హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 కలర్లు ఛేంజ్.. కానీ ధరలో మాత్రం నో ఛేంజ్..

బజాజ్ ఆటో యాజమాన్యంలో ఉన్న స్వీడన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హస్క్వార్నా (Husqvarna) భారత మార్కెట్లో విక్రయిస్తున్న స్వార్ట్‌పిలెన్250 (Husqvarna Svartpilen 250) మరియు విట్‌పిలెన్ 250 (Husqvarna Vitpilen 250) మోటార్‌సైకిళ్లలో రెండు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. భారతదేశంలో, ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కొత్త కలర్లను ప్రవేశపెట్టింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కంపెనీ ఈ రెండు మోటార్‌సైకిళ్ల ధరలను మాత్రం పెంచలేదు.

హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 కలర్లు ఛేంజ్.. కానీ ధరలో మాత్రం నో ఛేంజ్..

కొత్త హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 ఇప్పుడు కొత్త బ్లాక్ బ్లూ మూన్‌షైన్ కలర్ ఎంపికను పొందగా, హస్క్వార్నా విట్‌పిలెన్ 250 సిరామిక్ వైట్ కలర్ ఎంపికను పొందుతుంది. కొత్త స్పోర్టింగ్ రిఫ్రెష్ కలర్ ఆప్షన్‌లు పొందినప్పటికీ, Svartpilen 250 మరియు Vitpilen 250 రెండు మోటార్‌సైకిళ్ల ధరలు మాత్రమే మునుపటి మాదిరిగానే 2.19 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. ఈ కొత్త కలర్ ఆప్షన్‌ల కోసం కంపెనీ దేశవ్యాప్తంగా బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది.

హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 కలర్లు ఛేంజ్.. కానీ ధరలో మాత్రం నో ఛేంజ్..

కెటిఎమ్ అనుబంధ కంపెనీ అయిన హస్క్వార్నా భారతదేశంలో బజాజ్ ఆటోతో కలిసి వ్యాపారం చేస్తోంది. కస్టమర్లు ఈ బైక్‌లను దేశవ్యాప్తంగా ఉన్న హస్క్వార్నా డీలర్‌షిప్ లను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. కొత్త కలర్‌లో వచ్చిన విట్‌పిలెన్ 250 మ్యాట్ సిరామిక్ వైట్ కలర్‌తో, గ్లోస్ డార్క్ సిల్వర్ మెటాలిక్ సీట్ కౌల్స్‌ను కలిగి ఉంటుంది, కాగా. స్వార్ట్‌పిలెన్ 250 మ్యాట్ బ్లాక్-బ్లూ కలర్ పెయింట్‌తో బేజ్ కలర్ సీట్ కౌల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు కొత్త మోడళ్లలో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా, మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు.

హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 కలర్లు ఛేంజ్.. కానీ ధరలో మాత్రం నో ఛేంజ్..

హస్క్వార్నా విట్‌పిలెన్ 250 విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్ స్పోర్టియర్ వెర్షన్ గా ఉంటుంది. ఇందులోని క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్‌లు, తేలికైన 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్-లీనింగ్ రైడింగ్ పొజిషన్ వంటి డిజైన్ అంశాలతో ఇది చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఇక హస్క్వార్నా విట్‌పిలెన్ 250 విషయానికి వస్తే, ఇది డ్యూయెల్ పర్సప్ బైక్‌లా ఉంటుంది. ఇందులో డ్యూయల్-పర్పస్ టైర్లు, దృఢమైన 8-స్పోక్ అల్లాయ్ వీల్స్, విశాలమైన ట్యూబ్యులర్ హ్యాండిల్‌బార్లు మరియు మరింత నిటారుగా ఉన్న రైడింగ్ పొజిషన్ వంటి అంశాలతో మంచి రగ్గడ్ లుక్‌ని కలిగి ఉంటుంది.

హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 కలర్లు ఛేంజ్.. కానీ ధరలో మాత్రం నో ఛేంజ్..

