Honda SP125 మోటార్‌సైకిల్ పై రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే..!

హోలీ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ 125 సిసి బైక్ హోండా ఎస్‌పి125 (Honda SP125) పై కంపెనీ గరిష్టంగా రూ. 5,000 వరకూ క్యాష్‌బ్యాక్ ను అందిస్తోంది. గతంలో హోండా ఇదే బైక్ ను సిబి షైన్ పేరుతో విక్రయించేంది. ప్రస్తుతం, హోండా ఎస్‌పి 125 దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న 125 సిసి బైక్ గా అగ్రస్థానంలో ఉంది. గతేడాది తమ టూవీలర్లపై పండుగ ఆఫర్లను అందించిన హోండా, ఇప్పుడు ఈ ఏడాది హోలీ సందర్భంగా ఈ బైక్‌పై తగ్గింపును ఇస్తోంది.

Honda SP125 మోటార్‌సైకిల్ పై రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే..!

రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్ పొందండి!

హోండా టూవీలర్స్ తమ ఎస్‌పి 125 బైక్ కొనుగోలుపై 5 శాతం తగ్గింపును అందిస్తోంది మరియు ఇది గరిష్టంగా రూ. 5,000 వరకూ ఉంటుంది. ఈ బైక్ ను కొనుగోలు చేసే కస్టమర్లు ఎంపిక చేసిన డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా ఈఎమ్ఐ (EMI) ఆఫర్ లో హోండా ఎస్‌రి 125 బైక్ ను కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ అందించబడుతుందని గమనించాలి. కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందేందుకు కనీసం రూ. 30,000 లావాదేవీని తమ కార్డుల ద్వారా చేయాల్సి ఉంటుంది.

Honda SP125 మోటార్‌సైకిల్ పై రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే..!

పైన పేర్కొన్న ఆఫర్‌తో పాటుగా, హోండా జాయ్ క్లబ్ లాయల్టీ మెంబర్‌షిప్ కొనుగోలుతో కంపెనీ తమ కస్టమర్‌లకు రూ.5 లక్షల వ్యక్తిగత బీమా రక్షణను పొందే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ కింద, హోండా ఎస్‌పి 125ని కనీసం రూ. 5,999 డౌన్ పేమెంట్‌ తో కొనుగోలు చేయవచ్చు. హోండా SP 125 డ్రమ్ మరియు డిస్క్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 74,943 మరియు రూ. 79,343 (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

Honda SP125 మోటార్‌సైకిల్ పై రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే..!

ఈ జపనీస్ టూవీలర్ బ్రాండ్ గతంలో విక్రయించిన హోండా షైన్ ఎస్‌పి 125 (Honda Shine SP125) కి అప్‌డేట్‌ గా కంపెనీ ఈ కొత్త హోండా ఎస్‌పి 125 (Honda SP 125) బైక్ ని మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ యొక్క నాణ్యత మరియు విశ్వసనీయత కారణంగా ఇది భారతీయ కస్టమర్లలో మంచి పేరును దక్కించుకుంది. ఇక ఇందులో లభించే ఫీచర్లను పరిశీలిస్తే, ఎల్ఈడి హెడ్‌లైట్‌, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఏసిజి సైలెంట్ స్టార్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Honda SP125 మోటార్‌సైకిల్ పై రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే..!

హోండా ఎస్‌పి 125 కోసం కంపెనీ 19 కొత్త పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేసింది. ఇది పాత షైన్ తో పోల్చుకుంటే, సరికొత్త డిజైన్ ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో షార్ప్ బాడీవర్క్, కొత్త బాడీ గ్రాఫిక్స్, కొత్త రంగులు, కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ పానెల్, అలాగే అదనపు సౌకర్యం కోసం పొడవైన సీటు వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ జాబితాలో కొత్త ఎస్‌పి 125 బిఎస్6 సైలెంట్ ఎసిజి స్టార్టర్ మోటర్, కొత్త ఫ్యుయెల్-ఇంజెక్ట్ 125 సిసి ఇంజన్, ఇంజన్ స్టార్ట్-స్టాప్ స్విచ్, 8 ఆన్-బోర్డు సెన్సార్లను కూడా కలిగి ఉంటుంది.

Honda SP125 మోటార్‌సైకిల్ పై రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే..!

అధిక ఇంధన సామర్థ్యం (మైలేజ్), కొత్త ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్‌లో ట్విన్ ట్రిప్ మీటర్లు, సగటు ఇంధన సామర్థ్యం, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి ఫీచర్స్ ను కూడా ఇందులో జోడించారు. ఈ కమ్యూటర్ మోటార్‌సైకిల్ లో సమర్థవంతమైన బిఎస్6 కంప్లైంట్ 124 సిసి, 4-స్ట్రోక్ ఎస్‌ఐ ఇంజన్ ను ఉపయోగించారు. ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.7 బిహెచ్‌పి పవర్ ను మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.9 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

Honda SP125 మోటార్‌సైకిల్ పై రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే..!

మెకానికల్స్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్ అప్ ఫ్రంట్ మరియు వెనుక 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటాయి. ఈ బైక్ ఈక్వలైజర్‌తో కూడిన కాంబి-బ్రేక్ సిస్టమ్ (సిబిఎస్) ను కూడా కలిగి ఉంటుంది. ఇంకా ఉందులో స్మార్ట్-లుకింగ్ 18 ఇంచ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి. బిఎస్6 ఇంజన్ కారణంగా బైక్ పనితీరు మరియు మైలేజీ చాలా మెరుగ్గా ఉంటుంది.

Honda SP125 మోటార్‌సైకిల్ పై రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే..!

భారత మార్కెట్లో హోండా షైన్ (Honda Shine) బైక్ ని విడుదల చేసినప్పటినుంచి ఇప్పటి వరకు దాదాపు కోటి యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. భారతీయ మార్కెట్లో హోండా షైన్ 125 సిఐ విభాగంలో దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉంది. రాబోయే కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. హోండా ఎస్‌పి 125 ఈ విభాగంలో హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ (Hero Glamour Xtec), టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125), బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125) వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Honda sp 125 march 2022 offers upto rs 5000 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X