ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన ఈ బ్రిటీష్ బైక్ వెలోసెట్ (Velocette)ను గమనించారా?

రామారావు, రాజమౌళి, రామ్‌చరణ్ ఈ ముగ్గురి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా యావత్ భారతదేశంలోనూ రికార్డుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసినదే. పాన్ ఇండియా ఫిల్మ్‌గా విడుదలైన ఈ భారీ బడ్జెట్ సినిమాలో రాజమౌళి ఆ కాలం నాటి వ్యక్తులు ధరించిన వస్త్రాలు, వినియోగించిన వస్తువులు మరియు వారి జీవనశైలి వంటి అనేక విషయాయలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో భాగంగానే, జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ ప్రత్యేకమైన బ్రిటీష్ బైక్‌ని తయారు చేయించారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన ఈ బ్రిటీష్ బైక్ వెలోసెట్ (Velocette)ను గమనించారా?

ఈ చిత్ర కథా నేపథ్యం బ్రిటీష్ కాలం నాటిది కావ‌డంతో అప్ప‌టి క‌ట్ట‌డాల‌ను క‌ళాత్మ‌కంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. రామ్‌చ‌ర‌ణ్ ఇందులో గుర్ర‌పు స్వారీ చేస్తూ క‌నిపించ‌గా, తార‌క్ మాత్రం బైక్ రైడ్ చేస్తూ అల‌రించాడు. బ్రిటీష్ కాలంలో వాడే ఆనాటి బైక్‌ల కోసం జ‌క్క‌న్న తీవ్రంగా శ్ర‌మించినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే, ఇప్పుడు ఆ త‌ర‌హా బైక్ లు ల‌భించ‌క‌పోవ‌డంతో ఎన్టీఆర్ కోసం దీనిని ప్ర‌త్యేకంగా త‌యారు చేయించాడ‌ట‌. ఈ బైక్ త‌యారీ కోసం సుమారు రూ. 20 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసినట్లు సమాచారం.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన ఈ బ్రిటీష్ బైక్ వెలోసెట్ (Velocette)ను గమనించారా?

ఆర్ఆర్ఆర్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ప్రత్యేకమైన వెలోసెట్ (Velocette) బ్రిటీష్ బైక్‌పై కనిపిస్తారు. నిజానికి, ఇప్పుడు ఈ బైక్ ఆనవాళ్లు లేకపోయినప్పటికీ, అప్ప‌ట్లో మాత్రం ఇవి చాలా ట్రెండింగ్ లో ఉండేవి. ఆ కాలంలో (1920-50 ప్రాంతంలో) భారతదేశానికి మరియు బ్రిటీష్ రాజ్యానికి మధ్య రవాణా ప్రారంభమైన తర్వాత అనేక బ్రిటీష్ కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడికి తీసుకువచ్చాయి. అలా భారతదేశానికి వచ్చిన బ్రిటీష్ మోటార్‌సైకిల్ కంపెనీలలో వెలోసెట్ కూడా ఒకటి.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన ఈ బ్రిటీష్ బైక్ వెలోసెట్ (Velocette)ను గమనించారా?

పూర్తిగా చేతితో తయారు చేయబడిన మోటార్‌సైకిళ్లు

బ్రిటీష్‌కి చెందిన ఈ వెలోసెట్ టూవీలర్ల తయారీ ఓ కుటుంబ వ్యాపారం (ఫ్యామిలీ బిజినెస్) గా ప్రారంభమైంది. ఈ బ్రాండ్ అందించే మోటార్‌సైకిళ్లను పూర్తిగా చేతుల్తోనే తయారు చేస్తారు. ఆ కాలంలో చేతితో తయారు చేసిన బైక్‌లు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందాయి. వెలోసెట్ ప్రధాన కార్యాలయం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉంది. ఇది ఒక చిన్న కుటుంబ సంస్థ.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన ఈ బ్రిటీష్ బైక్ వెలోసెట్ (Velocette)ను గమనించారా?

1896లోనే వ్యాపారంలోకి ప్రవేశం

వెలోసెట్ బ్రాండ్ 1920 తర్వాత మంచి ప్రాచుర్యం పొందింది. అయితే, ఈ బ్రాండ్ అంతకన్నా ముందే వ్యాపారం చేసేది. వాస్తవానికి, ఈ కంపెనీని 1896లో జాన్ గుడ్‌మాన్ మరియు విలియం గూ "టేలర్, గ్యూ కో లిమిటెడ్" అనే పేరుతో స్థాపించారు. ప్రారంభంలో ఈ కంపెనీ సైకిల్ ఫ్రేమ్‌లు మరియు ఇతర భాగాలను తయారు చేసేది, కానీ తరువాత అది మోటార్ సైకిళ్ల కోసం ఫ్రేమ్‌లను రూపొందించడం ప్రారంభించింది.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన ఈ బ్రిటీష్ బైక్ వెలోసెట్ (Velocette)ను గమనించారా?

