సెప్టెంబర్ 05న విడుదల కానున్న HOP OXO ఎలక్ట్రిక్ బైక్.. పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో టూ వీలర్లకు పెరుగుతున్న ఆదరణ ఇప్పుడు అంతా.. ఇంతా కాదు. అయితే ఈ సందర్భంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేసి ఈ విభాగంలో తమ ఆధిపత్యాన్ని కూడా చూపించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. భాగంగానే దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హోప్ ఎలక్ట్రిక్' (HOP Electric) ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి తయారైంది.
Recommended Video
ఇంతకీ కంపెనీ విడుదల చేసే ఆ ఎలక్ట్రిక్ బైక్ ఏది, దేశీయ మార్కెట్లో ఎప్పుడు లాంఛ్ అవుతుంది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

నివేదికల ప్రకారం.. హోప్ ఎలక్ట్రిక్ కంపెనీ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'హోప్ ఆక్సో' (HOP OXO) విడుదల చేయడానికి సంసిద్ధమైపోయింది. కంపెనీ ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను గురుగ్రామ్‌లో 2022 సెప్టెంబర్ 05 న అధికారికంగా విడుదల చేయనుంది.

హోప్ మొబిలిటీ ఇప్పటికే తన రాబోయే ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నుండి ధృవీకరణ పొందింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ (పిఎల్‌ఐ స్కీమ్) ద్వారా దేశంలో భారీ పెట్టుబడులను పెట్టడానికి సిద్ధమైంది.

కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త HOP OXO అనేది ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు ఒక హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్. కావున ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 100 కిమీ వరకు ఉంటుంది. దీనికోసం కంపెనీ ఈ బైక్‌లో అధిక సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని వినియోగిస్తుంది. కావున ఈ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ గరిష్టంగా 150 కిమీల పరిధిని అందిస్తుంది.

హోప్ ఆక్సో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఇప్పటికే దాదాపు భారతదేశంలోని 20 నగరాల్లో 30,000 కిమీ కంటే ఎక్కువ డ్రైవ్ చేసి పరీక్షించినట్లు కూడా తెలిపింది. అంతే కాకుండా ఈ టెస్టింగ్ సమయంలో వెలువడిన చిత్రాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కావున ఇది తప్పకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

హోప్ మొబిలిటీ యొక్క ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ఉత్పత్తి కోసం జైపూర్‌లో అత్యాధునిక ప్లాంట్ కూడా ప్రారంభించింది. ఈ ఆధునిక ప్లాంట్‌లో కంపెనీ సంవత్సరానికి 1.8 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం కంపెనీ LEO మరియు LYF రేంజ్ స్కూటర్లను తయారుచేయడంలో నిమగ్నమై ఉంది. అయితే త్వరలోనే LYF2.0 మరియు OXO వాహనాలు ఈ ప్లాంట్‌లో చేయబడతాయి. కంపెనీ ప్రస్తుతం ఈ ప్లాంట్ లో 100 ఎలక్ట్రిక్ వాహనాలను చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

హోప్ ఎలక్ట్రిక్ కంపెనీ దేశవ్యాప్తంగా 50 కి పైగా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. అయితే రానున్న మరో మూడు సంవత్సరాల్లో ఏకంగా 10 కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి తగిన సన్నాహాలు ఏర్పాటు చేసుకుంటోంది. కావున ఎలక్ట్రిక్ వాహన విభాగంలో హోప్ కంపెనీ కూడా తన ఉనికిని మరింత బలంగా నిరూపించుకుంటుంది, అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

HOP OXO ఎలక్ట్రిక్ బైక్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు, ఈ ధర లాంచ్ సమయంలో వెల్లడవుతుంది. కానీ ఈ బైక్ ధర బహుశా రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని ఆసిస్తున్నాము.

ఇదిలా ఉండగా.. కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఫండ్ రైజర్ ప్రోగ్రామ్ కింద 2.6 మిలియన్ డాలర్ల పెట్టుబడి పొందినట్లు సమాచారం. కావున కంపెనీ ఈ సంవత్సరం దాని ఉత్పత్తి, డీలర్ నెట్‌వర్క్ మరియు సరఫరా గొలుసును 10 రెట్లు కంటే ఎక్కువ రేటుతో వృద్ధి చేసే అవకాశం ఉంది.

కంపెనీ విడుదల చేయనున్న కొత్త బైక్ యొక్క సాంకేతిక వివరాలను ఇంకా వెల్లడించలేదు. కానీ ఇది తప్పకుండా ఆధునిక కాలంలో వినియోగించడానికి అనుకూలంగా నిర్మించబడి ఉంటుందని ఆశిస్తున్నాము. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు డ్యూయల్ షాక్ అనే సస్పెన్షన్ సెటప్ మరియు బ్రేకింగ్ సిస్టమ్ లో డిస్క్ బ్రేక్స్ పొందుతాయని కూడా భావిస్తున్నాము.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
హాప్ ఎలక్ట్రిక్ విడుదల చేయనున్న కొత్త OXO బైక్ ఆధునిక డిజైన్ అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అదే సమయంలో ఇది మంచి పరిధిని అందించడానికి లిథియం అయాన్ బ్యాటరీ కూడా పొందుతుంది. కావున ఇది అన్ని విధాలా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ బైక్ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత టార్క్ క్రటోస్, ఒబెన్ రోర్ మరియు రివోల్ట్ RV 400 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








