ఈ కవాసకి బైక్‌ని 3 ఏళ్ల పిల్లవాడు కూడా సులువుగా రైడ్ చేసేయొచ్చు..!

సాధారణంగా టూవీలర్లు పెద్దవారికి మాత్రమే, వాటిని నడిపేటప్పుడు వచ్చే సరదా ఏంటో చెప్పడానికి మాటలు సరిపోవు. అయితే, ఈ అనుభవాన్ని చిన్న పిల్లలకు కూడా అందించాలనే ఉద్దేశ్యంతో కవాసకి ఇప్పుడు ఓ సరికొత్త కిడ్స్ ఎలక్ట్రిక్ బైక్ తో ముందుకు వచ్చింది. ఇది చిన్న పిల్లలు కూడా సులువుగా నడపగలిగే బ్యాలెన్సింగ్ బైక్ మరియు వారు దీన్ని ఖచ్చితంగా ఇష్టపడతారు. కొత్త 2023 కవాసకి ఎలక్ట్రోడ్ (2023 Kawasaki Elektrode) ఎలక్ట్రిక్ బ్యాలెన్స్ బైక్ 3 నుండి 8 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల కోసం రూపొందించినది. కవాసకి ఇటీవలే దీనిని గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది.

ఈ కవాసకి బైక్‌ని 3 ఏళ్ల పిల్లవాడు కూడా సులువుగా రైడ్ చేసేయొచ్చు..!

కవాసకి ఎలక్ట్రోడ్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేసే చిన్న బ్యాలెన్స్ బైక్, ఇది చాలా చిన్న వయస్సులోనే పిల్లలకు మోటార్‌సైకిల్ రైడింగ్ కళలో శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించబడినది. ప్రస్తుతం, రోడ్డుపై ప్రయాణించే వారిలో చాలా మంది పెద్దయ్యాక ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకున్న వారే. అందుకే చాలా మంది తొలినాళ్లలో చిన్న చిన్న పొరపాట్లను చేస్తుంటారు. ఈ నేపథ్యంలో టూవీలర్ రైడింగ్ కళను చిన్న వయస్సులోనే నేర్చుకుని, పెద్దయ్యాక నైపుణ్యమైన రైడర్లు మారాలనుకునే వారి కోసం కవాసకి ఈ చిన్న సైజు ఇ-బైక్ ను రూపొందించింది.

ఈ కవాసకి బైక్‌ని 3 ఏళ్ల పిల్లవాడు కూడా సులువుగా రైడ్ చేసేయొచ్చు..!

ముఖ్యంగా మోటార్‌సైకిల్ రైడింగ్‌ను వృత్తిగా ఎంచుకోవాలనునే వారికి ఇదొక మంచి అవకాశం. పిల్లలు మెరుగ్గా ప్రయాణించడంలో సహాయపడటానికి, అనేక తయారీదారులు వివిధ ఇంజన్ స్పెక్స్‌తో మినీ-బైక్‌లను విడుదల చేశారు. అయితే, కవాసకి ఎలక్ట్రోడ్ వంటి బ్యాలెన్స్ బైక్‌తో నిజమైన అభ్యాసం ప్రారంభమవుతుంది. ఎలక్ట్రోడ్ మరియు ఇతర బ్యాలెన్స్ బైక్‌ల మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, కవాసకి ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది.

ఈ కవాసకి బైక్‌ని 3 ఏళ్ల పిల్లవాడు కూడా సులువుగా రైడ్ చేసేయొచ్చు..!

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లో 250 వాట్ బ్రష్‌లెస్ డిసి హబ్-మౌంటెడ్ మోటార్ ఉంటుంది. ఇది పూర్తిగా సీల్ చేయబడి ఉంటుంది కాబట్టి ఇది పూర్తిగా జలనిరోధితంగా (వాటర్‌ప్రూఫ్‌గా) ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఫ్రేమ్ లోపల మౌంట్ చేయబడిన 36 వోల్ట్ 5.1 యాంప్స్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. కవాసకి పేర్కొన్న దాని ప్రకారం, ఈ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు 2.5 గంటల పాటు దీనిని నిరంతరాయం నడపవచ్చు. అలాగే, ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి కూడా 2.5 గంటల సమయం పడుతుంది.

