కొత్త టీజర్ విడుదల చేసిన 'హోండా మోటార్‌సైకిల్'.. ఇంతకీ ఏ స్కూటర్ అయి ఉంటుందబ్బా..!!

'హోండా మోటార్‌సైకిల్' (Honda Motorcycle) దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థలలో ఒకటి. ఈ కంపెనీ యొక్క ద్విచక్ర వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా కంపెనీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి తగిన సన్నాహాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో మరో కొత్త స్కూటర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఒక టీజర్ కూడా ఇప్పుడు విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం రండి.

కొత్త టీజర్ విడుదల చేసిన 'హోండా మోటార్‌సైకిల్'.. ఇంతకీ ఏ స్కూటర్ అయి ఉంటుందబ్బా..!!

కంపెనీ విడుదల చేసిన ఈ టీజర్ ప్రకారం, ఇది రాబోయే స్కూటర్ కొత్త తరం 'హోండా యాక్టివా' అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా అందుబాటులో లేదు. కానీ కంపెనీ త్వరలోనే దీనికి సంబందించిన సమాచారం విడుదల చేస్తుంది.

కొత్త టీజర్ విడుదల చేసిన 'హోండా మోటార్‌సైకిల్'.. ఇంతకీ ఏ స్కూటర్ అయి ఉంటుందబ్బా..!!

హోండా యాక్టివా స్కూటర్ ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న టాప్ స్కూటర్ బ్రాండ్. కావున ఈ స్కూటర్ ఇప్పుడు అప్డేట్ ఫీచర్స్ మరియు పరికరాలతో విడుదలైతే, దానికున్న డిమాండ్ అమాంతం భారీగా పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.

కొత్త టీజర్ విడుదల చేసిన 'హోండా మోటార్‌సైకిల్'.. ఇంతకీ ఏ స్కూటర్ అయి ఉంటుందబ్బా..!!

కంపెనీ తన హోండా యాక్టివా యొక్క 6G వెర్షన్ ని 2020 జనవరి 15 న పరిచయం భారతీయ మార్కెట్ కి చేసింది. ఆ సమయంలోనే ఈ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ తరువాత దాదాపు 2 సంవత్సరాలకు ఈ వేరియంట్ ని మళ్ళీ అప్డేట్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

కొత్త టీజర్ విడుదల చేసిన 'హోండా మోటార్‌సైకిల్'.. ఇంతకీ ఏ స్కూటర్ అయి ఉంటుందబ్బా..!!

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో హోండా యాక్టివా రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి హోండా యాక్టివా 125 స్కూటర్ మరియు హోండా యాక్టివా 6జి. ఈ రెండూ కూడా మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి.

కొత్త టీజర్ విడుదల చేసిన 'హోండా మోటార్‌సైకిల్'.. ఇంతకీ ఏ స్కూటర్ అయి ఉంటుందబ్బా..!!

హోండా మోటార్ సైకిల్ కొత్త యాక్టివా స్కూటర్ ని మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ తో తప్పకుండా విడుదల చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు తమ వాహనాలను అప్డేటెడ్ ఫీచర్స్ తో విడుదల చేస్తుంటే, హోండా కూడా తమ కస్టమర్ల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. కావున హోండా యాక్టివా ప్రియులు రానున్న రోజుల్లో అప్డేటెడ్ యాక్టివాను ఉపయోగించనున్నారు.

కొత్త టీజర్ విడుదల చేసిన 'హోండా మోటార్‌సైకిల్'.. ఇంతకీ ఏ స్కూటర్ అయి ఉంటుందబ్బా..!!

హోండా యాక్టివా 6G ఇప్పుడు 109 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. అదే సమయంలో హోండా యాక్టివా 125 లో 124 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 8.18 బిహెచ్‌పి పవర్ మరియు 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

కొత్త టీజర్ విడుదల చేసిన 'హోండా మోటార్‌సైకిల్'.. ఇంతకీ ఏ స్కూటర్ అయి ఉంటుందబ్బా..!!

కంపెనీ తన యాక్టివాలో మొదటిసారిగా, సాధారణ స్టార్టర్‌కు బదులుగా సైలెంట్ ACG స్టార్టర్ ఉపయోగించబడింది. హోండా యాక్టివా 6G భారతీయ మార్కెట్లో ఆరు కలర్స్ లో అందుబాటులో ఉంది. అయితే యాక్టివా 125 మాత్రం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అయితే త్వరలో రానున్న అప్డేటెడ్ స్కూటర్ ఎన్ని కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి రానుంది అనే విషయం ఇంకా ధ్రువీకరించలేదు.

కొత్త టీజర్ విడుదల చేసిన 'హోండా మోటార్‌సైకిల్'.. ఇంతకీ ఏ స్కూటర్ అయి ఉంటుందబ్బా..!!

ఇదిలా ఉండగా హోండా మోటార్ సైకిల్ కంపెనీ తన యాక్టివా స్కూటర్ ని ఎలక్ట్రిక్ వెర్షన్ లో విడుదల చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కంపెనీ 2023 నాటికి తన యాక్టివాను ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలను కంపెనీ ప్రెసిడెంట్ మిస్టర్ అట్సుషి ఒగాటా వెల్లడించారు.

కొత్త టీజర్ విడుదల చేసిన 'హోండా మోటార్‌సైకిల్'.. ఇంతకీ ఏ స్కూటర్ అయి ఉంటుందబ్బా..!!

భారతీయ మార్కెట్లో ఇప్పటికే టీవీఎస్, హీరో ఎలక్ట్రిక్ వంటి టూ వీలర్ తయారీదారులందరూ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తుంటే, హోండా కూడా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో నిలదొక్కుకోవడానికి మరియు తమ కస్టమర్ల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

కొత్త టీజర్ విడుదల చేసిన 'హోండా మోటార్‌సైకిల్'.. ఇంతకీ ఏ స్కూటర్ అయి ఉంటుందబ్బా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

రోజురోజుకి మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు వర్షానికి వస్తున్న పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉంది. కావున ప్రతి కంపెనీ తమ విభాగంలో తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తమ వాహనాలను కంపెనీలు అప్డేట్ చేస్తోనే ఉన్నాయి. ఇందులో భాగంగానే హోండా మోటార్ సైకిల్స్ కూడా తన యాక్టివా స్కూటర్ ని కూడా అప్డేట్ చేస్తోంది. ఇది తప్పకుండా యాక్టివా వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 10, 2022, 8:00 [IST]
English summary
Honda motorcycle teases new activa update details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+