ఐవూమి (iVOOMi) నుండి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల; ఫుల్ చార్జ్‌పై 130 కిమీ రేంజ్!

దేశంలో రోజుకో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో విడుదలవుతోంది. తాజాగా ఐవూమి (iVOOMi) కి చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం "ఐవూమి ఎనర్జీ" (iVOOMi Energy) భారత విపణిలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. వీటిలో "ఐవూమి ఎస్1" (iVOOMi S1) మరియు "జీత్" (Jeet) సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఉన్నాయి. భారత మార్కెట్లో కొత్తగా విడుదలైన ఐవూమి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు రూ. 82,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

ఐవూమి (iVOOMi) నుండి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల; ఫుల్ చార్జ్‌పై 130 కిమీ రేంజ్!

దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ను తీర్చేందుకు తమ స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తున్నామని ఐవూమి ఎనర్జీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ టూవీలర్లు స్మార్ట్ టెక్నాలజీ మరియు కస్టమర్-సెంట్రిక్ ఫీచర్లతో నిర్మించబడ్డాయని, ఇవి తమ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయని కంపెనీ తెలిపింది. .

ఐవూమి (iVOOMi) నుండి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల; ఫుల్ చార్జ్‌పై 130 కిమీ రేంజ్!

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు పూర్తి ఛార్జింగ్‌తో 130 కి.మీల రేంజ్‌ను అందించగలవని కంపెనీ పేర్కొంది. వివిధ రకాల రైడింగ్ ప్యాటర్ న్‌కు అనుకూలమైన రేంజ్ తో, సలువుగా ఉపయోగించడానికి మరియు తక్కువ సమయంలో చార్జ్ చేయడానికి వీలుగా వీటిని రూపొందించామని ఐవూమి తెలిపింది. ఈ కంపెనీ విడుదల చేసిన కొత్త ఐవూమి ఎస్1 మరియు ఐవూమి జీత్ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండూ కూడా హై స్పీడ్ ఇ-స్కూటర్‌లు, ఇవి గరిష్టంగా గంటకు 60 కిమీ వేగంతో ప్రయాణిస్తాయి.

ఐవూమి (iVOOMi) నుండి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల; ఫుల్ చార్జ్‌పై 130 కిమీ రేంజ్!

ఐవూమి ఎస్1 (iVOOMi S1)

ఐవూమి ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే వేరియంట్‌ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో దీని ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్‌) గా ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 65 కిమీ వేగంతో ప్రయాణించే 2kW ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 60V, 2kWh మార్చుకోగల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ సాయంతో పనిచేస్తుంది.

ఇది రిమూవబల్ బ్యాటరీ టెక్నాలజీని కలిగి ఉన్నందున, అపార్ట్‌మెంట్ లలో నివసించే వారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. రేంజ్ మరియు చార్జింగ్ సమయం విషయానికి వస్తే, ఐవూమి ఎస్1 పూర్తి చార్జ్ పై గరిష్టంగా 115 కి.మీల రైడింగ్ రేంజ్‌ని అందజేస్తుందని మరియు దీనిని కేవలం 3-4 గంటల్లోనే పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 75 కిలోలుగా ఉంటుంది.

ఐవూమి (iVOOMi) నుండి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల; ఫుల్ చార్జ్‌పై 130 కిమీ రేంజ్!

ఐవూమి జీత్ (iVOOMi Jeet)

ఐవూమి జీత్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి కంపెనీ దీనిని రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో ఒకటి స్టాండర్డ్ మరొకటి ప్రో మోడల్. మార్కెట్లో iVOOMi Jeet మోడల్ ధర రూ.82,999 (ఎక్స్-షోరూమ్) కాగా, iVOOMi Jeet Pro మోడల్ ధర రూ.92,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. వీటిలో స్టాండర్డ్ ఐవూమి జీత్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5kWh బ్యాటరీ ప్యాక్‌ ను కలిగి ఉంటుంది. కాగా ఐవూమి జీత్ ప్రో వేరియంట్ పెద్ద 2kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది.

ఐవూమి (iVOOMi) నుండి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల; ఫుల్ చార్జ్‌పై 130 కిమీ రేంజ్!

ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా పూర్తి ఛార్జింగ్ పై గరిష్టంగా 130 కిమీల వరకూ రేంజ్‌ ను అందజేస్తాయని కంపెనీ తెలిపింది. ఐవూమి జీత్ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెడ్, బ్లూ మరియు గ్రే అనే మూడు రంగులలో లభిస్తాయి. ఈ స్కూటర్‌లను 'ప్రీమియం డిజైన్ మరియు అల్ట్రా-పవర్‌ఫుల్ బిల్డ్'తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. భారతీయ రోడ్లకు అనుగుణంగా వీటిని 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ తో డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఐవూమి (iVOOMi) నుండి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల; ఫుల్ చార్జ్‌పై 130 కిమీ రేంజ్!

ఐవూమి ఎలక్ట్రిక్ స్కూటర్లలో కంపెనీ అందిస్తున్న స్టాండర్డ్ ఫీచర్ల విషయానికి వస్తే, వీటిలో ఫైండ్ మై స్కూటర్, 30 లీటర్ల బూట్ స్పేస్, పార్కింగ్ అసిస్ట్ మరియు యూయఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ లను కంపెనీ పూర్తిగా స్వదేశంలోనే తయారు చేస్తోంది. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే పరికరాలు భారతీయ OEM (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫాక్చరర్)లు మరియు దేశీయ ఆటో విడిభాగాల తయారీదారులపై ఆధారపడి ఉంటాయని, ఇవి పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు అని కంపెనీ తెలిపింది.

ఐవూమి (iVOOMi) నుండి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల; ఫుల్ చార్జ్‌పై 130 కిమీ రేంజ్!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, ఐవూమి ఎనర్జీ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ బన్సాల్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విషయంలో భారతీయ వినియోగదారులు అవసరాలు మరియు అభిరుచిలకు అనుగుణంగా తమ బృందం రెండు సంవత్సరాల పాటు విస్తృతమైన పరిశోధన మరియు అభివృద్ధి చేసిన తర్వాత, పూర్తిగా స్వదేశీ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. తమ ఎలక్ట్రిక్ వాహనాలు దృడమైన సస్పెన్షన్‌లు మరియు అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌లతో పాటుగా విశాలమైన లెగ్‌రూమ్‌తో భారతీయ వినియోగదారులు మరియు వారి డ్రైవింగ్ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయని, తాము రాబోయే తరాలకు మెరుగైన మరియు పచ్చని భవిష్యత్తును అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తున్నామని చెప్పారు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 22, 2022, 17:56 [IST]
English summary
Ivoomi energy launches s1 and jeet series electric scooters in india price and range details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+