రూ. 78,878 లకే 'హోండా షైన్ సెలబ్రేషన్ ఎడిషన్': అప్డేటెడ్ లుక్.. మరింత స్టైల్
'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' యొక్క 'షైన్' బైక్ భారతీయ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించినప్పటి నుండి, పట్టణ మరియు గ్రామీణ మార్కెట్‌లలో అత్యంత ప్రజాదరణ పొందుతూ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే కంపెనీ ఇప్పుడు ఇందులో ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ తీసుకువచ్చింది.
Recommended Video
కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త బైక్ పేరు 'హోండా షైన్ సెలబ్రేషన్ ఎడిషన్' (Honda Shine Celebration Edition). ఈ అప్డేట్ బైక్ యొక్క ధర ఇప్పుడు రూ. 78,878 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ యొక్క డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ వంటివాటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

కొత్త హోండా షైన్ స్పెషల్ ఎడిషన్ మొత్తమ్ రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్ మరియు మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్ కలర్స్. ఈ రెండు కలర్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

'హోండా షైన్ సెలబ్రేషన్ ఎడిషన్' బైక్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అనేక కాస్మెటిక్ అప్‌డేట్‌లను పొందుతుంది. అయితే ఇంజిన్ పరంగా ఎటువంటి మార్పులు లేదు. కావున అదే ఇంజిన్ మరియు అదే పర్ఫామెన్స్ అందిస్తుంది.

ఈ కొత్త బైక్ ఇప్పుడు గోల్డ్ యాక్సెంట్‌లు మరియు గ్రాఫిక్స్‌తో పాటు మ్యాట్ గ్రే-ఫినిష్డ్ ఎగ్జాస్ట్ ట్రిమ్‌ను పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని సింగిల్ పీస్ సీటు బ్రౌన్ కలర్ లో ఉంది, అంతే కాకూండా ఇది ప్రీమియం అనుభూతిని అందించడంతోపాటు రైడర్ కి మంచి కంపర్ట్ అందిస్తుంది.

మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ మఫ్లర్ కవర్, సైడ్ కవర్‌పై గోల్డెన్ టచ్ మరియు ముందు భాగంలో సరికొత్త గోల్డెన్ గార్నిష్‌తో చాలా అద్భుతంగా ఉంటూ చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ మీదా బ్రాండ్ లోగో కూడా చూడవచ్చు. మొత్తమ్ మీద డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

'హోండా షైన్ సెలబ్రేషన్ ఎడిషన్' యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇంజిన్ లో ఎటువంటి మార్పులు జరగలేదు, కావున ఇందులో దాని మునుపటి మోడల్ లోని అదే 123.94 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.5 బిహెచ్‌పి పవర్ మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

ఇక ఈ బైక్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఇది నగర పరిస్థితులలో 50 కిమీ నుంచి 55 కిమీ/లీ మరియు హైవేలలో 60 కిమీ నుంచి 65 కిమీ/లీ వరకు అందిస్తుంది. కావున ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఎక్కువంది కొనుగోలుదారులు ఆసక్తి చూపుతుంటారు.

ఇదిలా ఉండగా ఇటీవల కంపెనీ తన యాక్టివా ప్రీమియం ఎడిషన్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త ఎడిషన్ ధర రూ. 75,400 (ఎక్స్-షోరూమ్). కంపెనీ విడుదల చేసిన కొత్త 'యాక్టివా ప్రీమియం ఎడిషన్' ఇప్పుడు మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇది టాప్-స్పెక్ హోండా యాక్టివా డిఎల్‌ఎక్స్ వేరియంట్ కంటే సరిగ్గా రూ. 1,000 ఖరీదైనది. బేస్-స్పెక్ హోండా యాక్టివా 6G స్టాండర్డ్ వేరియంట్ ధరలు రూ. 72,400 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.

హోండా ప్రీమియం ఎడిషన్ ఇప్పుడు 3 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి మాట్ మార్షల్, మాట్ సాంగ్రియా మరియు మాట్ పెర్ల్ కలర్స్.
ఇక ఇందులోని ఇంజిన్ విషయానికి వస్తే, ఈ ప్రీమియం ఎడిషన్‌లో కూడా కొత్త BS6 109.51సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.68 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.84 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'హోండా షైన్ సెలబ్రేషన్ ఎడిషన్' ఇప్పుడు దాని ప్రీవియస్ మోడల్ కంటే కూడా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్స్ పొందింది. అయితే ఇది దాని ప్రీవియస్ మోడల్ కంటే కూడా రూ. 1,500 ఎక్కువ ఖరీదైనది. స్టాండర్డ్ హోండా షైన్ డ్రమ్ వేరియంట్ ధర మార్కెట్లో రూ.77,378. కావున ఈ బైక్ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.


Click it and Unblock the Notifications








