ధర తక్కువ & ఎక్కువ రేంజ్: కొత్త iVOOMi JeetX ఎలక్ట్రిక్ స్కూటర్

భారతదేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత ఎక్కువ సంఖ్యలో టూ వీలర్స్ విడుదలవుతున్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉండటం గమనార్హం. టీవీఎస్, హీరో మోటోకార్ప్ వంటి అగ్రగామి టూ వీలర్స్ తయారీ సంస్థలు మాత్రమే కాకుండా 'ఐవోమి ఎనర్జీ' (iVOOMi Energy) వంటి టూ వీలర్ తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తున్నాయి.

Recommended Video

Royal Enfield నుంచి కొత్త Hunter 350 వచ్చేసింది | ధర & వివరాలు

ఇందులో భాగంగానే కంపెనీ దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'జీట్‌ఎక్స్‌' (JeetX) విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.. రండి.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్: కొత్త iVOOMi JeetX ఎలక్ట్రిక్ స్కూటర్

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'జీట్‌ఎక్స్‌' ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి జీట్‌ఎక్స్‌ (రూ.99,000) మరియు 'జీట్‌ఎక్స్‌ 180' స్కూటర్ (రూ.1.40 లక్షలు). ఇందులో జీట్‌ఎక్స్‌ 180 ఏది హై పర్ఫామెన్స్ స్కూటర్. కావున ఎక్కువ రేంజ్ అందిస్తుంది.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్: కొత్త iVOOMi JeetX ఎలక్ట్రిక్ స్కూటర్

JeetX మరియు JeetX 180 ఎలక్ట్రిక్ స్కూటర్లు నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్కార్లెట్ రెడ్, ఇంక్ బ్లూ, పోష్ వైట్ మరియు స్పేస్ గ్రే కలర్స్.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్: కొత్త iVOOMi JeetX ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్‌లు 2022 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి. అయితే డెలివరీ కూడా సెప్టెంబర్ 1న బేస్ వేరియంట్ డెలివరీలు ప్రారంభమవుతాయి. JeetX180 కి సంబంధించిన డెలివరీలు ఆ నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో కూడా 2022 సెప్టెంబర్ 10 కొనుగోలుచేసే కస్టమర్లకు కంపెనీ రూ. 3,000 విలువైన యాక్ససరీస్ ఉచితంగా అందిస్తుంది.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్: కొత్త iVOOMi JeetX ఎలక్ట్రిక్ స్కూటర్

జీట్‌ఎక్స్‌ 180 ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీలతో వస్తుంది. ఇది వినియోగదారులు డ్యూయల్ బ్యాటరీ కాన్ఫిగరేషన్‌ని ఉపయోగించి వారి వాహనాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా వారి EV యొక్క డ్రైవింగ్ పరిధిని పెంచడంలో సహాయపడుతుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్: కొత్త iVOOMi JeetX ఎలక్ట్రిక్ స్కూటర్

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ విషయానికి వస్తే, బేస్ వేరియంట్ అయిన జీత్ఎక్స్ రైడర్ మోడ్ లో 90 కిమీ రేంజ్ అందించగా.. ఎకో మోడ్ లో 100 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే జీత్ఎక్స్ 180 మోడల్ మాత్రం ఎకో మోడ్ లో 200 కిమీ రేంజ్ అందించగా, స్పోర్ట్స్ మోడ్ లో 180 కిమీ రేంజ్ అందిస్తుంది.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్: కొత్త iVOOMi JeetX ఎలక్ట్రిక్ స్కూటర్

జీత్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల సందర్భంగా ఐవోమి ఎనర్జీ ఎండి 'సునీల్ బన్సాల్' మాట్లాడుతూ.. స్వదేశీ సృజనాత్మకతతో వినియోగదారులకు సేవలందించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. భారతదేశంలోని వివిధ పరిస్థితులకు సరిపోయే విధంగా మా ఉత్పత్తులను తీసుకురావడానికి మరింత కృషి చేస్తామన్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు భారతీయ వినియోగదారులను తప్పకుండా ఆకర్షిస్తాయనే నమ్మకం ఉందని కూడా ఆయన తెలిపారు.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్: కొత్త iVOOMi JeetX ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. కావున రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకూండా ఇందులో రివర్స్ ఫంక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో డిస్క్ బ్రేకులు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో టచ్ లెస్ ఫుట్ రెస్ట్ కూడా అందుబాటులో ఉంది.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్: కొత్త iVOOMi JeetX ఎలక్ట్రిక్ స్కూటర్

మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. కావున పెట్రోల్ స్కూటర్లను అధిగమించే స్థాయిలో అమ్మకాలు సాగుతున్నాయి. రానున్న రోజుల్లో తప్పకుండా అమ్మకాల్లో పెట్రోల్ స్కూటర్లను క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్: కొత్త iVOOMi JeetX ఎలక్ట్రిక్ స్కూటర్

మార్కెట్లో పెట్రోల్ వాహనాలకంటే ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఇందులో ప్రధానమైనది నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలు. ఇంధన ధరలు రోజురోజుకి పెరుగుతున్న కారణంగా చాలామంది వినియోగదారులు రోజువారీ వినియోగానికి ఎలక్ట్రిక్ వాహనాలనే ఎంచుకుంటున్నారు. ఇదే క్రమంగా కొనసాగితే పెట్రోల్ వాహనాలు మరో 5 సంవత్సరాల్లో వినియోగంలో ఉండకపోవచ్చు.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్: కొత్త iVOOMi JeetX ఎలక్ట్రిక్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మార్కెట్లో ఎట్టకేలకు తన జీట్‌ఎక్స్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది, కావున ఇది దేశీయ మార్కెట్లో ఉత్తమమైన అమ్మకాలను పొందుతుందా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని కొత్త బైకులు మరియు కార్లను గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, August 23, 2022, 16:04 [IST]
English summary
Ivoomi energy launched two new electric soocter jeetx and jeetx180 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+