మహమ్మద్ షమీ కొన్న కొత్త బైక్ ఇదే: ధర రూ. 3 లక్షలకు పైనే..

"మహమ్మద్ షమీ" ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే భారత క్రికెట్ టీమ్ లో ఒకరైన షమీ గురించి దాదాపు అందరికి తెలుసు. అయితే మహమ్మద్ షమీ ఇటీవల ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield) కంపెనీకి చెందిన 'కాంటినెంటల్ జిటి 650' (Continental GT 650) కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

మహమ్మద్ షమీ కొన్న కొత్త బైక్ ఇదే.. ఇక్కడ చూడండి

సాధారణంగా సినీ తారలు, క్రికెటర్లు మరియు పారిశ్రామిక వేత్తలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త బైకులు & కార్లు కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ క్రికెటర్ మహమ్మద్ షమీ 'రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650' కొనుగోలు చేశారు. షమీ కొనుగోలు చేసిన ఈ బైక్ సిల్వర్ కలర్ లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మహమ్మద్ షమీ కొన్న కొత్త బైక్ ఇదే.. ఇక్కడ చూడండి

షమీ పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో 'నా కొత్త క్రూజింగ్ భాగస్వామికి హలో చెప్పండి' అని రాసారు. 'కాంటినెంటల్ జిటి 650' ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 3.04 లక్షలు. అయితే షమీ కొనుగోలు చేసిన ఈ బైక్ టాప్ వేరియంట్ అయిన క్రోమ్ మోడల్, కావున దీని ధర సుమారు రూ. 3.31 లక్షల వరకు ఉంటుంది.

మహమ్మద్ షమీ కొన్న కొత్త బైక్ ఇదే.. ఇక్కడ చూడండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి స్టాండర్డ్, కస్టమ్ మరియు క్రోమ్ వేరియంట్స్. భారతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న బైకులలో ఇది కూడా ఒకటి. ఇది 650 సిసి విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఎక్కువమంది యువ రైడర్స్ ఇష్టపడే బైకుల్లో కాంటినెంటల్ జిటి 650 కూడా ఒకటి.

మహమ్మద్ షమీ కొన్న కొత్త బైక్ ఇదే.. ఇక్కడ చూడండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్‌లో రౌండ్ హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, 12.5-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు సింగిల్-సీట్ వంటి వాటిని పొందుతుంది. ఈ బైక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ కూడా పొందుతుంది.

మహమ్మద్ షమీ కొన్న కొత్త బైక్ ఇదే.. ఇక్కడ చూడండి

ఈ బైక్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇందులో ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క మొత్తం బరువు 198 కేజీలు. ఇక ఫ్యూయెల్ ట్యాంక్ విషయానికి వస్తే.. ఇది 12.5 లీటర్ కెపాసిటీ కలిగి ఉంటుంది. కావున లాంగ్ రైడ్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మహమ్మద్ షమీ కొన్న కొత్త బైక్ ఇదే.. ఇక్కడ చూడండి

ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో స్టాండర్డ్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జార్బర్ ఇవ్వబడ్డాయి. ఇందులో 18 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి, అంతే కాకుండా ఇందులోని టైర్లు ట్యూబ్ లెస్ టైర్లు అందుబాటులో ఉన్నాయి.

మహమ్మద్ షమీ కొన్న కొత్త బైక్ ఇదే.. ఇక్కడ చూడండి

ఈ బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ట్విన్ పాడ్ క్లస్టర్, అనలాగ్ స్పీడోమీటర్, చిన్న డిజిటల్ పాడ్ ఫ్యూయల్ లెవెల్, ఓడోమీటర్ మరియు రెండు ట్రిప్ మీటర్లు అందించబడ్డాయి. ఈ బైక్‌లోని హ్యాండిల్‌బార్ తక్కువగా ఉంటుంది, కానీ చాలా స్పోర్టీగా ఉంటుంది.

మహమ్మద్ షమీ కొన్న కొత్త బైక్ ఇదే.. ఇక్కడ చూడండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 బైక్ 648 సిసి, ప్యారలల్-ట్విన్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ 47 బిహెచ్‌పి పవర్ మరియు 52 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Sunday, June 12, 2022, 8:30 [IST]
English summary
Indian cricketer mohd shami buys new royal enfield bike details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+