ఈ కవాసకి బైక్‌ని 3 ఏళ్ల పిల్లవాడు కూడా సులువుగా రైడ్ చేసేయొచ్చు..!

ఇ-బైక్ ముందు వైపున ఫ్రేమ్ యొక్క దిగువ భాగంలో బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఓ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ దాని స్లిమ్ హార్డ్-టెయిల్ మరియు చంకీ టాప్ సెక్షన్‌తో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫ్రంట్ ఎండ్‌లో కూడా ఎటువంటి సస్పెన్షన్‌ సెటప్ ఉండదు. ముందు భాగంలో, కవాసకి యొక్క ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ రేంజ్ లాగా, రైడర్ రేసింగ్ నంబర్‌ను అతికించడానికి తెల్లటి ఖాళీ స్థలం ఉంటుంది. రంగు మరియు గ్రాఫిక్స్ స్కీమ్ కూడా కవాసకి దాని KX మరియు KLX శ్రేణి బైక్‌లకు సమానంగా ఉంచింది.

ఈ కవాసకి బైక్‌ని 3 ఏళ్ల పిల్లవాడు కూడా సులువుగా రైడ్ చేసేయొచ్చు..!

ఈ ఎలక్ట్రిక్ బైక్ లోని రైడింగ్ పొజిషన్లను కూడా రైడర్ అవసరాలకు అనుగుణంగా సులభంగా సర్దుబాటు చేయవచ్చు. సీట్ మరియు హ్యాండిల్‌బార్ ఫీచర్ అడ్జస్టబిలిటీ మరియు హ్యాండిల్‌బార్‌ని ఇతర డిజైన్‌ల కోసం కూడా మార్చుకోవచ్చు. పనితీరు పరంగా కూడా కవాసకి ఎలక్ట్రోడ్ ఏమాత్రం తగ్గదు. ఇందులో లో, మీడియం మరియు హై వంటి పలు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ప్రతి మోడ్‌లో గరిష్ట వేగం వరుసగా 8km/h, 12km/h మరియు 20km/h గా ఉంటుంది. కవాసకి ఎలక్ట్రోడ్ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే రైడ్ మోడ్ స్విచ్ చేయబడుతుంది మరియు రైడ్ మోడ్‌ల కోసం పాస్‌వర్డ్ లాక్ కూడా ఉంటుంది.

ఈ కవాసకి బైక్‌ని 3 ఏళ్ల పిల్లవాడు కూడా సులువుగా రైడ్ చేసేయొచ్చు..!

ఫలితంగా, ఎలక్ట్రోడ్‌ను నడుపుతున్న పిల్లల తల్లిదండ్రులు ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క వేగాన్ని మరియు రైడ్ మోడ్ ను లాక్ చేసే అవకాశం ఉంటుంది. అవసరం లేదనుకుంటే, ఈ ఎలక్ట్రిక్ మోటారును స్విచ్ ఆఫ్ చేసి, దానిని సంప్రదాయ బ్యాలెన్స్ బైక్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో కవాసకి ఎలక్ట్రోడ్ ధర 1,099 డాలర్లు ( మనదేశ కరెన్సీలో సుమారు రూ. 85,697). ప్రస్తుతానికి ఇది ఇంకా భారతీయ మార్కెట్లో ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఈ కవాసకి బైక్‌ని 3 ఏళ్ల పిల్లవాడు కూడా సులువుగా రైడ్ చేసేయొచ్చు..!

కవాసకి ఎలక్ట్రోడ్ ఇ-బైక్ చాలా చిన్న వయస్సులో వారి రైడింగ్ వృత్తిని ప్రారంభించే పిల్లలకు ఇదొక సరైన సాధనం. ఈ ఎలక్ట్రిక్ బైక్ చాలా తేలికైనది, చురుకైనది మరియు మంచి వేగాన్ని కూడా కలిగి ఉంటుంది. ఆఫ్-రోడ్ రైడింగ్ ప్రపంచంలో ఇది వారికి మొదటి అడుగుగా ఉంటుంది మరియు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి, టూవీలర్ ను నడిపే సరదా పెద్దలకు మాత్రమే ఎందుకు ఉండాలి?

More from DriveSpark

Article Published On: Wednesday, June 15, 2022, 13:19 [IST]
English summary
Kawasaki elektrode an exclusive e bike for kids revealed details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+