అద్భుతమైన రేంజ్ అందించే CYBORG ఎలక్ట్రిక్ బైకుల వివరాలు
భారతీయ మార్కెట్లో 'ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్' (Ignitron Motocorp Pvt. Ltd) అనేది కస్టమైజ్ వాహనాలను తయారుచేయడంలో ప్రాచుర్యం పొందిన స్వదేశీ ఎలక్ట్రిక్ స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీ ఇప్పుడు తమ 'సైబోర్గ్' (CYBORG) ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ల గురించి వెల్లడించింది. ఇందులో యోదా (Yoda), జిటి 120 (GT 120) మరియు బాబ్-ఈ (Bob-e) ఏ ఎలక్ట్రిక్ బైకులు ఉన్నాయి. కంపెనీ ఈ మూడు ఎలక్ట్రిక్ బైకుల యొక్క ధరలను కూడా ఇప్పుడు ప్రకటిచింది.

'ఇగ్నిట్రాన్ మోటోకార్ప్' కంపెనీ యొక్క 'సైబోర్గ్ యోదా' (CYBORG Yoda) ధర రూ. 1,84,999 కాగా, సైబోర్గ్ జిటి 120 (CYBORG GT 120) ధర రూ.1,64,999 వరకు ఉంటుంది. అదే విధంగా కంపెనీ యొక్క మూడవ మోడల్ అయిన సైబోర్గ్ బాబ్-ఈ (CYBORG Bob-e) ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1,14,999 (ఎక్స్-షోరూమ్).

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు చాలా ఎలక్ట్రిక్ వాహనాల పైన సబ్సిడీ అనేది అందుబాటులో ఉంటుంది. కానీ సైబోర్గ్ ఎలక్ట్రిక్ బైకుల కొనుగోలుపైన ఎలాంటి రాయితీలు లేదా సబ్సిడీలు అందుబాటులో లేదు. వాహన కొనుగోలుదారులు దీనిని గమనించాలి.

అయితే కంపెనీ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో అదనపు రాయితీలు ఈ మోటార్‌బైక్‌ల శ్రేణిని వినియోగదారులకు మరింత సరసమైనవిగా మారుస్తాయని పేర్కొంది. కావున రాష్ట్రాల వారీగా ఈ బైకుల ధరలో కొంత మార్పు వస్తుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైకుల యొక్క బుకింగ్ తేదీలను కూడా త్వరలోనే ప్రకటించనుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైకుల కోసం బుకింగ్స్ ప్రారంభించిన తరువాత కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

భారతదేశంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేస్తున్నప్పటికీ, సైబోర్గ్ యోడా భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్. ఈ బైక్‌కు రెట్రో క్రూయిజర్ డిజైన్ ఇవ్వబడింది. కావున ఈ బైక్‌లో నిటారుగా ఉండే హ్యాండిల్ బార్, ఫ్రంట్ లీనింగ్ ఫుట్‌ప్యాడ్, పిలియన్ బ్యాక్‌రెస్ట్ మరియు వైడ్ స్ప్లిట్, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, సర్క్యులర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, టైల్ లాంప్ మరియు టర్న్ ఇండికేటర్ వంటి వాటిని పొందుతుంది.

కొత్త సైబోర్గ్ యోడా క్రూయిజర్ బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో కీలెస్ ఇగ్నిషన్, యాంటీ-థెఫ్ట్ అలారం, అడ్జస్టబుల్ సస్పెన్షన్, సైడ్ లగేజ్ బాక్స్ వంటివి ఉన్నాయి.

కంపెనీ ఈ బైక్ 3.24 kWH లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పూర్తి ఛార్జ్‌పై 150 కిమీల పరిధిని అందిస్తుంది. ఈ బైక్ గంటకు 90 కిమీల గరిష్ట వేగాన్ని అందుకోగలదని కూడా కంపెనీ పేర్కొంది. CYBORG Yoda ఎలక్ట్రిక్ బైక్ బ్లాక్ మరియు సిల్వర్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది.

ఇక CYBORG బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్ విషయానికి వస్తే, ఇది AI ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ డర్ట్ మోటార్‌బైక్ లాగా ఉంటుంది. కొత్త బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్ 2.88 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే ఇది పూర్తిగా డిటాచబుల్ బ్యాటరీ. కావున దీనిని బయటకు తీసి ఛార్జింగ్ వేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ బైక్ కి ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ వేస్తే దాదాపుగా 110 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

ఈ బైక్ ని గంటకు 85 కిలోమీటర్ల వేగంతో రైడ్ చేయవచ్చు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్‌లో ఎకో, స్పోర్ట్స్ మరియు నార్మల్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్ బ్లాక్ మరియు రెడ్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

చివరగా కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ల జాబితాలో CYBORG GT 120 మూడవ బైక్. ఈ బైక్ 4.68 kWH లిథియం-అయాన్ బ్యాటరీని పొందుతుంది. ఈ బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై 180 కిమీల పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 125 కిమీ వరకు ఉంటుంది.

ఈ బైక్ లో జియో లొకేట్ / జియో ఫెన్సింగ్, బ్యాటరీ స్టేటస్, USB ఛార్జింగ్, బ్లూటూత్, కీలెస్ ఇగ్నిషన్ (రిమోట్ కంట్రోల్) మరియు డిజిటల్ క్లస్టర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులోని బ్యాటరీ CYBORG GT 120 యొక్క పరిమాణానికి మరియు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది.

CYBORG GT 120 లోని బ్యాటరీ 100% ఛార్జింగ్‌తో 4-5 గంటల బ్యాకప్‌ను అందిస్తుంది. ఇది 15 amp ఫాస్ట్ హోమ్ ఛార్జర్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 2.5 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిమీ వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది. ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్‌లు కూడా పొందుతుంది. కావున మంచి పనితీరుని అందిస్తాయి.


Click it and Unblock the Notifications








