భారత్‌లో బడ్జెట్ బైక్ (Kawaski W175) ను విడుదల చేసేందుకు కవాసకి ప్లాన్స్.. ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..

జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి (Kawasaki), భారతదేశంలో తిరిగి బడ్జెట్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకప్పుడు, భారతదేశంలో బజాజ్ ఆటోతో చేతులు కలిపి బడ్జెట్ మోటార్‌సైకిళ్లను విక్రయించిన కవాసకి, ఇప్పుడు కేవలం ప్రీమియం హై-ఎండ్ మోటార్‌సైకిళ్లను మాత్రమే విక్రయిస్తోంది. అయితే, ఈ జపనీస్ టూవీలర్ కంపెనీ ఇప్పుడు మాస్ మార్కెట్ సెగ్మెంట్‌పై కన్నేసింది. త్వరలోనే ఓ కొత్త కమ్యూటర్ బైక్‍‌ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

Recommended Video

కవాసకి 2022 జెడ్650 బైక్ యొక్క సమాచారం

భారత మార్కెట్లో కవాసకి డబ్ల్యూ175 (Kawaski W175) స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ కొత్త కవాసకి బైక్ విడుదలకు ముందే దాని బ్రోచర్ మరియు స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇవి రాబోయే మోటార్‌సైకిల్ యొక్క స్పెసిఫికేషన్‌లు ఫిగర్‌లు మరియు ఇతర ఫీచర్‌లను వెల్లడిస్తున్నాయి. ఇది కవాసకి బేర్ బేసిక్స్ మోటార్‌సైకిల్‌ను గుర్తుకు తెస్తుందని, భారత మార్కెట్లో భారీ అమ్మకాలను తీసుకురాగలదని స్పష్టంగా తెలియజేస్తుంది.

భారత్‌లో బడ్జెట్ బైక్ (Kawaski W175) ను విడుదల చేసేందుకు కవాసకి ప్లాన్స్.. ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోటార్‌సైకిల్ తయారీదారులలో కవాసకి కూడా ఒకటి. ఈ బ్రాండ్ విక్రయించే ZX-6R, ZX-10R, ZX-12R, ZX-14R, H2R మొదలైన మోటార్‌సైకిళ్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యాయి. ఈ మోటార్‌సైకిళ్లు అద్భుతమైన పనితీరుతో తమ సంబంధిత విభాగాలను పునర్నిర్వచించాయి. ఇవి వేగవంతమైన మరియు ఖరీదైన మోటార్‌సైకిళ్లు.

భారత్‌లో బడ్జెట్ బైక్ (Kawaski W175) ను విడుదల చేసేందుకు కవాసకి ప్లాన్స్.. ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..

అయితే, కవాసకి చరిత్రను ఓసారి తిరగేస్తే, ఈ బ్రాండ్ మొదట్లో సాధారణ కొనుగోలుదారులకు కూడా అందుబాటులో ఉండే ప్రాథమిక మోటార్‌సైకిళ్లను విక్రయించేది. కవాసకి 1984లో బజాజ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కవాసకి మరియు బజాజ్ కంపెనీలు కలిసి KB100, 4S ఛాంపియన్, KB125, బాక్సర్, కాలిబర్ మొదలైన మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేశాయి. అయితే, బజాజ్-కవాసకిలు ఉత్పత్తి చేసిన ఈ మోటార్‌సైకిళ్లన్నీ కూడా అధిక-పనితీరు గల పెర్ఫార్మెన్స్ బైక్‌లు కావు. కానీ, ఇవి ఆ సమయంలో అత్యధికంగా అమ్ముడయ్యాయి మరియు కవాసకి పనితనాన్ని భారతీయులకు పరిచయం చేశాయి.

భారత్‌లో బడ్జెట్ బైక్ (Kawaski W175) ను విడుదల చేసేందుకు కవాసకి ప్లాన్స్.. ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..

అయితే, కవాసకి ఆ తర్వాతి కాలంలో భారతదేశంలో బడ్జెట్ మోటార్‌సైకిళ్లకు గుడ్‌బై చెప్పేసి, కేవలం హై-ఎండ్ ప్రీమియం స్పోర్ట్స్ బైక్‌లను మాత్రమే విక్రయించడం మొదలు పెట్టింది. అయితే, ఈ పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడాలంటే, అన్ని విభాగాలలోని కస్టమర్లకు అనువైన ఉత్పత్తులను అందించడం చాలా అవసరమని కవాసకి తెలుసుకుంది. అందుకే, ఇప్పుడు కవాసకి W175 రెట్రో మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రారంభానికి ముందు, మోటార్‌సైకిల్‌కు సంబంధించిన బ్రోచర్ లీక్ అయింది.

