కవాసకి డబ్ల్యు175 బుక్ చేసుకున్నారా.. డెలివెరీలు స్టార్ట్ అయిపోయాయ్

'కవాసకి ఇండియా' (Kawasaki India) దేశీయ మార్కెట్లో ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో 'డబ్ల్యు175' (W175) బైక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఇప్పుడు ఎట్టకేలకు ఈ బైక్ డెలివరీలను ప్రారభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కవాసకి డబ్ల్యు175 బైక్ ఎబోనీ (స్టాండర్డ్) మరియు స్పెషల్ ఎడిషన్ రెడ్ (స్పెషల్ ఎడిషన్) అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.1,47,000 మరియు రూ.1,49,000. ఇందులో ఒకటి పూర్తిగా బ్లాక్ థీమ్ అయితే, రెండోది రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్ పొందుతుంది. అయితే రెండింటిలోనూ ఫ్రంట్ సస్పెన్షన్, హెడ్‌లైట్ కేసింగ్, ఇంజన్, స్వింగార్మ్ మరియు ఎగ్జాస్ట్ పైప్ వంటి భాగాలు బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

కవాసకి డబ్ల్యు175 డెలివెరీలు స్టార్ట్ అయిపోయాయ్..

కవాసకి డబ్ల్యు175 బైక్ లో 177 సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 13 హెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.2 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. కావున ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది. అంతే కాకుండా ఇంజిన్ బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది.

కవాసకి డబ్ల్యు175 చూడటానికి కొంత వరకు దాని డబ్ల్యు800 ని పోలి ఉంటుంది, ఎందుకంటే డబ్ల్యు175 తన డబ్ల్యు800 నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. ఇందులో రౌండ్ హెడ్‌లైట్, టియర్-డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు బాక్సీ సైడ్ ప్యానెల్ వంటివి W800 ని గుర్తుకు తెస్తాయి. ఇక వెనుక వైపు టెయిల్-లైట్ మరియు ఇండికేటర్స్ వంటి వాటితో పాటు వెనుక భాగంలో ఒక వంపు తిరిగిన ఫెండర్‌ని కూడా చూస్తారు.

కవాసకి డబ్ల్యు175 బైక్ సింగిల్ పీస్ సీటు పొందుతుంది. ఇది మంచి రైడింగ్ పొజిషన్ అందించడం వల్ల రైడర్ అద్భుతమైన రైడింగ్ అనుభూతిని కూడా పొందవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అనలాగ్ స్టైల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ మరియు టర్న్ సిగ్నల్స్‌తో ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంటుంది. మొత్తమ్ మీద ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కవాసకి డబ్ల్యు175 పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 2,006 మిమీ, వీల్‌బేస్ 1,320 మిమీ మరియు సీటు ఎత్తు 790 మిమీ వరకు ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ లో టెలీస్కోపిక్ ఫోర్క్ మరియు ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌ ఉన్నాయి. కావున ఇది ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందుభాగంలో ఒకే డిస్క్ మరియు వెనుకవైపు డ్రమ్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి.

కవాసకి దేశీయ మార్కెట్లో విడుదల చేసిన తన డబ్ల్యు175 చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ బైక్ భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మరియు TVS రోనిన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే దేశీయ మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

కవాసకి డబ్ల్యు175 డెలివరీలపైన మా అభిప్రాయం:

కవాసకి దేశీయ మార్కెట్లో తన 'డబ్ల్యు175' విడుదల చేసినప్పుడు ఈ సంవత్సరం చివరి నాటికి డెలివరీలను ప్రారంభిస్తామని వెల్లడించింది. చెప్పినట్లుగానే కంపెనీ డెలివరీలను ప్రారంభించింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త బైకులు మరియు కొత్త కార్లను గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి. దీని పైన అభిప్రాయాలను కూడా మాతో పంచుకొండి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 14, 2022, 10:01 [IST]
English summary
Kawasaki w175 deliveries started in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+