హైదరాబాద్‌లో దూసుకుపోతున్న హాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. త్వరలో కొత్త మోటార్‌సైకిల్ కూడా వస్తోంది..
రాజస్థాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility) అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు హైదరాబాద్‌లో మంచి డిమాండ్ ఉంటోంది. హాప్ మొబిలిటీ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన తమ డీలర్‌షిప్‌లో కేవలం 150 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 225 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ నుండి దేశీయ విపణిలో హాప్ లియో (HOP LEO) మరియు హాప్ లైఫ్ (HOP LYF) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

డీలర్‌షిప్‌ను ప్రారంభించిన 150 రోజుల్లోనే అధిక సంఖ్యలో స్కూటర్లను విక్రయించడం పట్ల కంపెనీ హర్షం వ్యక్తం చేసింది. ఈ విజయం హాప్ మొబిలిటీ ఉత్పత్తుల యొక్క అత్యుత్తమ నాణ్యత, ఎండ్-టు-ఎండ్ కస్టమర్ సర్వీస్ మరియు బలమైన మార్కెటింగ్ వ్యూహాలను ప్రతిబింబిస్తుందని కంపెనీ తెలిపింది. దేశంలో పెట్రోల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ వాసులు ఇప్పుడు పెట్రోల్ టూవీలర్లను వదిలి ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఈవీల వ్యాపారం జోరందుకుంది.

ఎలక్ట్రిక్ వాహనాల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో, హాప్ మొబిలిటీ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఈ కంపెనీ నుండి స్టైలిష్ డిజైన్‌లతో కూడిన క్లాస్ ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తున్నాయి. కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాలలో సరికొత్త సాంకేతికత, అత్యాధునిక ఫీచర్లను అందిస్తోంది. అంతేకాకుండా, ఇవి నగర రోడ్లపై గొప్ప ప్రయాణ సౌకర్యాన్ని కూడా అందిస్తాయి.

హాప్ హైదరాబాద్ డీలర్‌షిప్ సాధించిన ఈ విజయం గురించి హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈఓ మరియు సహ-వ్యవస్థాపకుడు కేతన్ మెహతా మాట్లాడుతూ, ఈ విజయం హాప్ యొక్క గ్రౌండ్ నెట్‌వర్క్‌కు చెందుతుందని, ఇది బ్రాండ్‌పై కస్టమర్ నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. హైదరాబాద్‌లోని కస్టమర్‌లు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సమగ్రమైన మార్కెట్ పరిశోధన చేస్తాని, తాము దానిని పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. డీలర్‌షిప్ ప్రారంభించిన కేవలం 150 పనిదినాల్లో 225 స్కూటర్‌లను విక్రయించగలిగామని ఆయన చెప్పారు.

హాప్ ఉత్పత్తులకు కస్టమర్‌ల నుండి గుర్తింపు లభిస్తుందనడానికి ఇది తగిన రుజువు అని, తమ కస్టమర్‌ల నమ్మకాన్ని మెరుగుపరచడం మరియు వారి పట్ల విశ్వసనీయంగా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మెహతా చెప్పారు. హాప్ ఎలక్ట్రిక్ గతేడాది జూన్ నెలలో భారత మార్కెట్లో లియో, లైఫ్ ఇ-స్కూటర్లను విడుదల చేసింది. ఇవి రెండూ కూడా ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటారుతో లభిస్తాయి. ఇవి 72 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. వీటిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 125 కి.మీ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది

ధరల విషయానికి వస్తే, హాప్ లియో స్కూటర్ రూ. 72,500 వద్ద లభిస్తుండగా, హాప్ లైఫ్ స్కూటర్ రూ. 65,000 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) ధర వద్ద వద్ద లభిస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో కూడిన ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కూడా ఇంటర్నెట్, జిపిఎస్ మరియు మొబైల్ యాప్ వంటి కనెక్ట్ చేయబడిన ఫీచర్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, వీటిలో ఆటోమేటిక్ లాకింగ్, సెన్సార్, రివర్స్ గేర్, యూఎస్‌బి ఛార్జింగ్, రిమోట్ కీ, యాంటీ-థెఫ్ట్ అలారం మరియు యాంటీ-థెఫ్ట్ వీల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ప్రత్యేకించి యువ కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పట్ల ఆకర్షితలవుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు గంటకు 50-60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. వీటిలో 19.5 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది మరియు ఇవి 180 కిలోల లోడింగ్ సోమర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. వీటిలో HOP LEO విషయానికి వస్తే, ఇది లియో బేసిక్, లియో మరియు లియో ఎక్స్‌టెండెడ్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్ఈడి హెడ్‌లైట్, స్పోర్టీ రియర్ వ్యూ మిర్రర్, పూర్తిగా డిజిటల్ డిస్‌ప్లే, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ మరియు ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ ఉన్నాయి.

హాప్ లియో (HOP LEO)లో డ్యూయల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 125 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. ఇక హాప్ లైఫ్ (HOP LYF) గురించి మాట్లాడుతూ, ఇది కూడా లైఫ్ బేసిక్, లైఫ్ మరియులైఫ్ ఎక్స్‌టెండెడ్ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 125 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.

ఇదిలా ఉంటే, హాప్ మొబిలిటి తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సమాచారం ప్రకారం, దీనిని హాప్ ఆక్సో (HOP OXO) పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 100 కి.మీగా ఉంటుందని నివేదించబడింది. ఈ బైక్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది మరియు ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 150 కి.మీ రేంజ్ ను ఆఫర్ చేయనుంది. హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు సరికొత్త హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా అమ్మకానికి తీసుకువచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








