యూ-గో (U-Go) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన హోండా.. ఇది కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసమేనా..?

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్, భారతదేశంలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, భారత మార్కెట్ కోసం హోండా యూ-గో (U-Go) అనే పేరును ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు చేసుకుంది. హోండా తమ యూ-గో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గత సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లలో ఒకటైన చైనాలో విడుదల చేసింది. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేయాలని చూస్తోంది.

యూ-గో (U-Go) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన హోండా.. ఇది కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసమేనా..?

ప్రస్తుతం, భారతదేశంలో అన్ని అగ్రామి టూవీలర్ కంపెనీలు తమ ప్రోడక్ట్ లైనప్ లో కనీసం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ నైనా అందిస్తున్నాయి. ఉదాహరణకు బజాజ్ ఆటో నుండి చేతక్ ఈవీ, టీవీఎస్ నుండి ఐక్యూబ్ ఈవీలు అందుబాటులో ఉండగా, సుజుకి బర్గ్‌మ్యాన్ ఆధారంగా ఓ ఈవీని తయారు చేస్తోంది. అలాగే, హీరో మోటోకార్ప్ కూడా విడా అనే బ్రాండ్‌తో కలిసి భారత్ కోసం ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటుగా ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, ఒకినావా వంటి సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలో రాణిస్తున్నాయి.

యూ-గో (U-Go) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన హోండా.. ఇది కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసమేనా..?

ఈ పరిస్థితుల నేపథ్యంలో, హోండా టూవీలర్స్ కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో తన సత్తా ఏంటో చూపాలనుకుంటోంది. అందుకే, వీలైనంత త్వరగా భారతదేశంలో ఓ ఎలక్ట్రిక్ టూవీలర్ ను ప్రారంభించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ ఓ పేరును కూడా సిద్ధం చేసింది. చైనా మార్కెట్లో 1992లో గ్వాంగ్‌జౌ మోటార్స్ గ్రూప్ కంపెనీ మరియు జపాన్ హోండా మోటార్‌లు స్థాపించిన జాయింట్ వెంచర్ అయిన వుయాంగ్-హోండా మోటార్స్ (గ్వాంగ్‌జౌ) కంపెనీ ద్వారా ఈ స్కూటర్ రెండు రకాల్లో ప్రవేశపెట్టబడింది.

యూ-గో (U-Go) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన హోండా.. ఇది కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసమేనా..?

ఈ రెండు మోడళ్లలో ఒకటి 1.2 kW రేటెడ్ పవర్ అవుట్‌పుట్ ని కలిగి ఉండగా మరొకటి 1.8 kW గరిష్ట శక్తిని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లోని మోటార్ గరిష్టంగా 88 శాతం సామర్థ్యాన్ని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 53 కిమీ మరియు ఇందులోని బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై గరిష్టంగా 65 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. పట్టణ వినియోగదారులను (అర్బన్ యుటిలిటీ) దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయాలని భావిస్తోంది.

యూ-గో (U-Go) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన హోండా.. ఇది కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసమేనా..?

చైనీస్ మార్కెట్లో హోండా యూ-గో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 7,988 చైనీస్ యువాన్ లుగా ఉంది. అంటే, ప్రస్తుత మారకపు విలువ ప్రకారం, మనదేశ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.93,000 లుగా ఉంటుంది. Honda U-Go యొక్క లో-స్పెక్ వేరియంట్ 0.8 kW పవర్ ని అందిస్తుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 43 కిమీగా ఉంటుంది. చైనాలో ప్రారంభించినప్పుడు, దీని ధర 7,499 యువాన్ (సుమారు రూ. 87,400) మరియు ఈ రెండు వేరియంట్‌లు కూడా తొలగించగల 48-వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తాయి.

యూ-గో (U-Go) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన హోండా.. ఇది కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసమేనా..?

అయితే, ఇందులో ఎక్కువ రేంజ్ కోరుకునే కస్టమర్లు అదనంగా రెండవ బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగించి ఈ రేంజ్ ను పూర్తి చార్జ్ పై 130 కి.మీలకు పెంచుకోవచ్చు. కాకపోతే, ఇది అదనపు ఖర్చుతో వస్తుంది మరియు అండర్-సీట్ స్టోరేజ్ సామర్థ్యాన్ని మింగేస్తుంది. చైనీస్ మార్కెట్లో లభిస్తున్న హోండా యూ-గో ఎలక్ట్రిక్ స్కూటర్ లోని కొన్ని ముఖ్య ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద ఫుట్‌బోర్డ్, బ్యాటరీ స్థితిని చూపించే ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, రేంజ్, మోడ్ మరియు స్పీడ్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, యాంటీ-థెఫ్ట్ అలారం, 26-లీటర్ నిల్వ స్థలం, ఎల్ఈడి డైటైమ్ రన్నింగ్ లైట్ మరియు షార్ప్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మొదలైనవి ఉన్నాయి.

యూ-గో (U-Go) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన హోండా.. ఇది కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసమేనా..?

ఇవే కాకుండా, హోండా యూ-గో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు మరియు బాక్సీ టైప్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లతో ఒక ప్రత్యేకమైన ఫ్రంట్ ఎండ్‌ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో సింగిల్ పీస్ బ్లాక్ సీట్ మరియు పొడవాటి హ్యాండిల్‌బార్‌తో సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్ ను కలిగి ఉంటుంది. స్కూటర్ కు ఇరువైపులా U-Go బ్యాడ్జింగ్, నలుపు రంగు అల్లాయ్ వీల్స్‌, ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్ సెటప్ ఉంటుంది.

యూ-గో (U-Go) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన హోండా.. ఇది కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసమేనా..?

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు ఉపయోగించబడ్డాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సీట్ ఎత్తు 740 మిమీ మరియు ఇది బ్లూటూత్ కనెక్టివిటీ అలాగే జిపిఎస్ సపోర్ట్ ని కూడా కలిగి ఉంటుంది. భారతదేశంలో యూ-గో స్కూటర్ తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు హోండా ఈ చైనీస్ స్పెక్ వెర్షన్ లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి ఇక్కడి మార్కెట్లో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Article Published On: Monday, June 6, 2022, 10:33 [IST]
English summary
Honda two wheelers patent u go name for indian market details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+