భారత మార్కెట్లో కీవే బెండా వి302సి (Keeway Benda V302C) క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ (Benelli) యాజమాన్యంలో ఉన్న హంగేరియన్ టూవీలర్ బ్రాండ్ కీవే (Keeway) భారత మార్కెట్లో తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని వేగంగా విస్తరిస్తోంది.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

దేశీయ మార్కెట్లో ఇప్పటికే కీవే వియస్టా 300 (Vieste 300) మరియు కీవే సిక్స్టీస్ 300ఐ (Sixties 300i) అనే రెండు స్కూటర్లతో పాటుగా కీవే కె-లైట్ (Keeway K-Lite) అనే క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన ఈ విదేశీ టూవీలర్ కంపెనీ, ఇప్పుడు తాజాగా కీవే బెండా వి302సి (Keeway Benda V302C) అనే క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.

భారత మార్కెట్లో కీవే బెండా వి302సి (Keeway Benda V302C) క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

కీవే ఇండియాకు ఇది (V302C) భారతదేశంలో నాల్గవ ఉత్పత్తి మరియు రెండవ క్రూయిజర్ మోడల్ అవుతుంది. ఈ హంగేరియన్ టూవీలర్ బ్రాండ్ నుండి తాజాగా మార్కెట్లోకి వచ్చిన కొత్త కీవే బెండా వి302సి క్రూయిజర్ మోటార్‌సైకిల్ మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్ ఎంచుకునే కలర్ ఆప్షన్‌ను బట్టి ఈ వి-ట్విన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధరలు మారుతూ ఉంటాయి.

భారత మార్కెట్లో కీవే బెండా వి302సి (Keeway Benda V302C) క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

భారత మార్కెట్లో కీవే బెండా వి302సి ధరలు ఇలా ఉన్నాయి:

* కీవే బెండా వి302సి గ్రే - రూ.3.89 లక్షలు

* కీవే బెండా వి302సి బ్లాక్ - రూ.3.99 లక్షలు

* కీవే బెండా వి302సి రెడ్ - రూ.4.09 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

గడచిన జులై నెలలో కీవే ఇండియా విడుదల చేసిన మొదటి క్రూయిజర్ బైక్ కీవే కె-లైట్ 250వి (Keeway K-Lite 250V)తో పోల్చుకుంటే, కొత్త కీవే బెండా వి302సి బైక్ ధర లక్ష రూపాయాలు అధికంగా ఉంటుంది.

భారత మార్కెట్లో కీవే బెండా వి302సి (Keeway Benda V302C) క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

కీవే కె-లైట్ మరియు బెండా రెండు క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు V-ట్విన్ సెటప్‌ను పొందినప్పటికీ, బెండా వి302సి లో పెద్ద 298 సిసి ట్విన్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్, 4 స్ట్రోక్, 8 వాల్వ్‌ మరియు సింగిల్ ఓవర్‌హెడ్ క్యామ్‌షాఫ్ట్ (SOHC) ఇంజన్ ఉంటుంది. ఈ పెద్ద ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 29.5 హెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 26.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో కీవే బెండా వి302సి (Keeway Benda V302C) క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

కీవే బెండా వి302సి క్రూయిజర్ బైక్‌లోని ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, అల్లాయ్ వీల్స్, గుండ్రని ఆకారంలో ఉండే ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు ఎల్ఈడి టెయిల్‌లైట్, స్లిప్పర్ క్లచ్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ మొదలైన వాటిని కలిగి ఉంటుంది. కీవే బెండా వి302సి క్రూయిజర్ మోటార్‌సైకిల్ వెడల్పాటి పెద్ద టైర్లతో, తక్కువ బాడీ ప్యానెళ్లను మరియు వి-ట్విన్ ఇంజన్‌ను కలిగి ఉండి ఖరీదైన హ్యార్టీ డేవిడ్సన్ వంటి మోటార్‌సైకిళ్లకు చక్కటి ప్రత్యమ్నాయంగా ఉంటుంది.

భారత మార్కెట్లో కీవే బెండా వి302సి (Keeway Benda V302C) క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

బెండా వి302సి బైక్ మెకానిల్స్ ను గమనిస్తే, ఈ బైక్ ముందు భాగంలో 120 మిమీ వీల్ ట్రావెల్ కలిగిన టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ఇది ఆయిల్ డాంపెనర్ మరియు 42 మిమీ వీల్ ట్రావెల్‌తో కూడిన డ్యూయల్ టెలిస్కోపిక్ కాయిల్ స్ప్రింగ్‌ షాక్ అబ్జార్వర్లు ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు సింగిల్ 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు సింగిల్ 240 మిమీ డిస్క్‌ బ్రేకులు ఉంటాయి. ఇవి రెండూ కూడా ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి.

భారత మార్కెట్లో కీవే బెండా వి302సి (Keeway Benda V302C) క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

కీవే వి302సి క్రూయిజర్ బైక్ మొత్తం పొడవు 2120 మిమీ, వెడల్పు 836 మిమీ, ఎత్తు 1050 మిమీ, వీల్‌బేస్ 1420 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 158 మిమీగా ఉంటుంది. భూమి నుండి దీని సీటు ఎత్తు 690 మిమీగా ఉంటుంది. ఇందులో 15 లీటర్ల పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. అలాగే, ముందు వైపు 16 ఇంచ్ అల్లాయ్ వీల్ మరియు దానిపై 120/80-16 ప్రొఫైల్ టైరు, అలాగే వెనుక వైపు 15 ఇంచ్ అల్లాయ్ వీల్ మరియు దానిపై 150/80-15 ప్రొఫైల్ టైరు అమర్చబడి ఉంటాయి.

భారత మార్కెట్లో కీవే బెండా వి302సి (Keeway Benda V302C) క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

భారత మార్కెట్లో లభిస్తున్న వి-ట్విన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విభాగంలో కీవే బెండా వి302సి మరియు కీవే కె-లైట్ 250వి రెండూ కూడా ఇప్పటికీ అత్యంత చౌకైన V-ట్విన్ క్రూయిజర్ మోటార్‌సైకిళ్లుగా ఉంటాయి. అయితే, ఈ ధర వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 వంటి శక్తివంతమైన ట్విన్-సిలిండర్ ఇంజన్ సెటప్‌తో కూడిన మేడ్ ఇన్ ఇండియా మోటార్‌సైకిళ్లు కూడా అందుబాటులో ఉండాయని గమనించాలి. కీవే బైక్స్ పట్ల ఆసక్తిగల కస్టమర్లు వాటిని ఆన్‌లైన్ లో కానీ లేదా బెనెల్లీ షోరూమ్ లలో కానీ బుక్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో కీవే బెండా వి302సి (Keeway Benda V302C) క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

ఇక కీవే కె-లైట్ 250వి క్రూయిజర్ విషయానికి వస్తే, ఈ చిన్న 250 సీసీ క్రూయిజర్ బైక్ కూడా మూడు రంగులలో లభిస్తుంది. వీటిలో మ్యాట్ బ్లూ, మ్యాట్ డార్క్ గ్రే మరియు మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి వాటి ధరలు వరుసగా రూ. 2.89 లక్షలు, రూ. 2.99 లక్షలు మరియు రూ. 3.09 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి. - ఈ 250 సీసీ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Tuesday, August 30, 2022, 15:44 [IST]
English summary
Keeway benda v302c cruiser motorcycle launched in india price specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+