తు 1,075 మిమీ మరియు వీల్‌బేస్ 1,390 మిమీ వరకు ఉంటుంది.
హోండా CB300F మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, షార్ప్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్, స్ప్లిట్ సీట్, వెనుక భాగంలో ఎత్తుగా ఉండే టెయిల్ సెక్షన్, పొట్టిగా ఉండే చబ్బీ సైలెన్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉండే ఇంజన్, బాడీ కలర్ ఫ్రంట్ మడ్‌గార్డ్, సన్నటి టర్న్ ఇండికేటర్లు మరియు యాంగ్యులర్ హెడ్‌ల్యాంప్, స్ప్లిట్ గ్రాబ్ రెయిల్, ఇంజన్ కేసింగ్, హాఫ్ చైన్ ఫ్రేమ్ మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ పొందుతుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టాపర్డ్ హ్యాండిల్‌బార్లు మరియు మెరుగైన రోడ్ గ్రిప్ కోసం విస్తృతమైన రియర్ రేడియల్ టైర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ డైమండ్ టైప్ ఫ్రేమ్ పై తయారు చేయబడింది. ఇందులో ముందు భాగంలో తలక్రిందులుగా ఉన్న అప్-సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది.
హోండా సిబి300ఎఫ్ బైక్ 293.52 సీసీ, ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.1 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 25.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్ సెటప్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