భారత్‌లో బడ్జెట్ బైక్ (Kawaski W175) ను విడుదల చేసేందుకు కవాసకి ప్లాన్స్.. ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..

ఈ బ్రోచర్ ప్రకారం, కవాసకి డబ్ల్యూ175 ఎబోనీ బ్లాక్ మరియు స్పెషల్ ఎడిషన్ బ్లాక్ అండ్ రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఈ మోటార్‌సైకిల్‌పై ఎలాంటి ఫ్యాన్సీ పరికరాలు ఉండవు, ఇదొక సాధారణ క్లాసిక్ (పాత కాలపు) మోటార్‌సైకిల్ మాదిరిగా ఉంటుంది. ఇందులోని లైటింగ్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చాలా ప్రాథమికంగా ఉన్నాయి. హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, హాలోజన్ ఇండికేటర్లు, హాలోజన్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్లు, అనలాగ్ స్పీడోమీటర్, అనలాగ్ ఓడోమీటర్, అనలాగ్ ట్రిప్ మీటర్ వంటి అంశాలను ఈ బైక్ లో గమనించవచ్చు.

భారత్‌లో బడ్జెట్ బైక్ (Kawaski W175) ను విడుదల చేసేందుకు కవాసకి ప్లాన్స్.. ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..

డిజైన్ విషయానికి వస్తే, కవాసకి డబ్ల్యూ175 ముందు భాగంలో వృత్తాకారపు హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్-ఆకారంలో ఉండే ఇంధన ట్యాంక్, సింగిల్-పీస్ రిబ్బెడ్ సీట్, ఫ్యూయెల్ ట్యాంక్ పై రైడర్ థై సపోర్ట్ కోసం సాఫ్ట్ ప్యాడ్స్, సగం మాత్రం ఉండే చైన్ కేస్, పొట్టిగా ఉండే వెనుక డిజైన్, స్పోక్డ్ వీల్స్, గుండ్రటి సైడ్ మిర్రర్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పాత కాలపు క్లాసిక్ మోటార్‌సైకిల్‌ను గుర్తుకు తెస్తాయి. ఇంజన్ కూడా ప్రాథమికంగా కనిపిస్తుంది మరియు ఎగ్జాస్ట్ కూడా పాత-కాలపు యూనిట్ మాదిరిగా ఉంటుంది.

భారత్‌లో బడ్జెట్ బైక్ (Kawaski W175) ను విడుదల చేసేందుకు కవాసకి ప్లాన్స్.. ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కవాసకి డబ్ల్యూ175 ఎయిర్-కూల్డ్, 177సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉండనుంది. ఈ ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 13 బిహెచ్‌పి శక్తిని మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ పెర్ఫార్మెన్స్ ఫిగర్స్ ని చూస్తుంటే, కొత్త కవాసకి బైక్ ఇతర స్పోర్ట్స్ బైక్ ల మాదిరిగా మంచి పనితీరును కలిగి ఉండబోదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఈ బైక్ కేవలం 135 కిలోగ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది, కాబట్టి కొత్త W175 బైక్ రైడ్ చేయడానికి చాలా వినోదాత్మకంగా ఉంటుందని అర్థమవుతోంది.

భారత్‌లో బడ్జెట్ బైక్ (Kawaski W175) ను విడుదల చేసేందుకు కవాసకి ప్లాన్స్.. ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..

కవాసకి డబ్ల్యూ175 మోటార్‌సైకిల్ పాతకలు మోడళ్ల మాదిరిగా ట్యూబ్ కలిగిన టైర్‌లతో స్పోక్డ్ వీల్స్‌ను కలిగి ఉంది. అయితే, బ్రేకింగ్ విషయంలో మాత్రం కొంచెం అధునాతనంగానే ఉంది. ఇందులో ముందు వైపు డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు డ్రమ్ ఉంటాయి. ఇక సస్పెన్షన్ ను గమనిస్తే, ముందు భాగంలో పాత కాలపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో కూడా ట్విన్ షాక్‌ అబ్జార్వర్లు ఉంటాయి. ప్రస్తుతం కవాసకి డబ్ల్యూ175 కి భారత మార్కెట్లో నేరుగా ఎలాంటి పోటీ లేదు. సెప్టెంబర్ 2022 చివరి నాటికి ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Kawasaki india plans to launch w175 scrambler bike soon specs leaked online
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X