ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి కొత్త FTR Championship Edition విడుదల, వివరాలు

అమెరికాకు చెందిన ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ 'ఇండియన్ మోటార్‌సైకిల్' (Indian Motorcycle) తాజాగా ఓ లిమిటెడ్ ఎడిషన్ నేక్డ్ స్పోర్స్ట్ బైక్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ బ్రాండ్ ఇటీవలే తన ఫ్లాట్ ట్రాక్ లెగసీని జరుపుకుంది, ఇందులో భాగంగా ఇండియన్ మోటార్‌సైకిల్ తమ బ్రాండ్‌ లైనప్ లో కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్‌టిఆర్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ (FTR Championship Edition) ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి కొత్త FTR Championship Edition విడుదల, వివరాలు

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ తెలిపిన సమాచారం ప్రకారం, కొత్త ఎఫ్‌టిఆర్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ బైక్ ను కంపెనీ కేవలం 400 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనుంది. అంటే, ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 400 మందికి మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటుందన్నమాట.

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి కొత్త FTR Championship Edition విడుదల, వివరాలు

అంతేకాకుండా, ఈ బైక్ ను కొనుగోలు చేసిన రేస్ ప్రియులకు అమెరికన్ ఫ్లాట్ ట్రాక్ ఛాంపియన్‌షిప్‌ (American Flat Track Championship) లో భాగంగా జరగబోయే ఇండియన్ వ్రెక్ క్రూ (Indian Wreck Crew's)యొక్క ఐదు వరుస విజయాల వేడుకలో చేరడానికి కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేస్ అభిమానులకు అవకాశాన్ని కల్పిస్తుంది.

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి కొత్త FTR Championship Edition విడుదల, వివరాలు

డిజైన్ మరియు లెగసీ..

డిజైన్ పరంగా చూస్తే, కొత్త ఇండియన్ ఎఫ్‌టిఆర్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ మోటార్‌సైకిల్, ఈ బ్రాండ్ విక్రయిస్తున్న ఎఫ్‌టిఆర్750 మోడల్ నుండి ప్రేరణ పొంది రూపొందించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా, కంపెనీ తమ రేసింగ్ లెగసీని జరుపుకునేందుకు వీలుగా ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్ స్టాండర్డ్ రేస్ పెయింట్ స్కీమ్‌తో డిజైన్ చేసింది. దీనితో పాటుగా, ఈ మోటార్‌సైకిల్ ‌ను మరింత ప్రత్యేకంగా మార్చడానికి, ఫ్లాట్ ట్రాక్‌లో బ్రాండ్ విజయాన్ని గుర్తుచేసే ప్రతి ఛాంపియన్‌షిప్ సీజన్ ‌లో ఇండియన్ మోటార్‌సైకిల్ రేసింగ్ బెజెల్ కూడా డిస్‌ప్లే చేయబడి ఉంటుంది.

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి కొత్త FTR Championship Edition విడుదల, వివరాలు

ఈ మోటార్‌సైకిల్ ఫ్యూయెల్ ట్యాంక్ పై గ్లోసీ కార్భన్ ఫైబర్ ఫినిషింగ్ తో కుడిన ప్యాటర్న్ చాలా ప్రత్యేకంగా మరియు ప్రీమియంగా కనిపిస్తుంది. అలాగే, ఫ్యూయెల్ ట్యాంక్ పై భాగంలో అమెరికన్ ఫ్లాట్ ట్రాక్ ఛాంపియన్‌షిప్‌ లో విజయం సాధించిన వరుస ఐదు సంవత్సరాలు (2017, 2018, 2019, 2020 మరియు 2021) కూడా ముద్రించబడి ఉంటాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఇండియన్ మోటార్‌సైకిల్ ను కేవలం షోపీస్ లా ఉండేందుకు కాకుండా, కొనుగోలుదారులకు అందుబాటులో ఉండేలా కంపెనీ రూపొందించింది.

