ఈ హోండా మోటార్‌సైకిల్‌పై రూ.10 లక్షల డిస్కౌంట్..! కొనడానికి ఇదే సరైన సమయం..!!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఫ్లాగ్‌షిప్ 1000సిసి సూపర్ స్పోర్ట్ మోటార్‌సైకిల్ "హోండా సిబిఆర్1000ఆర్ఆర్-ఆర్ ఫైర్‌బ్లేడ్" (Honda CBR1000RR-R Fireblade) పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ను అందిస్తోంది. కంపెనీ ఈ స్పోర్ట్స్ బైక్ ధరను ఏకంగా రూ.10 లక్షలు తగ్గించింది. ఈ స్పోర్ట్స్ బైక్ పై హోండా అందిస్తున్న డిస్కౌంట్ తో 10 యనికార్న్ మోటార్‌సైకిళ్లు కానీ లేదా 11 హోండా షైన్ బైక్‌లు కానీ లేదా 13 యాక్టివా 6జి స్కూటర్లను కానీ కొనుగోలు చేయవచ్చు.

ఈ హోండా మోటార్‌సైకిల్‌పై రూ.10 లక్షల డిస్కౌంట్..! కొనడానికి ఇదే సరసమైన సమయం..!!

హోండా టూ-వీలర్స్ ఇండియా తమ కొత్త హోండా సిబిఆర్1000ఆర్ఆర్-ఆర్ ఫైర్‌బ్లేడ్ లగ్జరీ స్పోర్ట్స్ బైక్ ను 2020 మధ్యలో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఆ సమయంలో ఈ బైక్ ధర దాదాపు రూ.33 లక్షలుగా ఉండేది. కాగా, కంపెనీ ఇప్పుడు దీని ధరను ఏకంగా రూ. 10 లక్షలు తగ్గించేసింది. ఈ భారీ ధర తగ్గింపును పొందిన తర్వాత, మార్కెట్లో Honda CBR1000RR-R Fireblade ధరలు ప్రస్తుతం రూ. 23 లక్షలకు దిగొచ్చాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

ఈ హోండా మోటార్‌సైకిల్‌పై రూ.10 లక్షల డిస్కౌంట్..! కొనడానికి ఇదే సరసమైన సమయం..!!

ఈ బైక్ పై ఇంతటి భారీ ధర తగ్గింపునకు గల కారణాన్ని హోండా ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, కంపెనీ మాత్రం తమ అధికారిక బిగ్‌వింగ్ ఇండియా వెబ్‌సైట్‌లో కొత్త ధరలను అప్‌డేట్ చేసింది. ప్రస్తుతం, భారత మార్కెట్లో హోండా సిబిఆర్1000ఆర్ఆర్-ఆర్ ఫైర్‌బ్లేడ్ రెండు కలర్ వేరియంట్‌లలో అందించబడుతోంది. ఇందులో మొదటిది బ్లాక్ మరియు రెండవది రెడ్. ఇది హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంటుంది.

ఈ హోండా మోటార్‌సైకిల్‌పై రూ.10 లక్షల డిస్కౌంట్..! కొనడానికి ఇదే సరసమైన సమయం..!!

హైదరాబాద్ మార్కెట్లో హోండా సిబిఆర్1000ఆర్ఆర్-ఆర్ ఫైర్‌బ్లేడ్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి:

* స్టాండర్డ్ బ్లాక్ - రూ. 23,71,852

* స్టాండర్డ్ రెడ్ - రూ. 24,23,280

ఈ రెండు ధరలు హైదరాబాద్ ఎక్స్-షోరూమ్ ధరలు. మార్కెట్లో ఇది డుకాటి పానిగేల్ వి4 (రూ.23.50 లక్షలు) మరియు అప్రిలియా ఆర్ఎస్ వి4 (రూ.23. 69 లక్షలు) వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ పోటీని మరింత పెంచేందుకు హోండా ఇప్పుడు తమ స్పోర్ట్స్ బైక్ ధరలను భారీగా తగ్గించి, ఈ విభాగంలో సరసమైన మోడల్‌గా మార్చింది.

ఈ హోండా మోటార్‌సైకిల్‌పై రూ.10 లక్షల డిస్కౌంట్..! కొనడానికి ఇదే సరసమైన సమయం..!!