డిజైన్ పరంగా ఈ రెండు మోటార్‌సైకిళ్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ, వాటి ఇంజన్ మరియు శక్తి సామర్థ్యాలు మాత్రం ఇంచుమించు ఒకేలా ఉంటాయి. హస్క్వార్నా కెటిఎమ్ అనుబంధ సంస్థ కావడంతో ఈ రెండు మోడళ్లలో కెటిఎమ్ బైక్‌లలో ఉపయోగిస్తున్న అదే 250 సీసీ ఇంజన్లను ఉపయోగించారు. కెటిఎమ్ డ్యూక్ 250 (KTM Duke 250) బైక్ లో ఉపయోగిస్తున్న ఇంజన్‌ను రీట్యూన్ చేసి హస్క్వార్నా 250 సీసీ బైక్‌లలో ఉపయోగించారు.

హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 కలర్లు ఛేంజ్.. కానీ ధరలో మాత్రం నో ఛేంజ్..

హస్క్వార్నా 250 ట్విన్ మోటార్‌సైకిళ్లలోని ఈ 248.76 సీసీ, సింగిల్ సిలిండర్, 4 వాల్వ్, డిఓహెచ్‌సి ఇంజన్ గరిష్టంగా 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 29.63 బిహెచ్‌పి శక్తిని మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 24 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హస్క్వార్నా విట్‌పిలెన్ 250 మరియు స్వార్ట్‌పిలెన్ 250 మోటార్‌సైకిళ్లు రెండూ కూడా స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటాయి.

హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 కలర్లు ఛేంజ్.. కానీ ధరలో మాత్రం నో ఛేంజ్..

హస్క్వార్నా విట్‌పిలెన్ 250 మరియు హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 మోటార్‌సైకిళ్లలోని ఇతర ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇవి రెండూ కూడా ఒకే విధమైన స్ప్లిట్ ట్రెల్లిస్ ఫ్రేమ్ పై తయారు చేయబడి ఉంటాయి. వీటిలో ముందు వైపున 43 మిమీ అప్ సైడ్ డౌన్ డబ్ల్యూపి అపెక్స్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపున డబ్ల్యూపి అపెక్స్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటాయి. అలాగే, ఈ రెండు మోడళ్లలో ఇంధన ట్యాంక్ పరిమాణం కూడా 9.5-లీటర్లకు సమానంగా ఉంటుంది.

హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 కలర్లు ఛేంజ్.. కానీ ధరలో మాత్రం నో ఛేంజ్..

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, హస్క్వార్నా విట్‌పిలెన్ 250 మరియు హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 మోటార్‌సైకిళ్లలో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ముందు వైపు 320 మిమీ డిస్ బ్రేక్ మరియు వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు మోడళ్లలో స్వార్ట్‌పిలెన్ 250 డ్యూయల్-పర్పస్ టైర్‌లతో వచ్చినప్పటికీ, దాని టైర్ పరిమాణం మాత్రం విట్‌పిలెన్ 250 మాదిరిగానే ఉంటుంది. ఇందులో ముందువైపు 110/70 R17 ప్రొఫైల్ టైరు మరియు వెనుకవైపున వెడల్పాటి 150/60 R17 టైరు అమర్చబడి ఉంటాయి.

హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 కలర్లు ఛేంజ్.. కానీ ధరలో మాత్రం నో ఛేంజ్..

హస్క్వార్నా విట్‌పిలెన్ 250 మరియు హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 రెండు మోటార్‌సైకిళ్లు కూడా చాలా విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉండి, మంచి ఫన్-టు-రైడ్ మోటార్‌సైకిళ్లుగా ఉంటాయి. అయితే, ఈ బ్రాండ్ భారతదేశానికి కొత్తది కావడం మరియు సరైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ లేని కారణంగా దేశంలో ఈ బ్రాండ్ అమ్మకాలు మాత్రం ఆశించినంతగా లేవు. ఈ నేపథ్యంలో, తమ కొత్త మోడళ్లను పాత ధరకే కొత్త రంగులతో పరిచయం చేయడం ద్వారా ప్రస్తుత పండుగ సీజన్‌లో అమ్మకాలు పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

Most Read Articles

English summary
Husqvarna india introduces new colour options for svartpilen 250 and vitpilen 250
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X