దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త జావా 42 బాబర్.. ధర రూ. 2.06 లక్షలు

భారతీయ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు విడుదవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల 'జావా 42 బాబర్‌' (Jawa 42 Bobber) విడుదలైంది. ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 2.06 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త జావా 42 బాబర్.. ధర రూ. 2.06 లక్షలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త జావా 42 బాబర్‌ మూడు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి మిస్టిక్ కాపర్, మూన్‌స్టోన్ వైట్ మరియు జాస్పర్ రెడ్. కలర్ ని బట్టి ధరలు కూడా మారుతాయి.

  • జావా 42 బాబర్‌ మిస్టిక్ కాపర్: రూ. 2.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • జావా 42 బాబర్‌ మూన్‌స్టోన్ వైట్: రూ. 2.07 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • జావా 42 బాబర్‌ జాస్పర్ రెడ్: రూ. 2.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త జావా 42 బాబర్.. ధర రూ. 2.06 లక్షలు
    Colour Variant Price
    Mystic Copper ₹2,06,500
    Moonstone White ₹2,07,500
    Jasper Red (Dual Tone) ₹2,09,187
    దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త జావా 42 బాబర్.. ధర రూ. 2.06 లక్షలు

    జావా 42 బాబర్‌ చూడగానే ఆకర్శించే విధంగా తయారుచేయబడి ఉంటుంది. కావున ఇందులో కొత్త రౌండ్ హెడ్‌ల్యాంప్, ఇండిపెండెంట్ క్లాక్ కన్సోల్, కొత్త హ్యాండిల్ బార్, కొత్త ఫ్యూయల్ ట్యాంక్, పూర్తిగా రీడిజైన్ చేయబడిన అడ్జస్టబుల్ సీటు మరియు వెనుక ఫెండర్‌పై చిన్న లగేజ్ ర్యాక్ వంటివి ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పుడు వీల్‌బేస్ కొంత ఎక్కువగా ఉంటుంది.

    దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త జావా 42 బాబర్.. ధర రూ. 2.06 లక్షలు

    జావా 42 బాబర్ బైక్ అనేది పెరాక్ బాబర్ యొక్క స్టైలింగ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది. కావున ఇది మంచి స్టైలింగ్ పొందుతుంది. ఇందులో నెగటివ్ LCD డిస్‌ప్లే కూడా చూడవచ్చు. అయితే టెయిల్-ల్యాంప్ పెరాక్‌కి భిన్నంగా ఉండటం గమనించవచ్చు.

    దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త జావా 42 బాబర్.. ధర రూ. 2.06 లక్షలు

    కొత్త జావా 42 బాబర్‌ బైక్ 334 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ యూనిట్ పొందుతుంది. ఇది 30.64 హెచ్‌పి పవర్ మరియు 32.64 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది, కావున మంచి పనితీరుని అందిస్తుంది.

    దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త జావా 42 బాబర్.. ధర రూ. 2.06 లక్షలు

    కొత్త జావా 42 బాబర్ బైక్ రైడర్ కి మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందించడానికి అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ కూడా అందిస్తుంది. అదే సమయంలో బ్రేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ స్పోక్డ్ వీల్స్ పొందుతుంది.

    దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త జావా 42 బాబర్.. ధర రూ. 2.06 లక్షలు

    జావా 42 బాబర్ అద్భుతమైన డిజైన్ కలిగి, మంచి పనితీరుని అందించేలా రూపొందించబడి ఉంటుంది. అయితే ప్రస్తుతం దీనికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు, కానీ ధరల విషయంలో మాత్రం జావా పెరాక్ కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ధరలు ఎంచుకునే కలర్ ఆప్సన్ ని బట్టి ఉంటాయి.

    దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త జావా 42 బాబర్.. ధర రూ. 2.06 లక్షలు

    డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

    పండుగ సీజన్ లో జావా 42 బాబర్ విడుదల కావడం బైక్ ప్రేమికులకు మంచి శుభవార్త అనే చెప్పాలి. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది, కావున మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, October 1, 2022, 11:39 [IST]
English summary
Jawa launches 42 bobber motorcycle in india at inr 2 06 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+