మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ రేంజ్‌ను అందించనున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77.. త్వరలోనే లాంచ్!

బెంగుళూరుకి చెందిన ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ (Ultraviolette Automotive) గత రెండేళ్లుగా అభివృద్ధి చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఆల్ట్రావైలెట్ ఎఫ్77' (Ultraviolette F77) త్వరలోనే దేశీయ విపణిలో విడుదల కానుంది. తాజా నివేదిక ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇప్పుడు మేజర్ అప్‌గ్రేడ్‌ను పొందింది. ఆల్ట్రావైలెట్ ఎఫ్77 లో కంపెనీ పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్ విషయాల్లో కొన్ని అప్‌గ్రేడ్స్ చేసింది. ఈ అప్‌గ్రేడ్స్ అనంతరం కొత్త ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ఇప్పుడు మరింత ఎక్కువ పవర్ మరియు రేంజ్‌ను అందించనుంది.

మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ రేంజ్‌ను అందించనున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77.. త్వరలోనే లాంచ్!

ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ గతేడాది సెప్టెంబర్ నెలలో ఈ ఎఫ్77 పెర్ఫార్మెన్స్ ఇ-బైక్ ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. వాస్తవానికి, ఈ మోడల్ అమ్మకాలు 2022 ఆరంభంలోనే జరగాల్సి ఉన్నప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి తెచ్చిన అవాంతరాల కారణంగా దీని విడుదల ఆలస్యమైంది. అయితే, ఈ సమయాన్ని కంపెనీ కమ బైక్ మరింత గొప్పగా అప్‌గ్రేడ్ చేయడానికి ఉపయోగించుకుంది. ఈ సమయంలో కంపెనీ దాని బ్యాటరీని మరియు బ్యాటరీ ఆకృతిని అప్‌గ్రేడ్ చేసింది. ఫలితంగా, ఈ బైక్ ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్ మరియు పనితీరును అందిస్తుంది.

మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ రేంజ్‌ను అందించనున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77.. త్వరలోనే లాంచ్!

ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ భారతదేశంలో అత్యంత ఆశాజనకమైన ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్‌లలో ఒకటి. ఈ కంపెనీ 2019లో తొలిసారిగా తమ F77 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ కాన్సెప్ట్ ను వెల్లడించింది. దేశంలో అత్యుత్తమంగా కనిపించే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఇది ఎప్పటికీ మరియు ఇప్పటికీ ఒకటిగా ఉంటుంది. ఆల్ట్రావైలెట్ ఎఫ్77 అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంది. ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ దీనిని 2019 బహిర్గతం చేయడానికి కొన్ని సంవత్సరాల ముందే ఎఫ్77ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది.

మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ రేంజ్‌ను అందించనున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77.. త్వరలోనే లాంచ్!

వాస్తవానికి, ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 2020లోనే విడుదల చేయబడుతుందని అంచనా వేశారు. అయితే, పరిస్థితులు అందుకు అనుకూలించలేదు. అదే ఏడాది దేశంలోకి కోవిడ్ మహమ్మారి ప్రవేశించడంతో కంపెనీ అనుకున్న ప్రణాళికలు తారుమారు అయ్యాయి. అయితే, కంపెనీ ఈ ఖాలీ సమయాన్ని తమ బైక్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగించుకుంది. ఈ బైక్ ఇప్పుడు గత 2019లో ఆవిష్కరించిన దాని కంటే మరింత మెరుగ్గా ఉందని పేర్కొంది.

మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ రేంజ్‌ను అందించనున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77.. త్వరలోనే లాంచ్!

అల్ట్రావయొలెట్ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, "మేము ఫంక్షనల్‌గానే ఉన్నాము మరియు బ్యాటరీ ప్యాక్‌లు మరియు సెల్ తయారీదారులను పొందడానికి ఒక సంవత్సరం గడిచిపోయింది. మరో విషయం ఏంటంటే, సెల్స్ విషయంలో 18,650 నుండి 21,700 ఫార్మాట్‌కు మారడం. మా మొదటి నాలుగు సంవత్సరాల బ్యాటరీ సాంకేతికత పూర్తిగా 18,650 కోసం రూపొందించబడింది కానీ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. మేము మొదట అనుకున్నది ఏమిటంటే, ఎఫ్77 యొక్క రెండవ తరం 21,700 లోకి వెళ్తుందని. అయితే, మాకు లభించిన ఈ కోవిడ్ విండో కారణంగా మేము ఆ అభివృద్ధిని వేగంగా ట్రాక్ చేయగలిగాము" అన్నారు.

మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ రేంజ్‌ను అందించనున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77.. త్వరలోనే లాంచ్!

బ్యాటరీ ప్యాక్ లో ఉపయోగించే ఈ సెల్ సామర్థ్యం పెరిగిన కారణంగా ఆల్ట్రావైలెట్ ఎఫ్77 యొక్క రేంజ్ మరియు పనితీరు రెండూ కూడా పెరిగాయి. ఈ గణాంకాలకు సంబంధించి ప్రస్తుతానికి ఖచ్చితమైన సంఖ్యలు అందుబాటులో లేనప్పటికీ, ఈ పెరుగుదల దాదాపు 20 శాతం వరకూ ఉంటుందని అంచనా వేయబడింది. కంపెనీ 2019 సమయంలో, ఆల్ట్రావైలెట్ ఎఫ్77 పూర్తి ఛార్జ్‌పై 130 - 150 కిలోమీటర్ల మధ్య రేంజ్ ను అందిస్తుందని వాగ్దానం చేసింది. అయితే, ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ లో చేసిన అప్‌గ్రేడ్స్ కారణంగా ఈ బైక్ పూర్తి చార్జ్ పై సుమారు 200 కిలోమీటర్ల మార్కును చేరుకునే అవకాశం ఉంది.

మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ రేంజ్‌ను అందించనున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77.. త్వరలోనే లాంచ్!

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ఇ-బైక్ లో ఎయిర్-కూల్డ్, బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 33 బిహెచ్‌పి శక్తిని మరియు 90 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గతేడాది కంపెనీ వెల్లడించిన పెర్ఫార్మెన్స్ గణాంకాల ప్రకారం, Ultraviolette F77 ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం (టాప్ స్పీడ్) గంటకు 147 కిలోమీటర్లుగా ఉంటుంది మరియు ఇది కేవలం 2.8 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, కేవలం 7.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ రేంజ్‌ను అందించనున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77.. త్వరలోనే లాంచ్!

అయితే, ఈ గణాంకాలు కొత్త బ్యాటరీ ప్యాక్ కారణంగా మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ ఫ్లాష్, షాడో మరియు లేజర్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఆల్ట్రావైలెట్ ఎఫ్77 మోటార్‌సైకిల్ లో ఎకో, స్పోర్ట్ మరియు ఇన్‌సేన్ అనే మూడు రైడింగ్ మోడ్‌ లు ఉంటాయి. చార్జింగ్ విషయానికి వస్తే, ఇందులోని మునుపటి బ్యాటరీ ప్యాక్ ను స్టాండర్డ్ ఛార్జర్ ద్వారా పూర్తిగా చార్జ్ చేయటానికి 5 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ చార్జర్ ద్వారా అయితే, కేవలం 50 నిమిషాల్లో 80 శాతం వరకు మరియు 90 నిమిషాల్లో 100 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు.

మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ రేంజ్‌ను అందించనున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77.. త్వరలోనే లాంచ్!

కొత్త బ్యాటరీ ప్యాక్ యొక్క చార్జింగ్ సమయం వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది. పవర్‌ట్రైన్ మరియు ఫీచర్లలో మార్పులు మినహా కంపెనీ దీని డిజైన్ లో పెద్దగా మార్పులు చేయబోదని తెలుస్తోంది. ఎందుకంటే, ప్రారంభం నుండి ఆల్ట్రావైలెట్ ఎఫ్77 యొక్క డిజైన్ చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇందులో రైడ్ డయాగ్నోస్టిక్స్‌తో పాటు ఓవర్ ది ఎయిర్ అప్‌గ్రేడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు బైక్ లైవ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. ఇంరా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పూర్తి టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది.

మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ రేంజ్‌ను అందించనున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77.. త్వరలోనే లాంచ్!

స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించబడిన Ultraviolette F77 ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో ఇన్‌వర్టెడ్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్డ్ ప్రీలోడెడ్ అడ్జస్టబల్ మోనో షాక్‌ అబ్జార్వర్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్ మరియు 420 పిస్టన్ కాలిపర్ మరియు వెనుక బాగంలో 230 మిమీ డిస్క్ మరియు పిస్టన్ కాలిపర్‌ లు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మోడల్ కాబట్టి, ఇది స్టీల్-బ్రాండెడ్ బ్రేక్ లైన్లు మరియు 110/70 R17 ఫ్రంట్ టైర్ మరియు 150/60 R17 రియర్ టైర్ ను కలిగి ఉంటుంది. - లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Source: carandbike

Most Read Articles

English summary
India s first performance e bike ultraviolette f77 got updated launch expected in few weeks details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X