Just In
- 36 min ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 1 hr ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 3 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
- 4 hrs ago
సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!
Don't Miss
- Sports
India Playing XI vs ZIM 1st ODI: రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! ఇసాన్ కిషన్ డౌట్!
- Technology
ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్వేర్ అప్డేట్ని పిక్సెల్ ఫోన్ల కోసం విడుదల చేసిన గూగుల్...
- News
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రఘాతుకం.. యాపిల్ తోటలో కాశ్మీరీ పండిట్ హత్య, సోదరుడికి తీవ్రగాయాలు
- Movies
Sita Ramam 11 Days Collections: ఫస్ట్ డే రేంజ్ లో 11వ రోజు కలెక్షన్స్.. మొత్తం ప్రాఫిట్ ఎంతంటే?
- Finance
SBI: ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు.. ఆ కస్టమర్లకు నెలకు మూడుసార్లు.. 10 రకాల సేవలు ఉచితంగా..
- Lifestyle
Exercise and Sleep: నిద్రపై వ్యాయామ ప్రభావం.. పడుకునే ముందు చేయవచ్చా?
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
రైడింగ్‌కి మీరు సిద్దమేనా.. మార్కెట్లో కొత్త 'కవాసకి నింజా 400' విడుదలైంది: వివరాలు
ప్రముఖ జపనీస్ బైక్ తయారీ సంస్థ 'కవాసకి' (Kawasaki) ఎప్పటికప్పుడు దేశీయ విఫణిలో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు మార్కెట్లో కొత్త 'నింజా 400' (Ninja400) బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'కవాసకి నింజా400' (Kawasaki Ninja400) డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డిఆర్ఎల్, ఫంకీ రియర్ వ్యూ మిర్రర్స్, వైడ్ హ్యాండిల్‌బార్, విండ్‌స్క్రీన్, స్క్వీకబుల్ ఫ్యూయల్ ట్యాంక్ మరియు స్ప్లిట్-సీట్ డిజైన్ కలిగి ఉంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త నింజా 400 బైక్ రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి లైమ్ గ్రీన్ మరియు మెటాలిక్ కార్బన్ గ్రే కలర్స్. ఈ రెండు కలర్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ టిఎఫ్టి డిస్ప్లే స్థానంలో సెమీ-డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంటేషన్ కలిగి ఉంటుంది. ఇందులో అనలాగ్ టాకొమీటర్, ఎడమవైపున వార్నింగ్ లైట్ ఉంటాయి, కుడివైపు మల్టీ ఫంక్షన్ ఎల్సిడి స్క్రీన్ వంటి కూడా ఉన్నాయి.

కొత్త 'కవాసకి నింజా400' బైక్ 399 సిసి, లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్, డిఓసిహెచ్, 8 వాల్వ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 44.7 బిహెచ్పి పవర్ మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో జతచేయబడి ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా మంచి పనితీరుని అందిస్తుంది. కావున వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

నింజా 400 బైక్ యొక్క సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ వంటి వాటిని గమనించినట్లయితే.. ఈ బైక్ ముందు భాగంలో 120 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో 130 మిమీ స్వింగార్మ్ పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్ 286 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు 193 మీమీ రియర్ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. ఇందులో డ్యూయెల్ ఛానల్ ఏబీఎన్ ప్రామాణికంగా అందుబాటులో ఉంటుంది.

ఈ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1,990 మిమీ పొడవు, 710 మిమీ వెడల్పు, 1,120 ఎత్తు మరియు వీల్ బేస్ 1,370 మిమీ వరకు ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే.. ఇది 140 మిమీ వరకు ఉంటుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్ల వరకు ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'కవాసకి నింజా400' కెటిఎమ్ ఆర్సి390 (KTM RC 390) మరియు టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 (TVS Apache RR310) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
ఇదిలా ఉండగా ఇటీవల కాలంలోనే 2022 కవాసకి నింజా 300 స్పోర్ట్స్ బైక్ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 3.37 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). 2022 కవాసకి నింజా 300 దాని మునుపటి మోడల్ కంటే కూడా దాదాపు రూ. 13000 ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. ఈ బైక్ మంచి డిజైన్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంది.

2022 కవాసకి నింజా 300 బైక్ 296 సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 36 బిహెచ్పి పవర్ మరియు 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 26.1 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్పర్ క్లచ్ మరియు అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో కవాసకి విడుదల చేసిన కొత్త నింజా400 బైక్ మంచి కలర్ ఆప్సన్స్ తో చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే ఈ కొత్త బైక్ దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుంది అనేది తెలియరావాలి. ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు కార్లను గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.