హోండా ఎంతో సస్పెన్స్‌ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ (Honda CB300F)

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (Honda Motorcycle and Scooter India Limited), భారత మార్కెట్లో ఎంతో సస్పెన్స్‌గా ఉంచిన తమ కొత్త మోటార్‌సైకిల్ హోండా సిబి300ఎఫ్ (Honda CB300F) ను విడుదల చేసింది. భారతదేశంలో సరికొత్త హోండా సిబి300ఎఫ్ బైక్ ధరలు రూ. 2.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. హోండా సిబి300ఎఫ్ ఎక్స్‌క్లూజివ్ గా హోండా యొక్క ప్రీమియం బైక్ డీలర్‌షిప్ అయిన బిగ్‌వింగ్ అవుట్‌లెట్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

హోండా ఎంతో సస్పెన్స్‌ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ (Honda CB300F)

హోండా నుండి తాజాగా వచ్చిన కొత్త CB300F చూడటానికి నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్ మాదిరిగా కనిపిస్తుంది. కంపెనీ ఈ మోడల్ ను రెండు వేరియంట్లు మూడు కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. హోండా సిబి300ఎఫ్ ను కంపెనీ డీలక్స్ మరియు డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తోంది. వాటి ధరలు ఇలా ఉన్నాయి:

* హోండా సిబి300ఎఫ్ డీలక్స్ - రూ. 2,25,900

* హోండా సిబి300ఎఫ్ డీలక్స్ ప్రో - రూ. 2,28,900

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా ఎంతో సస్పెన్స్‌ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ (Honda CB300F)

హోండా సిబి300ఎఫ్ యొక్క ప్రతి వేరియంట్ కూడా మూడు రంగులలో అందించబడుతుంది. వీటిలో స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ మరియు మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. హోండా సిబి300ఎఫ్ మోటార్‌సైకిల్ మంచి అగ్రెసివ్ లుక్ తో మజిక్యులర్ డిజైన్ ను కలిగి ఉంటుంది. దీని విశిష్టమైన డిజైన్ లాంగ్వేజ్ కారణంగా ఈ బైక్ అన్ని వైపుల నుండి షార్ప్ గా కనిపిస్తుంది.

హోండా ఎంతో సస్పెన్స్‌ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ (Honda CB300F)

ముందు భాగంలో తలక్రిందులుగా ఉండే గోల్డ్ కలర్ అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు షార్ప్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్, స్ప్లిట్ సీట్, వెనుక భాగంలో ఎత్తుగా ఉండే టెయిల్ సెక్షన్, పొట్టిగా ఉండే చబ్బీ సైలెన్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉండే ఇంజన్, బాడీ కలర్ ఫ్రంట్ మడ్‌గార్డ్, సన్నటి టర్న్ ఇండికేటర్లు మరియు యాంగ్యులర్ హెడ్‌ల్యాంప్, స్ప్లిట్ గ్రాబ్ రెయిల్, ఇంజన్ కేసింగ్, హాఫ్ చైన్ ఫ్రేమ్ మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ ను ఈ కొత్త హోండా సిబి300ఎఫ్ బైక్ లో గమనించవచ్చు.

హోండా ఎంతో సస్పెన్స్‌ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ (Honda CB300F)

కొత్త హోండా సిబి300ఎఫ్ మెకానికల్స్ ని గమనిస్తే, ఈ బైక్ డైమండ్ టైప్ ఫ్రేమ్ పై తయారు చేయబడింది. ఇందులో ముందు భాగంలో తలక్రిందులుగా ఉన్న అప్-సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనోషాక్‌ సస్పెన్షన్ సెటప్, అలాగే, ముందు వైపు 276 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 220 మిమీ డిస్క్‌ బ్రేక్ మొదలైనవి ఉన్నాయి. ఈ రెండు బ్రేక్ లు కూడా డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ను సపోర్ట్ చేస్తాయి.

హోండా ఎంతో సస్పెన్స్‌ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ (Honda CB300F)

హోండా సిబి300ఎఫ్ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ లో ముందు చక్రంపై 110/70R-M/C 54H ప్రొఫైల్ టైరు మరియు వెనుక చక్రంపై 150/60R-17M/C 66H ప్రొఫైల్ టైరు అమర్చబడి ఉంటాయి. ఈ బైక్ కి ఇరువైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇక కొలతల విషయానికి వస్తే, ఈ కొత్త హోండా ప్రీమియం బైక్ పొడవు 2,084 మిమీ, వెడల్పు 765 మిమీ, ఎత్తు 1,075 మిమీ మరియు వీల్‌బేస్ 1,390 మిమీగా ఉంటుంది. ఈ బైక్ మొత్తం బరువు 153 కిలోగ్రాములు మరియు భూమి నుండి రైడర్ సీటు ఎత్తు 789 మిమీ కాగా, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 177 మిమీగా ఉంటుంది.

హోండా ఎంతో సస్పెన్స్‌ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ (Honda CB300F)

ఇక చివరిగా ఇంజన్ విషయానికి వస్తే, హోండా సిబి300ఎఫ్ (Honda CB300F) మోటార్‌సైకిల్ లో 293.52 సీసీ, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.1 బిహెచ్‌పి పవర్ ను మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 25.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్ సెటప్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

హోండా ఎంతో సస్పెన్స్‌ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ (Honda CB300F)

హోండా సిబి300ఎఫ్ మోటార్‌సైకిల్ లోని ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పూర్తి ఎల్ఈడి లైటింగ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC), V-ఆకారపు అల్లాయ్ వీల్స్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టాపర్డ్ హ్యాండిల్‌బార్లు మరియు మెరుగైన రోడ్ గ్రిప్ కోసం విస్తృతమైన రియర్ రేడియల్ టైర్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. కొత్త Honda CB300F భారత మార్కెట్లో KTM 390 Duke, BMW G 310 R అలాగే దాని తోబుట్టువైన Honda CB300R వంటి స్ట్రీట్‌ఫైటర్‌లతో పోటీపడుతుంది.

హోండా ఎంతో సస్పెన్స్‌ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ (Honda CB300F)

మార్కెట్లో కొత్త హోండా సిబి300ఎఫ్ మోటార్‌సైకిల్ ను విడుదల చేసిన సందర్భంగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ మరియు సీఈఓ అట్సుషి ఒగాటా మాట్లాడుతూ.. తాము మోటార్‌సైకిల్ కేటగిరీలో ఎదుగుతున్నందున భారతదేశంలో ద్విచక్ర వాహనాల ల్యాండ్‌స్కేప్ పెద్ద మార్పుకు లోనవుతోందని, ముఖ్యంగా రైడ్ మిడ్-సైజ్ విభాగంలో ఎక్కువ పనితీరు, స్టైలిష్ డిజైన్ మరియు ఆధునికతల మధ్య చక్కటి సమతుల్యత కోసం చూస్తున్నారని అలాంటి యువ ఔత్సాహికులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త సిబి300ఎఫ్ ను విడుదల చేశామని ఆయన చెప్పారు.

Most Read Articles

English summary
Honda cb300f launched in india price starts from rs 2 25 lakhs design specs and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X