కొత్త 2022 కవాసకి నింజా 300 (2022 Kawasaki Ninja 300) విడుదల: ధర, ఫీచర్లు

జపనీస్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కవాసకి (Kawasaki), భారత మార్కెట్లో తమ సరికొత్త మోడల్ నింజా 300 (2022 Kawasaki Ninja 300) స్పోర్ట్స్ బైక్ ను విడుదల చేసింది. మార్కెట్లో కొత్త 2022 కవాసకి నింజా 300 ధర రూ. 3.37 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. గతంలో విక్రయించబడిన పాత మోడల్ నింజా 300 ధర రూ. 3.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. పాత మోడల్‌ తో పోలిస్తే, ఈ కొత్త మోడల్ ధర రూ.13,000 పెరిగింది. ఈ కొత్త 2022 మోడల్ లో కంపెనీ కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు కొత్త పెయింట్ స్కీమ్‌ లను పరిచయం చేసింది.

కొత్త 2022 కవాసకి నింజా 300 (2022 Kawasaki Ninja 300) విడుదల: ధర, ఫీచర్లు

కవాసకి బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఈ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ కూడా ఒకటి. అయితే, కంపెనీ ఇందులో చేసిన అప్‌డేట్స్ పరంగా బైక్ ఔత్సాహికులను నిరుత్సాహపరిచందనే చెప్పాలి. ఈ కొత్త 2022 మోడల్ కేవలం కాస్మెటిక్ మార్పులు మినహా కంపెనీ వేరే ఏ ఇతర మార్పులు చేయలేదు. కొత్త 2022 కవాసకి నింజా 300 ఇప్పుడు మూడు సరికొత్త రంగులలో లభిస్తుంది. వీటిలో కవాసకి సిగ్నేచర్ కలర్ లైమ్ గ్రీన్‌ తో పాటుగా క్యాండీ లైమ్ గ్రీన్ మరియు ఎబోనీ అనే మరో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

కొత్త 2022 కవాసకి నింజా 300 (2022 Kawasaki Ninja 300) విడుదల: ధర, ఫీచర్లు

నింజా 300 క్యాండీ లైమ్ గ్రీన్ మరియు ఎబోనీ పెయింట్ స్కీమ్స్ పై కంపెనీ కొత్త గ్రాఫిక్స్ ను జోడించింది. ఈ అప్‌డేటెడ్ బాడీ గ్రాఫిక్స్ ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు ఫ్యూయెల్ ట్యాంక్‌ పై ప్రధానంగా కనిపిస్తాయి. ఇక, లైమ్ గ్రీన్ కలర్ విషయానికి వస్తే, ఇది మునుపటి 2021 ఎడిషన్ మాదిరిగానే అదే పాత గ్రాఫిక్‌ లను కలిగి ఉంటుంది. కవాసకి తమ నింజా 300 బైక్ ను చివరిసారిగా మార్చి 2021 లో అప్‌డేట్ చేసింది. ఆ సమయంలో ఇందులోని బిఎస్4 ఇంజన్ స్థానంలో కంపెనీ కొత్త బిఎస్6 ఇంజన్ ను ప్రవేశపెట్టింది.

కొత్త 2022 కవాసకి నింజా 300 (2022 Kawasaki Ninja 300) విడుదల: ధర, ఫీచర్లు

కాగా, ఇప్పుడు మరోసారి అప్‌డేట్ చేయబడిన కొత్త 2022 కవాసకి నింజా 300 మోడల్ లో యాంత్రిక పరంగా మరియా మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేవు. అలాగే, ఇందులోని ఫీచర్లు కూడా మారవు. ఈ బైక్‌లో 296 సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 36 బిహెచ్‌పి శక్తిని మరియు 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 26.1 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్పర్ క్లచ్ మరియు అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2022 కవాసకి నింజా 300 (2022 Kawasaki Ninja 300) విడుదల: ధర, ఫీచర్లు

