ఆల్ట్రావైలెట్ ఎఫ్77 హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌ను టెస్ట్ రైడ్ చేసిన పైలట్ కమ్యూనిటీ.. నెక్స్ట్ మనమే..!!
బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ (Ultraviolette Automotive Pvt Ltd) గత రెండేళ్లుగా అభివృద్ధి చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఆల్ట్రావైలెట్ ఎఫ్77' (Ultraviolette F77) మొదటిసారిగా టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని భారతదేశ పైలట్ కమ్యూనిటీకి కల్పించింది. భారతదేశం యొక్క 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఈ కంపెనీ భారతదేశ పైలట్ కమ్యూనిటీతో తమ హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ Ultraviolette F77 కోసం ప్రత్యేక టెస్ట్ రైడ్‌ను నిర్వహించింది.

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 యొక్క అత్యాధునిక స్పెసిఫికేషన్‌లు మరియు శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి అలాగే పైలట్‌లకు వాణిజ్యపరంగా ప్రారంభించే ముందు ఈ హై-పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ ప్రొడక్షన్ రెడీ వెర్షన్ యొక్క మొదటి అనుభవాన్ని అందించడానికి TAAL ఎయిర్‌స్ట్రిప్‌లో టెస్ట్ రైడ్ నిర్వహించింది. భారతదేశంలో రూపొందించబడిన మరియు ఇంజనీరింగ్ చేయబడిన, ఆల్ట్రావైలెట్ ఎఫ్77 అనేది విమానయాన పరిశ్రమలో ఉపయోగించే సూత్రాలతో రూపొందించబడిన అర్బన్ స్పోర్ట్స్ బైక్.

ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ తమ ఎఫ్77 మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించినప్పటి నుండి ఇప్పటి వరకూ అనేక పారామితులలో మరియు అనేక దశల ప్రధాన పురోగతిని సాధించింది. ప్రస్తుతం, భారత మార్కెట్లోనే అత్యంత అధునాతనమైన అధిక పనితీరు గల ఎలక్ట్రిక్ బైక్‌లలో ఒకటిగా ఉన్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కంపెనీ ఇటీవలే ఈ హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ లో కొన్ని మేజర్ అప్‌గ్రేడ్ లను కూడా చేసింది.

అధునాతన ఆల్ట్రావైలెట్ ఎఫ్77 లో కంపెనీ పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్ విషయాల్లో కొన్ని అప్‌గ్రేడ్స్ చేసింది. ఈ అప్‌గ్రేడ్స్ అనంతరం కొత్త ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ఇప్పుడు మరింత ఎక్కువ పవర్ మరియు రేంజ్‌ను అందించనుంది. ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ గతేడాది సెప్టెంబర్ నెలలో తమ ఎఫ్77 హై-పెర్ఫార్మెన్స్ ఇ-బైక్ ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. వాస్తవానికి, ఈ మోడల్ అమ్మకాలు 2022 ఆరంభంలోనే జరగాల్సి ఉన్నప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి తెచ్చిన అవాంతరాల కారణంగా దీని విడుదల ఆలస్యమైంది.

ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ 2019లో తొలిసారిగా తమ ఎఫ్77 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ రూపంలో పరిచయం చేసింది. కాగా, ఇప్పుడు ఈ మోడల్ మాస్ ప్రొడక్షన్ సిద్ధంగా ఉంది. ఏవియేషన్ కమ్యూటితీ ఈ బైక్ కోసం టెస్ట్ రైడ్ లను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ నారాయణ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, "భారతదేశంలోని పైలట్ కమ్యూనిటీకి చెందిన అనుభవజ్ఞులైన పైలట్‌లతో కూడిన ఉన్నత బృందంతో తాము తమ మొదటి బహిరంగ సహకారాన్ని ప్రారంభించినందున, అల్ట్రా వైలెట్‌లో ఇది తమకు ఓ ముఖ్యమైన సందర్భం మరియు ఏ ముఖ్యమైన మైలురాయి" అని అన్నారు.

