కవాసకి నింజా 300 కొనుగోలుపై రూ. 10,000 తగ్గింపు: ఈ ఆఫర్ అప్పటి వరకు మాత్రమే..
భారతదేశంలో ఇప్పటికే చాలా కంపెనీలు 2023 జనవరి ప్రారంభం నుంచే తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే, అయితే కొన్ని కంపెనీలు 2022 డిసెంబర్ నెలలో అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఇందులో కవాసకి కంపెనీ కూడా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కవాసకి ఇండియా ఈ సంవత్సరం చివరలో తన నింజా 300 బైకు మీద రూ. 10,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అఫర్ ఈ నెల (2022 డిసెంబర్) 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసినట్లతే కొనుగోలుదారులు రూ. 3.30 లక్షల ధర వద్ద నింజా 300 సొంతం చేసుకోవచ్చు. నిజానికి కవాసకి నింజా 300 ధర రూ. 3.40 లక్షలు.

కవాసకి నింజా 300 దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న కంపెనీ మోడల్. ఇది సిగ్నేచర్ కలర్ లైమ్ గ్రీన్ తో పాటుగా క్యాండీ లైమ్ గ్రీన్ మరియు ఎబోనీ అనే కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన పనితీరుని అందించడానికి అనుకూలంగా నింజా 300 రూపొందించబడింది. కావున మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఆఫర్ వల్ల మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుంది.
కవాసకి నింజా 300 బైక్‌లో 296 సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉపయోగించబడింది. ఈ ఇంజన్ గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 36 బిహెచ్‌పి పవర్ మరియు 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 26.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్పర్ క్లచ్ మరియు అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది.
కొత్త నింజా 300 గత మోడల్ మాదిరిగానే అదే డ్యూయల్ పాడ్ హాలోజన్ హెడ్‌లైట్ యూనిట్, ఎల్ఈడి లైటింగ్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ అసిస్ట్ ఫంక్షన్‌తో స్లిప్పర్ క్లచ్ మరియు సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ప్రాథమిక ఫీచర్లను పొందుతుంది. కవాసకి తమ నింజా 300 స్పోర్ట్స్ బైక్ ను భారతదేశంలోనే స్థానికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది అపాచే ఆర్ఆర్ 310 మరియు కెటిఎమ్ ఆర్‌సి 390 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
కొత్త కవాసకి నింజా 300 స్టీల్ ట్యూబ్ డైమండ్ ఫ్రేమ్ ఆధారంగా రూపొందించబడింది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు 5 వే అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. అంతే కాకుండా రెండు చక్రాల పై డ్యూయల్ పిస్టన్ పెటల్ డిస్క్ బ్రేక్‌లు, ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి పొందుతుంది. ఇవన్నీ రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
కవాసకి ఇండియా ప్రస్తుతం తన నింజా 300 బైకు మీద మాత్రమే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కంపెనీ యొక్క ఇతర మోడల్స్ కి వర్తించే అవకాశం లేదు. అంతే కాకుండా ఈ అఫర్ 2022 డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తప్పకుండా నింజా 300 కొనుగోలుదారులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. 2023 జనవరి నుంచి ఈ బైక్ ధర పెరగవచ్చు లేదా అదే మునుపటి ధరతో కొనసాగవచ్చు.
కవాసకి తన నింజా 300 అమ్మకాలను ఈ సంవత్సరం చివరలో కూడా పెంచుకోవడానికి మరియు కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు ఆకర్శించడానికి ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ బైక్ కొనాలనుకునే కస్టమర్లు ఈ నెల 31 లోపే కొనుగోలు చేయాలి, లేకుంటే రానున్న కొత్త సమ్వత్సరంలో ఈ ఆఫర్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








