రూ. 1.19 లక్షలకే కొత్త Keeway SR125 బైక్.. బుకింగ్ ప్రైస్ తక్కువ & త్వరలో డెలివరీలు

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఏదో ఒక కొత్త వెహికల్ విడుదలవుతూనే ఉంటుంది. అయితే ఈ రోజు హంగేరియన్ బైక్ తయారీ సంస్థ 'కీవే' (Keeway) ఒక కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ పేరు 'కీవే ఎస్ఆర్125' (Keeway SR125). దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

రూ. 1.19 లక్షలకే కొత్త Keeway SR125 బైక్.. బుకింగ్ ప్రైస్ తక్కువ & త్వరలో డెలివరీలు

భారతీయ విఫణిలో విడుదలైన కొత్త 'కీవే ఎస్ఆర్125' (Keeway SR125) ధర రూ. 1,19,000 (ఎక్స్ షోరూమ్ - ఇండియా). ఈ బైక్ మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి గ్లోసీ రెడ్, గ్లోసీ బ్లాక్ మరియు గ్లోసీ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ధరలు మాత్రం అన్నీ ఒకే విధంగా ఉంటాయి, కలర్ ఆప్సన్ బట్టి ధరలు మారే అవకాశం లేదు.

రూ. 1.19 లక్షలకే కొత్త Keeway SR125 బైక్.. బుకింగ్ ప్రైస్ తక్కువ & త్వరలో డెలివరీలు

ఈ కొత్త బైక్ కొనాలనుకునే కస్టమర్లు రూ. 1,000 చెల్లించి www.keeway-india.com వెబ్సైట్ లో లేదా సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ అన్ని అధీకృత బెనెల్లీ డీలర్‌షిప్‌ల వద్ద టెస్ట్ రైడ్‌ కోసం అందుబాటులో ఉంటుంది. కాగా ఈ నెల చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయి.

రూ. 1.19 లక్షలకే కొత్త Keeway SR125 బైక్.. బుకింగ్ ప్రైస్ తక్కువ & త్వరలో డెలివరీలు

కీవే కంపెనీ గత 5 నెలల్లో దాదాపు ఆరు వాహనాలను విడుదల చేసింది, కాగా ఇది కంపెనీ యొక్క ఏడవ ఉత్పత్తి కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే కంపెనీ భారతీయ మార్కెట్లో తన ఉనికిని బలంగా చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

రూ. 1.19 లక్షలకే కొత్త Keeway SR125 బైక్.. బుకింగ్ ప్రైస్ తక్కువ & త్వరలో డెలివరీలు

కీవే ఎస్ఆర్125 బైక్ ఆధునిక రెట్రో క్లాసిక్ డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్ లైట్ మరియు ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటి వున్నాయి. అదే సమయంలో ఇందులో కలర్ డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఇది బైక్ గురించి చాలా సమాచారాన్ని రైడర్ కి అందిస్తుంది.

రూ. 1.19 లక్షలకే కొత్త Keeway SR125 బైక్.. బుకింగ్ ప్రైస్ తక్కువ & త్వరలో డెలివరీలు

కొత్త కీవే ఎస్ఆర్125 బైక్ సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, 125సీసీ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 9.7 హెచ్‌పి మరియు 8.2 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ యొక్క మొత్తం బరువు 120 కేజీల వరకు ఉంటుంది, కావున మంచి పర్ఫామెన్స్ అందించడానికి అనుకూలంగా ఉంటుంది.

రూ. 1.19 లక్షలకే కొత్త Keeway SR125 బైక్.. బుకింగ్ ప్రైస్ తక్కువ & త్వరలో డెలివరీలు

కీవే కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైక్ యొక్క ముందు భాగంలో 300 మిమీ డిస్క్‌ బ్రేకులు మరియు వెనుక భాగంలో 210 మిమీ డిస్క్‌ బ్రేకులు ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ కాగా, ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14.5 లీటర్ల వరకు ఉంటుంది. కావున సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.

రూ. 1.19 లక్షలకే కొత్త Keeway SR125 బైక్.. బుకింగ్ ప్రైస్ తక్కువ & త్వరలో డెలివరీలు

కీవే ఎస్ఆర్125 బైక్ లాంచ్ సందర్భంగా కీవే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'వికాస్ ఝబఖ్' మాట్లాడుతూ.. బైక్ ప్రేమికుల కోసం క్లాసిక్ డిజైన్ తో మంచి పనితీరుని అందించే బైక్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది, కావున ఇది మార్కెట్లో తప్పకుండా మంచి ఆదరణ పొందే అవకాశం ఉందన్నారు.

రూ. 1.19 లక్షలకే కొత్త Keeway SR125 బైక్.. బుకింగ్ ప్రైస్ తక్కువ & త్వరలో డెలివరీలు

ఇదిలా ఉండగా ఇటీవల కంపెనీ రెండు స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. అవి కీవే కె300 ఎన్ (Keeway K300 N) మరియు కీవే కె300 ఆర్ (Keeway K300 R) బైకులు. వీటి ధరలు వరుసగా రూ. 2.65 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా) మరియు రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా).

రూ. 1.19 లక్షలకే కొత్త Keeway SR125 బైక్.. బుకింగ్ ప్రైస్ తక్కువ & త్వరలో డెలివరీలు

ఈ రెండు బైకులు 292.4సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. కావున ఈ ఇంజన్ 27.1 బిహెచ్‌పి పవర్ మరియు 25 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ తో కూడిన 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి.

రూ. 1.19 లక్షలకే కొత్త Keeway SR125 బైక్.. బుకింగ్ ప్రైస్ తక్కువ & త్వరలో డెలివరీలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో ఈ పండుగ సీజన్లో తక్కువ ధరకే విడుదలైన ఈ కీవే ఎస్ఆర్125 బైక్ తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. కేవలం తక్కువ ధర మాత్రమే కాకుండా మంది డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం కూడా దీనికి మరో కారణం. ఏది ఏమైనా ఈ బైక్ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనేది మాత్రం తెలియాల్సిన ప్రశ్న. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, October 13, 2022, 15:06 [IST]
English summary
Keeway sr125 launched in india price features engine and booking details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+