ఏవియేషన్ ఇంజనీరింగ్ యొక్క ప్రధాన తత్వశాస్త్రం విమానంలోని ప్రతి ఒక్క భాగం క్రియాత్మక ప్రయోజనాన్ని అందించాలి మరియు 100 శాతం ఖచ్చితత్వం మరియు భద్రత కోసం ఇంజనీరింగ్ చేయబడాలి అనే వాస్తవం చుట్టూ తిరుగుతుందని, తాము ఎఫ్77ను నిర్మించాలని నిర్ణయించుకున్న మొదటి రోజు నుండి ఇది తమ నార్త్ స్టార్ మరియు మార్గదర్శక సూత్రంగా మారిందని ఆయన చెప్పారు.

గత కొన్ని సంవత్సరాలుగా తాము డిజైన్, వాహన ఇంజనీరింగ్, పనితీరు, భద్రత మరియు వినియోగదారు అనుభవం వంటి అన్ని అంశాలలో అభివృద్ధి చెందామని, ఈ మోటార్‌సైకిల్ పై అభివృద్ధి తాము ఉంచిన అంతులేని పని గంటలు F77ని పరిపూర్ణం చేస్తాయని సుబ్రమణ్యం అన్నారు. ఈ టెస్ట్ రైడ్ నుండి తాము అందుకున్న ఫీడ్‌బ్యాక్ అపారమైనదని, భారతదేశపు మొట్టమొదటి హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎఫ్77 విషయంతో పైలట్ సంఘంతో ఇంటరాక్ట్ అయ్యి మరిన్ని విషయాలను నేర్చుకునేందుకు తమ అవకాశం లభించినందుకు తామెంతో సంతోషిస్తున్నామని ఆయన అన్నారు.

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 మోటార్‌సైకిల్ లో కంపెనీ బ్యాటరీ సెల్స్ లో మేజర్ అప్‌గ్రేడ్ చేసింది. వీటిలో ఇదివరకు ఉపయోగించిన 18,650 కెపాసిటీ సెల్స్ కు బదులుగా మరింత శక్తివంతమైన మరియు సమర్థవంతమైన 21,700 కెపాసిటీ సెల్స్ ను ఉపయోగించారు. బ్యాటరీ ప్యాక్ లో ఉపయోగించే ఈ సెల్ సామర్థ్యం పెరిగిన కారణంగా ఆల్ట్రావైలెట్ ఎఫ్77 యొక్క రేంజ్ మరియు పనితీరు రెండూ కూడా పెరిగాయి. ఈ గణాంకాలకు సంబంధించి ప్రస్తుతానికి ఖచ్చితమైన సంఖ్యలు అందుబాటులో లేనప్పటికీ, ఈ పెరుగుదల దాదాపు 20 శాతం వరకూ ఉంటుందని అంచనా వేయబడింది.

ఈ మోటార్‌సైకిల్ విమానయాన పరిశ్రమలో ఉపయోగించే సూత్రాలతో నిర్మించబడింది. ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ఇ-బైక్ లో ఎయిర్-కూల్డ్, బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 33 బిహెచ్‌పి శక్తిని మరియు 90 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ బైక్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ఒక అధునాతనమైన స్మార్ట్ అండ్ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. దీనిని ధృడమైన స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించారు. ఇందులో ముందు వైపు ఇన్‌వర్టెడ్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్డ్ ప్రీలోడెడ్ అడ్జస్టబల్ మోనో షాక్ అబ్జార్వర్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్ మరియు 420 పిస్టన్ కాలిపర్ మరియు వెనుక బాగంలో 230 మిమీ డిస్క్ మరియు పిస్టన్ కాలిపర్ లు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మోడల్ కాబట్టి, ఇది స్టీల్-బ్రాండెడ్ బ్రేక్ లైన్లు మరియు 110/70 R17 ఫ్రంట్ టైర్ మరియు 150/60 R17 రియర్ టైర్ ను కలిగి ఉంటుంది.

ఎఫ్77 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ హై పెర్ఫార్మెన్స్ బైక్ కోసం కంపెనీ ముందుగా పైలట్లతో టెస్ట్ రైడ్ లను ప్రారంభించింది. ఈ అధునాతన ఎలక్ట్రిక్ బైక్ లో రైడ్ డయాగ్నోస్టిక్స్‌తో పాటు ఓవర్ ది ఎయిర్ అప్‌గ్రేడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు బైక్ లైవ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. ఇంరా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పూర్తి టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications