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి కొత్త FTR Championship Edition విడుదల, వివరాలు

ఇంకా ఈ లిమిటెడ్ ఎడిషన్ ఇండియన్ ఎఫ్‌టిఆర్ మోటార్‌సైకిల్‌ (Limited Edition Indian FTR) లో డ్యూయెల్ టైటానియం అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ (రెండు సైలెన్సర్లు), పూర్తిగా సర్దుబాటు చేయగల ఫ్రంట్ ఫోర్కులు మరియు పిగ్గీబ్యాక్ షాక్ (వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్), తేలికపాటి కార్బన్ ఫైబర్ భాగాలు వంటి ప్రీమియం డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక ఇందులోని ప్రోటేపర్ ఫ్లాట్ ట్రాకర్ అల్యూమినియం హ్యాండిల్‌బార్ ఈ మోటార్‌సైకిల్ కు మరింత అందమైన రూపాన్ని జోడిస్తుంది.

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి కొత్త FTR Championship Edition విడుదల, వివరాలు

ఈ మోటార్‌సైకిల్ బరువును తేలికగా ఉంచేందుకు కంపెనీ దీని తయారీలో చాలా వరకూ కార్బన్ ఫైబర్ భాగాలను ఉపయోగించింది. ఈ భాగాలలో ఫ్రంట్ ఫెండర్, ఎయిర్‌బాక్స్ కవర్లు, సీట్ కౌల్ మరియు హెడ్‌లైట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. ఈ కార్బన్ ఫైబర్ భాగాలు మోటార్‌సైకిల్ యొక్క ప్రీమియం డిజైన్ ‌ను మరింతగా పెంచడంతో పాటుగా అధునాతన భావాన్ని కూడా పెంపొందిస్తాయి.

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి కొత్త FTR Championship Edition విడుదల, వివరాలు

రైడర్ అసిస్ట్ ఫీచర్లు..

ఇండియన్ ఎఫ్‌టిఆర్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ మోటార్‌సైకిల్ లో కేవలం కాస్మెటిక్ ఫీచర్లు మాత్రమే కాదు, ఇందులో రియర్ లిఫ్ట్ మిటిగేషన్‌తో కూడిన వీలీ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్, మూడు రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ మరియు కార్నరింగ్ ఏబిఎస్ వంటి కొన్ని కీలకమైన రైడ్ అసిస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రైడర్ కు ట్రాక్ పై మరింత ధైర్యాన్ని మరియు భరోసాను అదించడంలో సహకరిస్తాయి.

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి కొత్త FTR Championship Edition విడుదల, వివరాలు

ఇంజన్ మరియు హార్డ్‌వేర్ డీటేల్స్..

ఇక మెకానికల్స్ విషయానికొస్తే, ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్‌టిఆర్ ఛాంపియన్‌షిప్ మోటార్‌సైకిల్‌లో రేస్ నుండి స్పూర్తి పొంది రూపొందించిన 19 ఇంచ్ ఫ్రంట్ వీల్ మరియు 18 ఇంచ్ రియర్ వీల్ ఉంటాయి. ఈ చక్రాలపై ఫ్లాట్ ట్రాక్-ప్రేరేపిత త్రెడ్ ప్యాటర్న్‌తో కూడిన డన్‌లప్ స్ట్రీట్ టైర్‌లను ఉపయోగించారు. ఈ బైక్ పై మంచి కంట్రోల్ మరియు స్టాపింగ్ పవర్ ను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించి బ్రెంబో కాలిపర్‌లతో కూడిన రేడియల్లీ మౌంటెడ్ డ్యూయల్ ఫ్రంట్ డిస్క్‌ను ఇందులో అమర్చారు.

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి కొత్త FTR Championship Edition విడుదల, వివరాలు

చివరిగా ఇంజన్ విషయానికి వస్తే, కొత్త ఇండియన్ ఎఫ్‌టిఆర్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ (Indian FTR Champion Edition) లో శక్తివంతమైన 1203 సీసీ, లిక్విడ్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 121.3 బిహెచ్‌పి శక్తిని మరియు 120 ఎన్ఎమ్ టార్క్‌ ని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతానికి కంపెనీ ఈ బైక్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, March 14, 2022, 13:36 [IST]
English summary
Indian motorcycle launches ftr championship edition to celebrates its flat track legacy details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+