కొత్త కవాసకి నింజా 300 యొక్క 2021 ఎడిషన్ స్టీల్ ట్యూబ్ డైమండ్ ఫ్రేమ్‌ పై తయారైంది. ఈ కొత్త 2022 మోడల్ కూడా ఇదే ఫ్రేమ్ ను ఉపయోగిస్తుంది. కవాసకి నింజా 300 బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు 5 దశల్లో సర్దుబాటు చేయగల మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. అలాగే, రెండు చక్రాల పై డ్యూయల్ పిస్టన్ పెటల్ డిస్క్ బ్రేక్‌లు, ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ మొదలైన విషయాలను ఇందులో చెప్పుకోవచ్చు.

కొత్త 2022 కవాసకి నింజా 300 (2022 Kawasaki Ninja 300) విడుదల: ధర, ఫీచర్లు

ఫీచర్ల విషయానికొస్తే, కొత్త మోడల్ నింజా 300 గత మోడల్ మాదిరిగానే అదే డ్యూయల్ పాడ్ హాలోజన్ హెడ్‌లైట్ యూనిట్, ఎల్ఈడి లైటింగ్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, మరియు అసిస్ట్ ఫంక్షన్‌తో స్లిప్పర్ క్లచ్ మరియు సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ వంటి ప్రాథమిక ఫీచర్లను పొందుతుంది. కవసాకి తమ నింజా 300 స్పోర్ట్స్ బైక్ ను భారతదేశంలోనే స్థానికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది ఈ విభాగంలో టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 (TVS Apache RR 310) మరియు కెటిఎమ్ ఆర్‌సి 390 (KTM RC 390) వంటి ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్‌లతో పోటీపడుతుంది.

కొత్త 2022 కవాసకి నింజా 300 (2022 Kawasaki Ninja 300) విడుదల: ధర, ఫీచర్లు

కొత్త 2022 కవాసకి నింజా 300 బైక్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు భారతదేశంలోని అన్ని కవాసకి అధీకృత డీలర్‌షిప్‌ లలో కానీ లేదా కవాసకి ఇండియా అధీకృత వెబ్‌సైట్ నుండి కానీ కొత్త నింజా 300 బైక్ ను బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ బైక్ డెలివరీలు ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

కొత్త 2022 కవాసకి నింజా 300 (2022 Kawasaki Ninja 300) విడుదల: ధర, ఫీచర్లు

ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేయనున్న కవాసకి

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్రపంచంలోని అనేక ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో, జపాన్‌కు చెందిన బైక్‌ల తయారీ సంస్థ కవాసకి కూడా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ పై దృష్టి సారించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం కంపెనీ తన ప్రణాళికలను కూడా వెల్లడించింది. కవాసకి వచ్చే 2035 నాటికి పెట్రోల్ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తామని, వాటి స్థానంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అందిస్తామని కంపెనీ తెలిపింది.

కొత్త 2022 కవాసకి నింజా 300 (2022 Kawasaki Ninja 300) విడుదల: ధర, ఫీచర్లు

కవాసకి పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ బ్రాండ్ ముందుగా తమ ఎలక్ట్రిక్ వాహనాలను జపాన్ మరియు యూరప్ మార్కెట్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇవి క్రమంగా ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో ప్రవేశపెట్టబడుతాయి. ఓ నివేదిక ప్రకారం, కవాసకి ఇప్పటికే తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్ ‌ను తయారు చేయడం కూడా ప్రారంభించింది. ఈ జపనీస్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్ యొక్క కాన్సెప్ట్ మోడల్‌ ను 2019లో ఇటలీలోని మిలన్ లో జరిగి EICMA మోటార్‌సైకిల్ షోలో ప్రదర్శించింది.

Article Published On: Friday, April 29, 2022, 9:02 [IST]
English summary
Kawasaki india launches new 2022 ninja 300 price specs features updates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+