హోండా తమ సిబిఆర్1000ఆర్ఆర్-ఆర్ ఫైర్‌బ్లేడ్ బైక్ ధరను భారీగా తగ్గించినప్పటికీ, కంపెనీ ఇందులో ఫీచర్లను కట్ చేయలేదు. ఇది గతంలో ఎలా లభించిందో, ప్రస్తుతం కూడా అలానే అదే ఫీచర్లు మరియు ఇంజన్ తో లభిస్తుంది. హోండా ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ బైక్ ను పూర్తిగా విదేశాలలో తయారు చేసి, సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. దిగుమతి చేసుకున్న వాహనాలపై భారతదేశంలో ఉన్న అధిక సుంకాల కారణంగా, దీని ధర కూడా రెట్టింపుగా ఉంటుంది.

ఈ హోండా మోటార్‌సైకిల్‌పై రూ.10 లక్షల డిస్కౌంట్..! కొనడానికి ఇదే సరసమైన సమయం..!!

అధునాతన హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ ఈ జపనీస్ బ్రాండ్ నుండి లభిస్తున్న అత్యంత శక్తివంతమైన మోటార్‌సైకిల్. ఈ బైక్ లో పవర్‌ఫుల్ 1000 సిసి, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, డిఓహెచ్‌సి, ఇన్‌లైన్-4 సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 14,500 ఆర్‌పిఎమ్ వద్ద 214.5 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 12,500 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది.

ఈ హోండా మోటార్‌సైకిల్‌పై రూ.10 లక్షల డిస్కౌంట్..! కొనడానికి ఇదే సరసమైన సమయం..!!

హోండా సిబిఆర్1000ఆర్ఆర్-ఆర్ ఫైర్‌బ్లేడ్ స్పోర్ట్స్ బైక్ ఒక స్ట్రీట్ లీగల్ రోడ్ బైక్. అంటే, దానిని రోడ్లపై ఇతర సాధారణ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే ఉపయోగించుకోవచ్చు. కంపెనీ ఈ బైక్ లో అనేక లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లను మరియు రైడర్ అసిస్ట్ ఫీచర్లను అందిస్తోంది. ఇందులో హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) కూడా ఉంటుంది. ఇంకా ఇందులో గైరోస్కోపిక్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రైడ్-బై-వైర్ టెక్నాలజీ, 9-స్థాయిల్లో నియంత్రణ గల ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, సెలక్టబుల్ ఇంజన్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ స్టీరింగ్ డ్యాంపర్ మరియు పవర్ సెలక్టర్ వంటి అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉన్నాయి.

ఈ హోండా మోటార్‌సైకిల్‌పై రూ.10 లక్షల డిస్కౌంట్..! కొనడానికి ఇదే సరసమైన సమయం..!!

ఇందులోని మెకానికల్స్ ను గమనిస్తే, ముందు వైపున 43ఎమ్ఎమ్ ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ సెమీ-యాక్టివ్ ఓహ్లిన్స్ ఎలక్ట్రానిక్ కంట్రోల్(S-EC) సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్ ముందువైపు డ్యూయల్ 330 మిమీ డిస్క్‌లు మరియు వెనుక వైపు సింగిల్ 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో క్విక్ షిఫ్టర్ మరియు డౌన్ షిఫ్ట్ అసిస్ట్, కలర్ టిఎఫ్‌టి డిస్‌ప్లే వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ హోండా మోటార్‌సైకిల్‌పై రూ.10 లక్షల డిస్కౌంట్..! కొనడానికి ఇదే సరసమైన సమయం..!!

హోండా సిబి500ఎక్స్ (Honda CB500X) బైక్ ధరలో రూ. 1.08 లక్షల తగ్గింపు

ఇదిలా ఉంటే, హోండా గడచిన ఫిబ్రవరి నెలలో తమ సిబి500ఎక్స్ (Honda CB500X) అడ్వెంచర్-టూరర్‌ బైక్ ధరను కూడా భారీగా తగ్గించింది. కంపెనీ బైక్ ని తొలిసారిగా 2021 లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ సమయంలో ఈ బైక్ ప్రారంభ ధర రూ. 6.87 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉండేది. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ బైక్ పై ఏకంగా రూ. 1.08 లక్షల ధర తగ్గింపును ప్రకటించింది. ధర తగ్గుదల తరువాత ఈ బైక్ ప్రారంభ ధర రూ. 5.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Honda cbr1000rr r fireblade gets huge price cut it is the right time to own this monster
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X