భారత్‌లో చైనా బైక్‌లను విడుదల చేయనున్న హైదరాబాద్ కంపెనీ.. భారీ డీల్‌కు ఓకే చెప్పిన ఆదీశ్వర్ మరియు జోంటెస్!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మరొక చైనీస్ బ్రాండ్ ప్రవేశించనుంది. చైనాకు చెందిన ద్విచక్ర వాహన తయారీ కంపెనీ జోంటెస్ (Zontes) యొక్క ద్విచక్ర వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు గానూ హైదరాబాద్ కు చెందిన ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Adishwar Auto Ride India Pvt Ltd - AARI) ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఓ ఒప్పందం కూడా కుదిరింది.

భారత్‌లో చైనా బైక్‌లను విడుదల చేయనున్న హైదరాబాద్ కంపెనీ.. భారీ డీల్‌కు ఓకే చెప్పిన ఆదీశ్వర్ మరియు జోంటెస్!

భారతదేశంలో ప్రీమియం బైక్‌లను విక్రయించడం కోసం ఇప్పటికే ఇటలీ, బ్రిటన్‌లకు చెందిన ద్విచక్ర వాహన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న ఆదీశ్వర్, ఇప్పుడు తాజాగా చైనాకు చెందిన ప్రీమియం మోటర్‌సైకిల్‌ బ్రాండ్‌ జోంటెస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా జోంటెస్‌కు చెందిన ప్రీమియం వాహనాలు ఆదీశ్వర్ భారతదేశంలో విక్రయించనుంది.

భారత్‌లో చైనా బైక్‌లను విడుదల చేయనున్న హైదరాబాద్ కంపెనీ.. భారీ డీల్‌కు ఓకే చెప్పిన ఆదీశ్వర్ మరియు జోంటెస్!

ప్రారంభంలో భాగంగా, చైనాకు చెందిన జోంటెస్ కంపెనీ ఐదు మోటర్‌సైకిళ్ళను భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుంది. జోంటెస్ 2003లో చైనాలో ప్రారంభమైన ఓ టూవీలర్ బ్రాండ్. ప్రస్తుతం, ఇది బ్రిటన్‌, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, బెల్జీయం, బ్రెజిల్‌, మలేషియా, థాయ్‌లాండ్‌ మరియు పొరుగు దేశమైన బంగ్లాదేశ్ తో సహా దాదాపు 55 దేశాలలో తమ వాహనాలను విక్రయిస్తోంది. ఇప్పుడు భారతదేశంలో కూడా తమ ద్విచక్ర వాహనాలను విడుదల చేయనుంది.

భారత్‌లో చైనా బైక్‌లను విడుదల చేయనున్న హైదరాబాద్ కంపెనీ.. భారీ డీల్‌కు ఓకే చెప్పిన ఆదీశ్వర్ మరియు జోంటెస్!

జోంటెస్ భారత మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న ఐదు మోటార్‌సైకిళ్లలో దాని రెట్రో మోటార్‌సైకిల్ జికె 350 స్పోర్ట్స్ కేఫే (GK 350 Sports Cafe) కూడా ఒకటి. చైనాలో, జోంటెస్ ప్రస్తుతం 10 మోటార్‌సైకిళ్లు, 2 మ్యాక్సీ స్కూటర్లు మరియు ఒక ఎలక్ట్రిక్ సైకిల్‌ ను విక్రయిస్తోంది. భారతదేశానికి జికె 350 స్పోర్ట్స్ కేఫే మోటార్‌సైకిల్ దాదాపుగా ధృవీకరించబడినప్పటికీ, మిగిలిన నాలుగు మోడళ్లలో 350వి క్రూయిజర్, 350డి మ్యాక్సీ స్కూటర్, 350టి అడ్వెంచర్ బైక్ మరియు 350ఆర్ స్ట్రీట్‌ఫైటర్‌ బైక్ ఉంటాయని సమాచారం.

భారత్‌లో చైనా బైక్‌లను విడుదల చేయనున్న హైదరాబాద్ కంపెనీ.. భారీ డీల్‌కు ఓకే చెప్పిన ఆదీశ్వర్ మరియు జోంటెస్!

ఈ చైనా కంపెనీ తయారు చేసే అన్ని బైక్‌లు కూడా 350 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ (బాష్) ఇంజన్ ‌తో పనిచేస్తాయి. ఈ ఇంజన్ 9500 ఆర్‌పిఎమ్ వద్ద 39 హెచ్‌పి శక్తిని మరియు 7500 ఆర్‌పిఎమ్ వద్ద 33 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పోల్చి చూస్తే, ఈ ఇంజన్ విడుదల చేసే శక్తి దాదాపు కెటిఎమ్ 390 మోడళ్లు మరియు కవాసకి నింజా 300 బైక్ విడుదల చేసే శక్తి సామర్థ్యాలకు సమానం.

