అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఇప్పుడు Honda Grazia 125 సొంతం

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీదారు 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' దేశీయ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఈ కంపెనీ మంచి అమ్మకాలతో దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల కంపెనీ యొక్క కొత్త 'హోండా గ్రాజియా 125' (Honda Grazia 125) భారతదేశపు తూర్పు ప్రాంతంలో అమ్మకాల్లో ఒక అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఇప్పుడు Honda Grazia 125 సొంతం

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, హోండా గ్రాజియా 125 (Honda Grazia 125) బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, సిక్కిం, ఒడిశా, అస్సాం మరియు నాగాలాండ్‌ వంటి తూర్పు రాష్ట్రాల్లో 2 లక్షల యూనిట్ల విక్రయాలను సొంతం చేసుకుంది. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం. దీనికి కారణమైన కస్టమర్లకు కంపెనీ ధన్యవాదాలు తెలిపింది.

అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఇప్పుడు Honda Grazia 125 సొంతం

తూర్పు భారతదేశంలో ఇన్ని విక్రయాలను పొందటానికి కంపెనీ 1020 టచ్‌పాయింట్‌లను కలిగి ఉంది. వీటి ద్వారానే కంపెనీ ఇన్ని అమాంకాలను పొందగలిగింది. హోండా గ్రాజియా 125 కొనాలనుకునే వారు కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఇప్పుడు Honda Grazia 125 సొంతం

కొత్త హోండా గ్రాజియా 125 ఇప్పుడు స్పోర్ట్స్ ఎడిషన్ లో కూడా అందుబటులో ఉంది. ఇది కొత్త బాడీ గ్రాఫిక్స్ తో రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గ్రాజియా 125 స్పోర్ట్ పెర్ల్ నైట్‌స్టార్ బ్లాక్ మరియు స్పోర్ట్స్ రెడ్ అనే కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఇప్పుడు Honda Grazia 125 సొంతం

గ్రాజియా 125 స్పోర్ట్ ఎడిషన్ కొత్త కాస్మెటిక్ అప్‌డేట్ కాకుండా, మిగిలినవన్నీ దాదాపుగా దాని స్టాండర్డ్ మోడల్‌తో సమానంగా ఉంటుంది. ఈ స్కూటర్ అదే 125 సిసి హెచ్‌ఇటి (హోండా ఎకో టెక్నాలజీ) బిఎస్‌విఐ పిజిఎం-ఎఫ్‌ఐ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీనికి పేటెంట్ కలిగిన ఎసిజి స్టార్టర్ మోటర్ ఉంది.

అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఇప్పుడు Honda Grazia 125 సొంతం

ఈ హోండా గ్రాజియా 125 స్పోర్ట్ ఎడిషన్‌లో పాస్-స్విచ్, కొత్త ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, సీట్ కోసం మల్టీ-ఫంక్షనల్ స్విచ్ మరియు ఫ్యూయెల్ లిడ్ వంటివి కూడా కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ మంచి ఇంధన సామర్త్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఇప్పుడు Honda Grazia 125 సొంతం

హోండా గ్రాజియా 125 స్పోర్ట్ ఎడిషన్‌లో 124 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి శక్తిని మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ వి- టైప్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఇప్పుడు Honda Grazia 125 సొంతం

కొత్త హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్‌లోని సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుకవైపు త్రీ వే అడ్జస్టబుల్ స్ప్రింగ్-లోడెడ్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇందులో మంచి బ్రేకింగ్ సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో 190 మిమీ డ్రమ్ బ్రేక్ మరియు వెనుక వైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంది.

అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఇప్పుడు Honda Grazia 125 సొంతం

ఇదిలా ఉండగా కంపెనీ దేశీయ మార్కెట్లో తన హోండా గ్రాజియా 125 యొక్క రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ స్పెషల్ ఎడిషన్‌ను రూ. 86,714 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో విడుదల చేసింది. ఈ కొత్త హోండా గ్రాజియా 125 రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్ రెప్సోల్ ఆధునిక డిజైన్ పొందుతుంది.

అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఇప్పుడు Honda Grazia 125 సొంతం

కొత్త హోండా గ్రాజియా 125 రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్ రేసింగ్ టీమ్-ఇన్స్పైర్డ్ గ్రాఫిక్స్ మరియు డిజైన్ థీమ్‌ను కలిగి ఉంది. ఈ ఎడిషన్ ఆకర్షణీయమైన ఆరెంజ్ కలర్ యాక్సెంట్‌లు, హోండా MotoGP సిగ్నేచర్ కలర్‌తో వస్తుంది. ఇది దేశంలోని రేసింగ్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఇప్పుడు Honda Grazia 125 సొంతం

హోండా గ్రాజియా 125 రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఈ కొత్త స్కూటర్ 123.97 సిసి, ఫ్యాన్-కూల్డ్, 4-స్ట్రోక్, PGM-FI ఇంజన్‌ని కలిగి ఉంటుంది. 8.14 బిహెచ్‌పి పవర్ మరియు 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా, ఈ స్కూటర్‌లో ఐడిల్ స్టాప్ సిస్టమ్ ఉపయోగించబడింది. ఇది స్కూటర్ ఎక్కడైనా కొద్దిసేపు ఆగినప్పుడు, అది ఇంజిన్‌ను ఆపివేస్తుంది. ఈ స్కూటర్‌లో సైలెంట్ ఇంజిన్ స్టార్ట్ కోసం కంపెనీ ACG స్టార్టర్‌ను కూడా ఉపయోగించింది.

Most Read Articles

English summary
Honda grazia 125 sales crossed in 2 lakh in east region of india details
Story first published: Friday, January 28, 2022, 10:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X