దేశీయ మార్కెట్లో HOP OXO ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ఇక ప్రత్యర్థులకు గండమే..!!
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ రోజురోజుకి అభివృద్ధివైపు అడుగులు వేస్తూనే ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహన విభాగం మరింత వేగంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీలు మార్కెట్లో ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలను విడుదల చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే హీరో మోటోకార్ప్, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి ఎలక్ట్రిక్ ద్విచక్రవాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లాంచ్ చేసి ఆ విభాగంలో మంచి పురోగతిని పొందుతున్నాయి.
Recommended Video
ఇప్పుడు భారతీయ విఫణిలో జైపూర్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'హోప్' (HOP) ఎలక్ట్రిక్ తన కొత్త 'ఓక్సో' (OXO) ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ధర మరియు ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టిన 'హోప్ ఓక్సో' (HOP OXO) బైక్ ప్రారంభ ధర రూ. 1,24,999 (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి హోప్ ఓక్సో (HOP OXO) మరియు హోప్ ఓక్సో ఎక్స్ (HOP OXO X). హోప్ ఓక్సో ధర రూ. 1,24,999 కాగా, హోప్ ఓక్సో ఎక్స్ ధర రూ. 1,39,999. ఈ బైక్ కొనాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్ లో లేదా సమీపంలో ఉండే కంపెనీ ఎక్స్పీరియన్స్ సెంటర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. డెలివరీలు వచ్చే నెల (ఆక్టోబర్) నుంచి ప్రారంభమవుతాయి.

కొత్త HOP OXO ఎలక్ట్రిక్ బైక్ చాలా స్టైలిష్ డిజైన్ కలిగి ఉంది. అదే సమయంలో రైడర్స్ మెచ్చే అన్ని ఆధునిక ఫీచర్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ మరియు సింగిల్ పీస్ సీట్ మొదలైన వాటిని పొందుతుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, 4G కనెక్టివిటీ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి OXO యాప్ ద్వారా స్పీడ్ కంట్రోల్, జియో-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్స్ యాక్సెన్స్ చేయవచ్చు. ఇవన్నీ బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Hop OXO ఎలక్ట్రిక్ బైక్ రెండు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి రెడ్ అండ్ బ్లూ కలర్. కాగా Hop OXO X కూడా రెండు కలర్స్ ఆప్సన్స్ పొందుతుంది. అవి గ్రీన్ మరియు గ్రే కలర్స్. హోప్ ఓక్సో ఎలక్ట్రిక్ బైక్ పరిమాణం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఈ బైక్ 2,100 మిమీ పొడవు, 793 మిమీ వెడల్పు మరియు 1,085 మిమీ ఎత్తు మరియు 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది.

Hop Electric యొక్క సరికొత్త OXO ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 3.75kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంటుంది. ది 811 NMC సెల్‌లను ఉపయోగిస్తుంది. ఇది 6.9 బిహెచ్‌పి పవర్ మరియు 185 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
ఇక Hop OXO X విషయానికి వస్తే, ఇది 8.31బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. కావున ఇది కంపెనీ యొక్క హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్. మొత్తం మీద బ్యాటరీ మరియు మోటార్ రెండూ డస్ట్ అండ్ వాటర్ ఫ్రూఫ్ కోసం IP67 రేట్ పొందుతాయి.

ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ యూనిట్లు మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లను పొందుతాయి. కావున మంచి గ్రిప్ పొందుతాయి.

భారతీయ మార్కెట్లో కొత్త హోప్ కంపెనీ యొక్క ఓక్సో బైక్ లాంచ్ సందర్భంగా కంపెనీ ఫౌండర్ మరియు సీఈఓ 'కేతన్ మెహతా' మాట్లాడుతూ.. భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన విభాగం చాలా వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఈ సమయంలో కస్టమర్ల కోసం ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కావున కంపెనీలోని నిపుణుల ద్వారా తయారుచేయబడి, చాలా సంవత్సరాలు ఈ బైక్ ని టెస్ట్ చేస్తూనే ఉన్నాము. మొత్తానికి ఆధునిక కాలంలో రైడర్స్ ఉపయోగించడానికి ఒక అద్భుతమై బైక్ కంపెనీ ఇప్పుడు విడుదల చేసింది. ఇది చాలా ఆనందదాయకమైన విషయం అన్నారు.

కొత్త హోప్ ఓక్సో ఎలక్ట్రిక్ బైక్ మంచి పరిధిని కూడా అందిస్తుంది. ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జ్‌పైన గరిష్టంగా 150 కిమీ రేంజ్ అందిస్తుంది. కావున కొనుగోలుదారులు ఎటువంటి సంకోచం లేకుండా కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ 16A ఛార్జర్ సాయంతో కేవలం నాలుగు గంటల సమయంలో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

హోప్ ఓక్సో ఎలక్ట్రిక్ బైక్ దేశీయ మార్కెట్లో విడుదల కాకముందే దాదాపు 5000 ఫ్రీ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. అయితే రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంతే కాకూండా కంపెనీ కూడా ఈ కొత్త బైక్ ను ప్రతి సంవత్సరం 50,000 యూనిట్లను విక్రయిచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త 'హోప్ ఓక్సో ఎలక్ట్రిక్ బైక్' దేశీయ మార్కెట్లో ఆకర్షణీయమైన ధర వద్ద విడుదలైంది. ఈ బైక్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ బైక్ ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది, ఎలాంటి అమ్మకాలను చేపడుతుంది అనే మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఈ బైక్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








