కవాసకి వెర్సిస్ 650 (Versys 650) బైక్‌పై రూ.70,000 డిస్కౌంట్.. త్వరపడండి, కొద్ది సమయం మాత్రమే!
జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి ఇండియా (Kawasaki India) భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ కవాసకి వెర్సిస్ 650 (Kawasaki Versys 650)పై భారీ తగ్గింపును అందిస్తోంది. కంపెనీ ఇప్పుడు ఈ మోటార్‌సైకిల్ పై రూ. 70,000 విలువైన ప్రత్యేక తగ్గింపు వోచర్‌తో విక్రయిస్తోంది. ఈ వోచర్ ను బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర ట్యాగ్‌తో రెడీమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, మార్కెట్లో కవాసకి వెర్సిస్ 650 బైక్ ధర రూ. 7.15 లక్షల (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. ఈ వోచర్ ను రెడీమ్ చేసిన తర్వాత దీని ధర రూ.6.45 లక్షల (ఎక్స్-షోరూమ్)కు తగ్గుతుంది.

ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు దీన్ని పొందేందుకు చివరి తేదీ 30 ఏప్రిల్, 2022 అని కవాసకి ఇండియా తెలిపింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన EICMA మోటార్‌సైకిల్ షోలో కవాసకి ఆవిష్కరించిన తమ సరికొత్త 2022 మోడల్ వెర్సిస్ 650 బైక్ త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ పాత మోడల్ పై ఈ భారీ తగ్గింపును అందిస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త 2022 వెర్షన్ కవాసకి వెర్సిస్ 650 త్వరలోనే పాత మోడల్ స్థానాన్ని భర్తీ చేయనుంది.

అప్‌డేట్ చేయబడిన 2022 మోడల్‌లో రీడిజైన్ చేయబడిన హెడ్‌లైట్ డిజైన్ ఉంటుంది, ఇది అవుట్‌గోయింగ్ వెర్షన్‌లో కనిపించే హాలోజన్ సెటప్‌కు బదులుగా కొత్త ఎల్ఈడి లైటింగ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, కవాసకి వెర్సిస్ 650 యొక్క లేటెస్ట్ వెర్షన్ బ్లూటూత్-ఆధారిత టిఎఫ్‌టి కలర్ డిస్‌ప్లే కూడా పొందుచుంది. ఇది రైడర్లకు తమ స్మార్ట్‌ఫోన్‌ను మోటార్‌సైకిల్‌తో అనుసంధానించి వివిధ రకాల ఫీచర్లకు యాక్సెస్ పొందేందుకు వీలు కల్పిస్తుంది.

కొత్తగా రాబోయే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కవాసకి వెర్సిస్ 650 మోడల్‌లో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ గా ఎలాంటి మార్పులు ఉండబోవు. ప్రస్తుత మోడల్‌లో ఉపయోగిస్తున్న అదే బిఎస్6 కంప్లైంట్ 650సిసి, పారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ను కొత్త మోడల్ లో కూడా ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 64.8 బిహెచ్‌పి శక్తిని మరియు 60.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లో ఇరు వైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇన్‌వర్టెడ్ ఫ్రంట్ ఫోర్కులు, రియర్ మోనోషాక్, ముందువైపు డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి.

కవాసకి నింజా 300 (Kawasaki Ninja 300) టీజర్ ఆవిష్కరణ:
కవాసకి ఇండియా బ్రాండ్ కి చెందిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ త్వరలోనే భారత మార్కెట్లో తమ సరికొత్త మోడల్ నింజా 300 బైక్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ ఇటీవలే తమ కొత్త నింజా బైక్ కు సంబంధించిన ఓ టీజర్ ఫొటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్‌పై షేర్ చేసింది. కొత్త 2022 కవాసకి నింజా 300 (2022 Kawasaki Ninja 300) ఇప్పుడు కొత్త కాస్మెటిక్ అప్‌గ్రేడ్ లతో పాటుగా కొన్ని ఫీచర్ అప్‌గ్రేడ్ లను కూడా కలిగి ఉండనుంది.

కవాసకి తమ నింజా బైక్ ను చివరిసారిగా మార్చి 2021 లో అప్‌డేట్ చేసింది. ఆ సమయంలో ఇందులోని బిఎస్4 ఇంజన్ స్థానంలో కంపెనీ బిఎస్6 ఇంజన్ ను ప్రవేశపెట్టింది. సమాచారం ప్రకారం, కంపెనీ తమ కొత్త 2022 మోడల్ నింజా 300 బైక్‌కు కాస్మెటిక్ అప్‌డేట్‌లను ఇవ్నుంది. ఇందులో కొత్త కలర్ ఆప్షన్‌లు మరియు కొత్త గ్రాఫిక్స్ కూడా ఉండవచ్చు. అలాగే, నింజా 300తో వచ్చే ఉపకరణాలు (యాక్ససరీలు) మరియు ఇతర యాడ్ కిట్‌లను కూడా కంపెనీ అప్‌డేట్ చేసే అవకాశం ఉంది.

కాగా, కవాసకి నింజా 300 ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ లో మాత్రం పెద్దగా మార్పు ఉండబోదు. ఇది చూడటానికి మునుపటి నింజా 300 మాదిరిగానే కనిపించవచ్చు. ప్రస్తుతం, భారత మార్కెట్లో కవాసకి నింజా 300 ధర రూ. 3.37 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. నింజా 300 అనేది ఈ జపనీస్ బ్రాండ్ నుండి లభిస్తున్న ఎంట్రీ-లెవల్ స్పోర్ట్స్ బైక్. ఇది ఈ విభాగంలో హోండా, కెటిఎమ్, టీవీఎస్ మరియు బజాజ్ ఆటో వంటి కంపెనీలు విక్రయిస్తున్న ప్రీమియం మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది.

ఈ 2022 మోడల్ కవాసకి నింజా 300 బైక్ లో ఇంజన్ పరంగా కూడా ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఇందులోని 296 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 36 బిహెచ్‌పి శక్తిని మరియు 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 26.1 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్ తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. కవాసకి నింజా 300 స్టీల్ ట్యూబ్ డైమండ్ ఫ్రేమ్ పై తయారైంది కాబట్టి ఇది చాలా ధృడంగా మరియు మన్నికగా ఉంటుంది.

ఇందులోని మెకానికల్ అంశాలను గమనిస్తే, బైక్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు 5-దశల సర్దుబాటుతో కూడిన మోనోషాక్ సస్పెన్షన్ యూనిట్, రెండు చక్రాలకు డ్యూయల్ పిస్టన్ పెటల్ డిస్క్ బ్రేక్‌లు, ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైన హైలైట్స్ ఉంటాయి. ఇది లైమ్ గ్రీన్, క్యాండీ లైమ్ గ్రీన్ మరియు ఎబోనీ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ఒకే ట్రిమ్‌లో అందించబడుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications