ఒక్కసారిగా రూ. 1.08 లక్షలు తగ్గిన Honda CB500X ధర: ఇక ఆలస్యం మీదే.. త్వరపడండి

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' తమ కొత్త సిబి 500 ఎక్స్ (Honda CB500X) అడ్వెంచర్-టూరర్‌ బైక్ ని భారత మార్కెట్లో 2021 లో విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదల సమయంలో ఈ బైక్ ప్రారంభ ధర రూ. 6.87 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అయితే కంపెనీ ఇప్పుడు ఈ బైక్ పైన ఏకంగా రూ. 1.08 లక్షలు తగ్గించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒక్కసారిగా రూ. 1.08 లక్షలు తగ్గిన Honda CB500X ధర: ఇక ఆలస్యం మీదే.. త్వరపడండి

నివేదికల ప్రకారం, కంపెనీ యొక్క మిడిల్ వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ అయిన హోండా సిబి500ఎక్స్ ధర ఇప్పుడు రూ. 1.08 లక్షలు తగ్గింది. ధరల తగ్గుదల తరువాత ఈ బైక్ ప్రారంభ ధర రూ. 5.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దాదాపు దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు తమ ఉత్పతుల ధరలను పెంచుతున్న తరుణంలో కంపెనీ కొనుగోలుదారులకు ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. దీని వల్ల ఈ బైక్ యొక్క అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

ఒక్కసారిగా రూ. 1.08 లక్షలు తగ్గిన Honda CB500X ధర: ఇక ఆలస్యం మీదే.. త్వరపడండి

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ కొన్ని నెలల క్రితం యూరప్‌ మార్కెట్లో తన 500 సిసి లైనప్‌ను అప్‌డేట్ చేసింది. ఇందులో CB500X కూడా ఉంది. అప్డేట్ చేయబడిన ఈ మోడల్ బైక్ ఈ సంవత్సరం భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి కంపెనీ ఇప్పటికే ప్రస్తావించింది.

ఒక్కసారిగా రూ. 1.08 లక్షలు తగ్గిన Honda CB500X ధర: ఇక ఆలస్యం మీదే.. త్వరపడండి

రానున్న కొత్త అప్డేటెడ్ మోడల్ ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఉన్న స్టాక్ పూర్తిగా అమ్ముకోవడానికి కంపెనీ ఈ ధర తగ్గింపును ప్రకటించినట్లు తెలిసింది. ఏది ఏమైనా బైక్ ప్రియులకు మాత్రం ఇది శుభవార్త అనే చెప్పాలి.

ఒక్కసారిగా రూ. 1.08 లక్షలు తగ్గిన Honda CB500X ధర: ఇక ఆలస్యం మీదే.. త్వరపడండి

హోండా సిబి 500 ఎక్స్ దేశవ్యాప్తంగా బ్రాండ్ యొక్క ప్రత్యేకమైన బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్‌షిప్‌ల ద్వారా భారతదేశంలో విక్రయించబడుతుంది. హోండా సిబి 500 ఎక్స్‌ను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్‌గా దేశీయ మార్కెట్లోకి దిగుమతి చేయడం జరుగుతుంది.

ఒక్కసారిగా రూ. 1.08 లక్షలు తగ్గిన Honda CB500X ధర: ఇక ఆలస్యం మీదే.. త్వరపడండి

సరికొత్త హోండా సిబి 500 ఎక్స్ రెండు కలర్ ఆప్సన్స్ తో వస్తుంది. అవి గ్రాండ్ ప్రిక్స్ రెడ్ మరియు మాట్టే గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్. ఈ బైక్ సాహసప్రియులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది లాంగ్ డ్రైవ్ లో కూడా వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒక్కసారిగా రూ. 1.08 లక్షలు తగ్గిన Honda CB500X ధర: ఇక ఆలస్యం మీదే.. త్వరపడండి

హోండా సిబి 500 ఎక్స్ 471 సిసి 8 వాల్వ్ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8500 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 43.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అసిస్ట్ మరియు స్లిప్పర్-క్లచ్ మెకానిజంతో స్టాండర్డ్ గా వస్తుంది.

ఒక్కసారిగా రూ. 1.08 లక్షలు తగ్గిన Honda CB500X ధర: ఇక ఆలస్యం మీదే.. త్వరపడండి

కొత్త హోండా సిబి 500 ఎక్స్ బైక్ బ్రాండ్ యొక్క ఆఫ్రికా ట్విన్ యొక్క డిజైన్ ను తీసుకుంటుంది. చుట్టూ ఆల్-ఎల్ఈడి లైటింగ్, అల్లాయ్ వీల్స్, ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సింగిల్-పీస్ జీన్ వంటివి ఉన్నాయి. ఈ మోటారుసైకిల్‌లో డ్యూయల్-ఛానల్ ఎబిఎస్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ మరియు హోండా యొక్క ఇగ్నీషియన్ సేఫ్టీ సిస్టం కూడా ఉన్నాయి.

ఒక్కసారిగా రూ. 1.08 లక్షలు తగ్గిన Honda CB500X ధర: ఇక ఆలస్యం మీదే.. త్వరపడండి

హోండా CB500X డిజైన్ దాని ఆఫ్రికా ట్విన్ నుండి ప్రేరణ పొందింది, ఇది మంచి స్పోర్టీ లుక్‌తో వస్తుంది. ఈ బైక్‌లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది.

ఒక్కసారిగా రూ. 1.08 లక్షలు తగ్గిన Honda CB500X ధర: ఇక ఆలస్యం మీదే.. త్వరపడండి

హోండా సిబి 500 ఎక్స్ మిడ్-సైజ్ విభాగంలో బ్రాండ్ యొక్క లేటెస్ట్ అడ్వెంచర్-టూరర్ ఆఫర్. హోండా సిబి 500 ఎక్స్ భారత మార్కెట్లో కవాసకి వెర్సిస్ 650, సుజుకి వి-స్ట్రోమ్ 650 ఎక్స్‌టి మరియు బెనెల్లి టిఆర్‌కె 502 ఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.హోండా సిబి500ఎక్స్ ధర ఇప్పుడు ఒక్కసారిగా ఒక లక్ష కంటే ఎక్కువ తగ్గడం వల్ల దీని అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 15, 2022, 16:12 [IST]
English summary
Honda cb500x price reduced by rs 1 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+