JOY e-bike నుంచి రానున్న మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు: వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఈ కారణంగా వాహన తయారీ సంస్థలు ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా మార్కెట్లో విడుదలవ్వడానికి ప్రధాన కారణం అమాంతం పెరిగిన ఇంధన (పెట్రోల్ & డీజిల్) ధరలు. పెరిగిన ఇంధన ధరలు సామాన్య ప్రజలపైన ఎక్కువ భారాన్ని మోపిన కారణంగా కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.

JOY e-bike నుంచి రానున్న మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు: వివరాలు

ఈ నేపథ్యంలో భాగంగానే, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న జాయ్ ఇ-బైక్స్ (Joy E-Bikes) త్వరలో కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ ఇందులో రెండు స్కూటర్లను పరిచయం చేసే అవకాశం ఉంది. ఇందులో ఒకటి వోల్ఫ్ ప్లస్ (Wolf+) కాగా, మరొకటి జెన్ నెక్స్ట్ నాను ప్లస్ (Gen Next Nanu+).

JOY e-bike నుంచి రానున్న మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు: వివరాలు

కంపెనీ ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క టీజర్లకు కూడా విడుదల చేసింది. అయితే వీటిని కంపెనీ 2022 జనవరి 10 న విడుదల చేయనుంది. అయితే కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన ఎటువంటి అధికారిక సమాచారం, అంటే రేంజ్, ఫీచర్స్, డిజైన్ మరియు పర్ఫామెన్స్ వంటి వాటిని గురించి అధికారికంగా వెల్లడించలేదు. అయితే కంపెనీ వీటన్నింటిని త్వరలో విడుదల చేస్తుంది.

JOY e-bike నుంచి రానున్న మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు: వివరాలు

భారతదేశంలో జాయ్ ఇ-బైక్‌ల మాతృ సంస్థ వార్డ్ విజార్డ్ మొబిలిటీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తుంది. అయితే కంపెనీ ఇప్పటికే 2021 డిసెంబర్ నెలలో మొత్తం 3,860 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో వేగంగా అడుగులు వేస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది.

JOY e-bike నుంచి రానున్న మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు: వివరాలు

2021 డిసెంబర్ అమ్మకాలలో కంపెనీ 548 శాతం సాధించింది. అంతకు ముందు 2020 డిసెంబర్ నెలలో కంపెనీ కేవలం 595 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు 2020 కంటే కూడా 2021 లో ఎక్కువ అమ్ముడయ్యాయి, కావున 2022 లో కూడా మరిన్ని అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

కంపెనీ యొక్క 2021 మొదటి మూడు త్రైమాసికాలలో అంటే 2021 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు, 17,000 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను మరియు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విక్రయించినట్లు తెలిసింది. 2020 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ నుండి డిసెంబర్ 2020) ఇదే కాలానికి జరిగిన అమ్మకాలతో పోల్చితే 2021 లో 570% ఎక్కువ అని కంపెనీ తెలిపింది.

JOY e-bike నుంచి రానున్న మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు: వివరాలు

ఇక చివరగా కంపెనీ 2021 మూడవ త్రైమాసికంలో (అక్టోబర్ నుండి డిసెంబర్ 2021) అమ్మకాలు 10,000 యూనిట్లను దాటాయి. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి. అతి తక్కువ కాలంలో కంపెనీ తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది.

ఇందులో భాగంగానే వార్డ్ విజార్డ్ మొబిలిటీ గత సంవత్సరం గుజరాత్‌లో 20 కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. అంతే కాకుండా, కంపెనీ గువాహటిలో రెండు డీలర్‌షిప్‌లు మరియు పూణేలో మూడు కంపెనీ యాజమాన్యంలోని ప్రత్యేక అనుభవ కేంద్రాలతో అస్సాంలో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇవన్నీ కూఆ కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడంలో ఎంతగానో తోడ్పడతాయి.

JOY e-bike నుంచి రానున్న మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు: వివరాలు

ఇదిలా ఉండగా 2021 అక్టోబర్‌లో గుజరాత్‌లో 'గో గ్రీన్' పథకాన్ని ప్రారంభించబడింది. ఈ గో గ్రీన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు మద్దతు ఇవ్వడం, ఇంధన బిల్లులను తగ్గించడం మరియు వాహనాల ఉద్గారాలను అరికట్టడం ద్వారా పర్యావరణాన్ని శుభ్రపరచడం.

JOY e-bike నుంచి రానున్న మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు: వివరాలు

ఈ కొత్త పథకం కింద, రాష్ట్రంలోని నిర్మాణ మరియు పారిశ్రామిక కార్మికులకు బ్యాటరీతో నడిచే ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను సబ్సిడీ ధరలకు అందజేస్తున్నారు. సంఘటిత రంగంలోని ఏ కార్మికుడైనా ఎలక్ట్రిక్ వాహనం ధరపై 30 శాతం లేదా రూ. 30,000 ఏది తక్కువైతే అది రాయితీని పొందవచ్చు.

JOY e-bike నుంచి రానున్న మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు: వివరాలు

నిర్మాణ రంగంలోని కార్మికులకు సబ్సిడీకి ప్రత్యేక ప్రమాణం ఉంది, వారు బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలపై 50 శాతం సబ్సిడీ లేదా రూ. 30,000 రాయితీ, ఏది తక్కువైతే అది పొందవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే కార్మికులకు వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు రోడ్డు టాక్స్ పై కూడా ఒకేసారి మినహాయింపు ఇవ్వబడుతుంది.

JOY e-bike నుంచి రానున్న మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు: వివరాలు

ప్రస్తుతం 'గో గ్రీన్' పథకం ప్రారంభ దశలో ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వం 1,000 మంది నిర్మాణ కార్మికులు మరియు 2,000 మంది సంఘటిత రంగ కార్మికులకు బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలను అందిస్తోంది. ప్రభుత్వం ఆమోదించిన మరియు స్థానికంగా తయారు చేయబడిన వాహనాలు మాత్రమే ఈ పథకం కింద కొనుగోలుదారులకు అందించబడుతుంది.

ఈ పథకం కింద అందించే ఎలక్ట్రిక్ వాహనాలు ఒక్కసారి ఛార్జింగ్‌తో 50 కి.మీ దూరం ప్రయాణించగల హై-స్పీడ్ మోడల్‌గా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇవన్నీ కూడా రోజు వారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయి. కావున ఇప్పుడు కంపెనీ విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో అడుగుపెడితే, కంపెనీ యొక్క అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Joy e bikes to launch new high speed scooter range on 10th january details
Story first published: Wednesday, January 5, 2022, 18:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X