భారత్‌లో చైనా బైక్‌లను విడుదల చేయనున్న హైదరాబాద్ కంపెనీ.. భారీ డీల్‌కు ఓకే చెప్పిన ఆదీశ్వర్ మరియు జోంటెస్!

జోంటెస్ ఉత్పత్తులు మోడ్రన్ స్టైల్ తో పాటుగా సుధీర్ఘమైన ఫీచర్ల జాబితాను కూడా కలిగి ఉంటాయి. ఈ కంపెనీ అందిస్తున్న ఉత్పత్తులన్నీ కూడా భారత మార్కెట్ కు చాలా కొత్తగా కనిపించే అవకాశం ఉంది. జోంటెస్ తమ టూవీలర్లలో అందించే కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో టిఎఫ్‌టి ఫుల్-కలర్ ఎల్‌సిడి స్క్రీన్, పూర్తి కీలెస్ కంట్రోల్ సిస్టమ్ (ఇగ్నిషన్, ఫ్యూయల్ లిడ్, సీట్ అన్‌లాక్ మొదలైనవి), రైడ్ మోడ్‌లు, ఆల్ రౌండ్ ఎల్ఈడి లైట్లు, డ్యూయల్ ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్‌బి పోర్ట్‌లు, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ (ABS) మరియు టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (TPMS) మొదలైనవి చాలానే ఉన్నాయి.

భారత్‌లో చైనా బైక్‌లను విడుదల చేయనున్న హైదరాబాద్ కంపెనీ.. భారీ డీల్‌కు ఓకే చెప్పిన ఆదీశ్వర్ మరియు జోంటెస్!

భారతదేశంలో ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే బెనెల్లీ, కీవే మరియు రాబోయే మోటో మోరిని వంటి పలు విదేశీ మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల తయారీ కంపెనీలకు చెందిన వ్యాపారాలను నిర్వహిస్తుంది. తాజాగా, జోంటెస్ తో ఒప్పందం కుదుర్చుకోవడం గురించి ఆదీశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియా మేమేజింగ్ డైరెక్టర్ వికాస్‌ జబాఖ్‌ మాట్లాడుతూ దేశీయ ఆటోమొబైల్‌ రంగంలోకి మరో విదేశీ బ్రాండ్‌ ప్రవేశిస్తున్నదని, దేశీయ పరిస్థితులకు తగ్గట్టుగా జోంటెస్‌ తమ మోటర్‌సైకిళ్లను రూపొందిస్తుందని చెప్పారు.

భారత్‌లో చైనా బైక్‌లను విడుదల చేయనున్న హైదరాబాద్ కంపెనీ.. భారీ డీల్‌కు ఓకే చెప్పిన ఆదీశ్వర్ మరియు జోంటెస్!

జోంటెస్ తమ వాహనాల నాణ్యతను అదుపులో ఉంచడానికి, ఈ బ్రాండ్ వాటి తయారీలో ఉపయోగించే భాగాలలో దాదాపు 80 శాతం వాటిని స్థానికంగా చైనాలో తయారు చేస్తుంది. భారతదేశంలో విక్రయించబడే జోంటెస్ ద్విచక్ర వాహనాలు అన్నీ కూడా చైనా నుండి దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు. భవిష్యత్తులో వీటిని భారతదేశంలో తయారు చేసే పరిస్థితులు ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. మార్కెట్లో ప్రారంభించినప్పుడు, జోంటెస్ ఉత్పత్తులు సుమారు రూ.3 లక్షల నుండి రూ. 3.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

భారత్‌లో చైనా బైక్‌లను విడుదల చేయనున్న హైదరాబాద్ కంపెనీ.. భారీ డీల్‌కు ఓకే చెప్పిన ఆదీశ్వర్ మరియు జోంటెస్!

భారత మార్కెట్లో ఆటమ్ వాడెర్ ఇ-బైక్ విడుదల..

ఇదిలా ఉంటే, హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ కంపెనీ ఆటమ్మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ (Atumobile Private Limited) దేశీయ మార్కెట్లో తమ మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ "ఆటమ్ వాడెర్" (Atum Vader) ను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.99,999 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. ఎర్లీ బర్డ్ ఆఫర్ లో భాగంగా ఈ పరిచయ ప్రారంభ ధర మొదటిగా బుక్ చేసుకునే 1000 మంది కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.999 చెల్లించడం ద్వారా దీనిని బుక్ చేసుకోవచ్చు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Hyderabad based adishwar auto to bring chinese motorcycle brand zontes to india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X