దేశీయ మార్కెట్లో కొత్త బైక్ విడుదల చేసిన Kawasaki: ధర & వివరాలు
కవాసకి ఇండియా (Kawasaki India) దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త ఉత్పత్తులను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కొత్త కవాసకి జెడ్650ఆర్ఎస్ 50 వ (Kawasaki Z650RS) యానివెర్సరీ ఎడిషన్ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో ఇప్పటికే కవాసకి జెడ్650ఆర్ఎస్ అందుబాటులో ఉంది. దీనిని కంపెనీ 2021 అక్టోబర్‌లో నెలలో విడుదల చేసింది. అయితే ఇప్పుడు కవాసకి యొక్క ఐకానిక్ Z-లైనప్ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా కవాసకి జెడ్650ఆర్ఎస్ 50 వ (Kawasaki Z650RS) యానివెర్సరీ ఎడిషన్ ను రూ. 6,79,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద విడుదల చేసింది. ఈ బైక్ దాని స్టాండర్డ్ బైక్ కంటే కూడా రూ. 7,000 ఎక్కువగా ఉంది.

కవాసకి ఇండియా వెబ్‌సైట్‌లో ఈ స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిల్ బుకింగ్స్ ప్రారంభించింది. డెలివరీలు మార్చి 2022 నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 20 యూనిట్లు మాత్రమే భారత మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కావున కొనుగోలుదారులు త్వరపడాలి. ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, ట్రయంఫ్ ట్రైడెంట్ 660 మరియు హోండా సిబి650ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

కవాసకి జెడ్650ఆర్ఎస్ 50 వ (Kawasaki Z650RS) యానివెర్సరీ ఎడిషన్ కొత్త క్యాండీ డైమండ్ బ్రౌన్ పెయింట్ స్కీమ్ లో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త బైక్ 1972, Z1 యొక్క 'ఫైర్‌బాల్' కలర్ నుంచి ప్రేరణ పొందింది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కవాసకి జెడ్650ఆర్ఎస్ ఇప్పుడు చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. ఇది కొత్త పెయింట్ స్కీమ్‌లో గోల్డ్ అల్లాయ్ వీల్స్, ట్యాంక్‌పై ప్రత్యేక 'జెడ్50వ' బ్యాడ్జింగ్, వెనుక భాగంలో క్రోమ్ గ్రాబ్ రెయిల్‌లు మరియు టెక్స్‌చర్డ్ లెదర్ కవర్‌తో స్పెషల్ సీటును పొందుతుంది.

కొత్త కవాసకి జెడ్650ఆర్ఎస్ 50 వ (Kawasaki Z650RS) యానివెర్సరీ ఎడిషన్ ప్రస్తుతం 649 సిసి లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 68 బిహెచ్‌పి పవర్ మరియు 64 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

కొత్త కవాసకి జెడ్650ఆర్ఎస్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ మరియు 17 ఇంచెస్ స్పోక్ అల్లాయ్ వీల్స్ కలిగింది. అంతే కాకూండా ఈ బైక్ సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ లైటింగ్ మరియు ఏబీఎస్ వంటి వాటిని కూడా పొందుతుంది. ఈ బైక్ వాహన వినియోగదారులకు చాలామంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

కవాసకి ఇండియా ఇటీవల కాలంలో తన కవాసకి Z900 ని కొత్త కలర్ లో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ బైక్ మెటాలిక్ స్పార్క్ బ్లాక్ కలర్‌తో విక్రయించబడుతుంది. కొత్త కలర్ ఆప్షన్‌తో పాటు, కంపెనీ Z900 ధరలను కూడా పెంచింది. కొత్త ధర 2022 జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది.

కొత్త జెడ్900 మోటార్‌సైకిల్ ధరలు రూ. 8.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఇది ప్రస్తుత ధరల కంటే కేవలం రూ. 8,000 ఎక్కువ. కొత్త కలర్స్ మరియు పెరిగిన ధరలు మినహా, మోటార్‌సైకిల్‌లో ఇతర మార్పులు ఏమి లేదు. ఈ బైక్ లో అదే ఫీచర్స్ మరియు ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కలిగి ఉంటుంది.

కొత్త జెడ్900 మోటార్‌సైకిల్ 4.3-ఇంచెస్ TFT కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఆప్సన్స్ పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్ 17-లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ బరువు 212 కేజీల వరకు ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, రెండు పవర్ మోడ్‌లు మరియు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వంటివి ఉన్నాయి.

కవాసకి జెడ్900 బైక్ 948సిసి ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 123.6 బిహెచ్‌పి పవర్ మరియు 98.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. స్పోర్ట్, రెయిన్ మరియు రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను ఈ బైక్ కలిగి ఉంటుంది. కవాసకి కంపెనీ కేవలం జెడ్900 కాకుండా అన్ని మోడళ్ల ధరలను కూడా పెంచినట్లు ఇప్పటికే తెలిపింది.


Click it and Unblock the Notifications