యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న హోండా, 2023లో లాంచ్!

దేశం మొత్తం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్న నేపథ్యంలో, జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా (Honda Motorcycle and Scooter India) లిమిటెడ్ కూడా ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ బ్రాండ్ వచ్చే 2023 నాటికి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది తమ పాపులర్ యాక్టివా సిరీస్ లోనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న హోండా, 2023లో లాంచ్!

హోండా ప్రకారం, రాబోయే ఆర్థిక సంవత్సరం నాటికి రాబోయే తమ ఎలక్ట్రిక్ స్కూటర్ సిద్ధంగా ఉంటుంది. భారతదేశంలో ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) విభాగంలోకి ప్రవేశించే విషయంలో హోండా యొక్క ప్రణాళికలకు సంబంధించిన వార్తలను హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్ అతుషి ఒగాటా వెల్లడించారు. హోండా యాక్టివా ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న నెంబర్ వన్ స్కూటర్ కావడం మరియు హోండాకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్న బ్రాండ్ కావడంతో కంపెనీ తమ భవిష్యత్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కూడా ఇదే పేరును ఉపయోగించడం లాజికల్‌గా ఉంటుంది.

యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న హోండా, 2023లో లాంచ్!

భారతదేశంలో హోండా యొక్క 'Activa' నేమ్‌ప్లేట్ ఇప్పటికే చాలా విశ్వసనీయతను కలిగి ఉంది. ప్రస్తుతం, దేశంలో స్కూటర్ అనగానే ప్రధానంగా గుర్తుకువచ్చే బ్రాండ్ కూడా ఇదే. కాబట్టి, హోండా ఏ డిజైన్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టినా సరే దానికి మాత్రం యాక్టివా అనే బ్రాండ్ పేరును తగిలిస్తే, అది హాట్ కేకులా అమ్ముడుపోవడం ఖాయం. యాక్టివా పేరుకు అంత పవర్ ఉంది, కాబట్టి ఇది కొత్త వినియోగదారులకు బ్రాండ్‌ను కనెక్ట్ చేయడాన్ని మరింత సులభతరం చేస్తుంది.

యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న హోండా, 2023లో లాంచ్!

హోండా ప్రస్తుతానికి తమ ఈవీ ప్లాన్స్ గురించి సూచన ప్రాయంగా మాత్రమే వివరాలు తెలియజేసింది. ఎలాంటి మోడల్‌ను తీసుకురాబోతున్నారు, ఎక్కడ ఉత్పత్తి చేయబోతున్నారు, దాని టెక్నికల్ స్పెసిఫికేషన్లను ఏంటనే వివరాలను కంపెనీ గోప్యంగా ఉంచింది. హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇక్కడే స్థానికంగా అభివృద్ధి చేస్తుందా లేదా అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ ఇప్పటికే విక్రయిస్తున్న మోడళ్లలో దేనినై కాస్తంత మోడిఫై చేసి, ఇక్కడికి దిగుమతి చేసుకుంటుందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న హోండా, 2023లో లాంచ్!

అంతర్జాతీయ మార్కెట్లలో హోండా ప్రస్తుతం బెన్లీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. సమాచారం ప్రకారం, హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా భారతదేశంలో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విస్తృతంగా పరీక్షిస్తోంది మరియు ఈ స్కూటర్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI)లో కూడా గుర్తించబడినట్లు తెలుస్తోంది. జపాన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ హోండా బెన్లీ. అక్కడి మార్కెట్లో హోండా తమ బెన్లీ సిరీస్ లో 4 రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తోంది. ఈ వేరియంట్‌లలో బెన్లీ ఈ1 (Benly e: I), బెన్లీ ఈ1 ప్రో (Benly e: I Pro), బెన్లీ ఈ2 (Benly e: II) మరియు బెన్లీ ఈ2 ప్రో (Benly e: II Pro)లు ఉన్నాయి.

యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న హోండా, 2023లో లాంచ్!

బెన్లీ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రాథమికంగా B2B (బిజినెస్ టూ బిజినెస్) మరియు B2C (బిజినెస్ టూ కస్టమర్) విభాగాలలో లాస్ట్-మైల్ డెలివరీల కోసం ఉద్దేశించబడినప్పటికీ, ఇందులో ఉపయోగించిన పవర్‌ట్రెయిన్ మరియు హార్డ్‌వేర్ సెటప్ వలన దీనిని ప్రయాణీకుల రోజువారీ ప్రయాణ అవసరాలకు అనుకూలమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చడానికి ఉపయోగించవచ్చు. భారతదేశంలో బెన్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే టెస్టింగ్‌లో ఉన్నందున, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోయే హోండా 'యాక్టివా' ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పునాది వేస్తుందని భావించడంలో తప్పులేదు.

యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న హోండా, 2023లో లాంచ్!

హోండా తన అంతర్జాతీయ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా విక్రయిస్తోంది. వీటిలో హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్, హోండా గైరో ఇ, హోండా గైరో కానోపీ ఇ వంటి మరెన్నో పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఉన్నాయి. హోండా ఇప్పటికే ఈవీ సెక్టార్‌లో పెద్ద ప్లాన్‌లను కలిగి ఉంది మరియు కంపెనీ ఇటీవలే బ్యాటరీ ప్యాక్‌లను తయారు చేయడానికి కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. దాదాపు 133 కోట్ల మూలధనంతో ఈ కొత్త అనుబంధ సంస్థ ఏర్పడింది. హోండా 'యాక్టివా' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడంతో, ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయించాలని హోండా ఎదురుచూస్తోంది.

యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న హోండా, 2023లో లాంచ్!

భారత్‌లో హోండా స్కూపీ (Honda Scoopy) పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు

ఇదిలా ఉంటే, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI), భారత మార్కెట్లో మరో సరికొత్త స్కూటర్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ జపనీస్ టూవీలర్ బ్రాండ్ నుండి రాబోయే కొత్త స్కూటర్ పేరు హోండా స్కూపీ (Honda Scoopy) అని సమాచారం. ఈ మేరకు హోండా తమ స్కూపీ స్కూటర్ పేరు మరియు డిజైన్ కోసం భారతదేశంలో పేటెంట్ ను కూడా దాఖలు చేసిందని, అంతేకాకుండా హోండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను గతేడాది మార్చిలోనే పూర్తి చేసిందని సమాచారం. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Honda might launch electric version activa scooter by 2023 report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X