1905లో మొట్టమొదటి మోటార్‌సైకిల్ వెలోస్ తయారీ

ఈ సంస్థ తమ మొట్టమొదటి మోటార్‌సైకిల్ అయిన "వెలోస్" (Velos)ను 1905లోనే తయారు చేసింది. వెలోస్ అనేది ఒక ఇటాలియన్ పదం, ఆ భాషలో వెలోస్ అంటే వేగం అని అర్థం. నిజానికి, ఆ కాలంలో ఈ బైక్ కు ఆ పేరు ఖచ్చితంగా సరిపోయేది. ఆ తరువాత, జాన్ గుడ్‌మాన్ వెలోస్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీని స్థాపించారు, ఇది ప్రధానంగా సైకిల్ సంబంధిత ఉత్పత్తులను తయారు చేసేది. ఆ తర్వాత వారి కుమారులు ఈ వ్యాపారంలోకి వచ్చారు. సుమారు 1910లో వారు వెలోస్ మోటార్ కంపెనీ పేరుతో మోటార్‌సైకిళ్ల వ్యాపారాన్ని ప్రారంభించారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన ఈ బ్రిటీష్ బైక్ వెలోసెట్ (Velocette)ను గమనించారా?

మొదట్లోనే 500సీసీ బైక్‌లు తయారు చేసేవారు

వెలోస్ మోటార్ కంపెనీ వారి మొదటి బైక్‌ల లోనే 500సిసి సామర్థ్యం కలిగిన ఇంజన్లను ఉపయోగించేది. 1910లో కంపెనీ విఎమ్‌సి మోటార్‌సైకిల్‌ను ప్రారంభించింది. ఇది 3.5 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 500 సిసి ఇంజన్‌ను కలిగి ఉండేది. ఇది బెల్ట్ డ్రైవ్‌తో కూడిన 3 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభించేది. ఆ తర్వాత 1913లో, కంపెనీ తన మొదటి టూ-స్ట్రోక్ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టింది, దీనికి వెలోసెట్ నిక్ అని పేరు పెట్టారు. అదే పేరుతో, కంపెనీ తన తదుపరి శ్రేణి బైక్‌లను 1925లో విడుదల చేసింది.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన ఈ బ్రిటీష్ బైక్ వెలోసెట్ (Velocette)ను గమనించారా?

చవకైన ఎమ్ సిరీస్ మోటార్‌సైకిళ్ల తయారీ

వెలోసెట్ సిరీస్‌లో కెఎస్ఎస్, కెటిఎస్, కెటిపి మరియు కెఎన్ఎన్ రోడ్‌స్టర్ వంటి మోడళ్లు ఉన్నాయి. కంపెనీ వీటిని 1947 వరకు ఉత్పత్తి చేసింది. ఆ సమయంలో కె సిరీస్ బైక్‌ల ధర ఎక్కువగా ఉన్నందున, కంపెనీ తక్కువ ధర బైక్‌లను విడుదల చేయాలని భావించింది. ఇందులో భాగంగా, 1934లో కొత్త ఎమ్ సిరీస్ ఓవర్‌హెడ్ వాల్వ్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో, కంపెనీ 350 సిసి ఇంజన్ సామర్థ్యంతో ఎమ్ఏసి 350 మరియు 500 సిసి ఇంజన్ సామర్థ్యం కలిగిన ఎమ్ఎస్ఎస్ 500 బైక్‌లను తయారు చేసింది.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన ఈ బ్రిటీష్ బైక్ వెలోసెట్ (Velocette)ను గమనించారా?

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏం జరిగింది?

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వెలోసెట్ కంపెనీ చాలా వేగంగా వృద్ధి చెందింది అయితే, అంతే వేగంగా తన వ్యాపారాన్ని కూడా మూసివేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కంపెనీ 192 సిసి ఇంజన్ సామర్థ్యం గల వాటర్ కూల్డ్ ఫ్లాట్ ట్విన్ ఇంజన్‌ను రూపొందించింది. ఈ బైక్‌ను బ్రిటిష్ పోలీసులు ఎక్కువగా ఉపయోగించేవారు. ఆ తరువాతి సంవత్సరాలలో, కంపెనీ అనేక కొత్త మోడళ్లను పరిచయం చేసింది. కానీ ఏం జరిగిందో ఏమో ఈ సమయంలో కంపెనీ అనేక సమస్యలను ఎదుర్కొంది. చివరికి 1971లో కంపెనీ అధికారికంగా తమ బైక్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది.

Article Published On: Monday, March 28, 2022, 16:29 [IST]
English summary
Jr ntr rides velocette vintage motorcycle in rrr movie lets look into the history of this british bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+